Jharkhand rape case : మహిళపై అత్యాచారం.. నిందితుడికి పంచాయతీ పెద్దల అండ!-26yearold woman raped by neighbour in jharkhands palamu panchayat tried to hush it up ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jharkhand Rape Case : మహిళపై అత్యాచారం.. నిందితుడికి పంచాయతీ పెద్దల అండ!

Jharkhand rape case : మహిళపై అత్యాచారం.. నిందితుడికి పంచాయతీ పెద్దల అండ!

Sharath Chitturi HT Telugu
May 21, 2023 08:00 AM IST

Jharkhand rape case : మహిళను అతను రేప్​ చేశాడు. పంచాయతీ దృష్టికి ఈ ఘటన వెళ్లింది. గ్రామ పెద్ద బంధువు కావడంతో.. నిందితుడిని రక్షించే ప్రయత్నం చేశారు. మహిళ చివరకు పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. ఈ ఘటన ఝార్ఖండ్​లో జరిగింది..

మహిళపై అత్యాచారం.. నిందితుడికి పంచాయతీ పెద్దల అండ!
మహిళపై అత్యాచారం.. నిందితుడికి పంచాయతీ పెద్దల అండ!

Jharkhand rape case : ఝార్ఖండ్​లోని ఓ గ్రామంలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై తన పొరుగింటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రేప్​ చేస్తుండగా.. మహిళ భర్తకు దొరికిపోయాడు. కానీ అతను ఆ గ్రామ పెద్ద బంధువు కావడంతో.. పంచాయతీ సైతం అతడిని రక్షించే ప్రయత్నం చేసింది!

ఇదీ జరిగింది..

26ఏళ్ల బాధితురాలు.. తన భర్తతో కలిసి పాలము జిల్లాలోని ఓ గ్రామంలో నివాసముంటోంది. కాగా.. ఆమెపై పొరుగింటి వ్యక్తి కన్నుపడింది. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి.. మహిళ భర్తను బయటకు తీసుకెళ్లాడు ఆ 36ఏళ్ల వ్యక్తి. అతడిని అక్కడే వదిలేసి.. గ్రామానికి తిరిగొచ్చాడు.

Jharkhand crime news : ఆ వెంటనే మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు నిందితుడు. ఆమెను కట్టేసి, నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె ప్రతిఘటించినా పట్టించుకోలేదు.

అదే సమయంలో.. ఇంటికి తిరిగి వెళ్లాడు ఆ మహిళ భర్త. భార్య ఇంట్లో లేకపోవడంతో కంగారు పడి, గాలించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో.. భార్యను ఆ 36ఏళ్ల వ్యక్తి రేప్​ చేస్తున్న దృశ్యాలను చూశాడు. దీనితో ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయారు.

పంచాయతీ పెద్దల నిర్వాకం..

Jharkhand latest news : ఈ వ్యవహారం గ్రామంలో కలకలం సృష్టించింది. మహిళపై అత్యాచారానికి పాల్పడింది.. గ్రామ పెద్ద బంధువు అని ఊరంతా తెలిసిపోయింది. బంధువుని కాపాడుకునేందుకు ఆ గ్రామ పెద్ద అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశాడు! ఈ విషయంపై పంచాయతీ సభ్యులు అనేకమార్లు చర్చలు జరిపారు. బాధితురాలికి డబ్బులిస్తామని అన్నారు. ఆమె ఒప్పుకోలేదు.  తనకు న్యాయం జరగాల్సిందేనని పట్టుబట్టింది. ఆ తర్వాత ఆమెను తన పుట్టింటికి పంపించే ప్రయత్నం చేశారు. అదీ జరగలేదు! ఇక చివరికి.. ఆ కుటుంబాన్ని ఇంట్లో నుంచి బయటకు రానివ్వకూడదని నిర్ణయించుకున్నారు. పటిష్ఠ భద్రతను మోహరించారు.

కానీ ఆ మహిళ ఆ ఇంట్లో నుంచి ఎలాగో అలా తప్పించుకుంది. చివరికి.. తన భర్తతో కలిసి సదర్​ పోలీస్​ స్టేషన్​కు వెళ్లింది. తనపై జరిగిన అత్యాచార ఘటనను ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. ఘటనను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన గ్రామ పెద్దలపై చర్యలు చేపట్టే అవకాశం ఉంది.

Palamu rape case : మరోవైపు.. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు పోలీసులు.

Whats_app_banner

సంబంధిత కథనం