Summer Tips | వేసవి వేడిని తగ్గించే.. సమ్మర్ ఫ్రూట్స్ ఇవే..-you must have these fruits in summer to reduce heat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /   Summer Tips | వేసవి వేడిని తగ్గించే.. సమ్మర్ ఫ్రూట్స్ ఇవే..

Summer Tips | వేసవి వేడిని తగ్గించే.. సమ్మర్ ఫ్రూట్స్ ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 25, 2022 02:25 PM IST

వేసవి దాదాపు వచ్చేసింది. ఈ సమ్మర్​లో వేడిని భరించడం చాలా కష్టం. పైగా వేడి వల్ల వచ్చే చెమట ఇంకా చిరాకు రప్పిస్తుంది. అయితే వేసవిలో మాత్రం చాలామంది ఫ్రూట్స్ గురించి వెయిట్ చేస్తారు. మామిడి పండు గురించి అయితే చెప్పనవసరం లేదు. సమ్మర్​లో ఎంతో మంది ఎదురు చూసే ఫ్రూట్ ఇది. అంతేకాదండోయ్.. సమ్మర్​లో దొరికే ఫ్రూట్స్ మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఎందుకో ఎలాగో ఇప్పుడు చూద్దాం.

సమ్మర్ ఫ్రూట్స్
సమ్మర్ ఫ్రూట్స్

1. మామిడి

పండ్లలో రారాజు మామిడి. వివిధ రకాల మామిడి పళ్లకు భారతదేశం పెట్టింది పేరు. మామిడి పండ్లను అన్ని వయసుల వారు చాలా ఇష్టంగా తింటారు. వీటిని తినడంతో పాటు, అధిక ఉష్ణోగ్రత నుంచి ఉపశమనం పొందడానికి మనం దానితో చాలా వంటకాలు, పానీయాలను సిద్ధం చేసుకోవచ్చు. దీనిలో విటమిన్ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.

2. పుచ్చకాయ

92% నీటి కంటెంట్‌తో ఈ పండు పోషకాలతో నిండి ఉంటుంది. పైగా అసలు కొవ్వే ఉండదు దీనిలో. ఇది లేకపోతే ఆ వేసవి పూర్తిగా అసంపూర్ణమే. దీనిలో విటమిన్లు ఏ, బి6, సి, యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటుంది. ఇది చర్మానికి చాలా మంచిది. మనల్ని హైడ్రేట్​గా ఉంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పుచ్చకాయ గింజల్లో పొటాషియం, మెగ్నీషియం అధికంగా కలిగి ఉంటాయని అధ్యయనాలు రుజువు చేశాయి.

3. లిచి

కేలరీలు తక్కువగా ఉండే మరొక పండు లిచీ. ఇది ఆహ్లాదకరమైన తీపి, పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఇది మొటిమల నుంచి మిమ్మల్ని రక్షిస్తుంది. లిచీలో విటమిన్ సి గణనీయమైన మొత్తంలో ఉంటుంది. ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. లిచిలో కొలెస్ట్రాల్, సంతృప్త కొవ్వులు లేవు. కాబట్టి మీరు నిస్సందేహంగా డైట్​లో చేర్చుకోవచ్చు.

4. బొప్పాయి

పండిన బొప్పాయి గిన్నెను ఎవరు ఇష్టపడరు చెప్పండి. బొప్పాయి రక్తపోటును తగ్గిస్తుంది అంతేకాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది వేడిని తగ్గిస్తుంది. అంతే కాకుండా టాన్‌ని తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా కలిగి ఉన్న బొప్పాయి.. గుండె జబ్బులు తగ్గించడానికి సహాయపడుతుంది. దీనిలో ఉండే బీటా కెరోటిన్ మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆస్తమా ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

5. బత్తాయి

ఒక గ్లాసు బత్తాయి రసం తాగకుండా వేసవిలో బయటకు వెళ్లడాన్ని మీరు ఊహించగలరా? పీచు సమృద్ధిగా ఉండే మోసాంబి మలబద్ధకం నుంచి మీకు ఉపశమనం ఇస్తుంది. అనారోగ్యకరమైన డ్రింక్స్​కు ప్రత్యామ్నాయంగా దీనిని తీసుకోవచ్చు. ఇది మనల్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది. అలాగే అవసరమైన ఖనిజాలు, విటమిన్‌లను కూడా అందిస్తుంది. ఇది మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్