Heart Attack Symptoms : ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణాలకే ముప్పు!-warning signs of a heart attack that may be misunderstood ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Heart Attack Symptoms : ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణాలకే ముప్పు!

Heart Attack Symptoms : ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.. ప్రాణాలకే ముప్పు!

HT Telugu Desk HT Telugu
Jul 09, 2022 11:45 PM IST

ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు పెరిగిపోతున్నాయి. జీవనశైలి,ఆహారం, ఒత్తిడి వంటి కారణాల వల్ల గుండెపోటు సమస్యలు వస్తున్నాయి. ప్రతి సంవత్సరం 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు. కాబట్టి గుండె పోటు సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకోవడం మంచిది.

Heart Attack Symptoms
Heart Attack Symptoms

ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో బాధపడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం , ప్రతి సంవత్సరం 18 మిలియన్ల మంది గుండె జబ్బులతో మరణిస్తున్నారు . కాబట్టి ఈ వ్యాధి లక్షణాలు ముందుగానే తెలుసుకుని చికిత్స తీసుకోవడం మంచిది. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుండెపోటుకు ముందు, మన శరీరం కొన్ని లక్షణాలను సూచిస్తుంది. కానీ చాలా మంది వాటిని విస్మరిస్తుంటారు. ఈ లక్షణాలను విస్మరించడం వల్ల అవి ప్రాణాంతకంగా మారవచ్చు. గుండెపోటు ప్రమాదాన్ని సూచించే లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయవద్దు

వాంతులు, వికారం, తల తిరగడం: గుండెపోటుకు ముందు వాంతులు, వికారం మరియు తల తిరగడం వంటి లక్షణాలు ఉంటాయి.శరీరంలోని భాగాలకు రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడటం వల్ల వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు వస్తాయి.కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఈ లక్షణాలు తగ్గుతాయి. కాబట్టి ఈ లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.

ఛాతీ నొప్పి - గుండెపోటుకు ముందు ఛాతీ నొప్పి వస్తుంది. కానీ దీన్ని సాధరణ నొప్పిగా భావించి వదిలేస్తుంటారు. ఈ నొప్పి మీకు కొంతసేపు అసౌకర్యంగా అనిపిస్తుంది. ఈ సమస్యను ఎదురు కాగానే వెంటనే చికిత్స తీసుకోవడం మంచిది.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది - వేగంగా నడుస్తున్నప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు తరచుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇది గుండెపోటు లక్షణం కావచ్చు. అందువల్ల, సమయానికి చికిత్స చేస్తే ఎలాంటి అపాయం ఉండదు.

ఆకస్మిక చెమటలు - అకస్మాత్తుగా చలి, చెమట పట్టినట్లు అనిపిస్తుంటే... మీరు ఇలాంటి లక్షణాలను విస్మరించకుండా వైద్య పాయం తీసుకోవాలి.

గుండెల్లో మంట - గుండెలొ మంటగా అనిపిస్తే వైద్యున్ని సంప్రదించండి. ఇది గుండె పోటుకు మెుదటి సంకేతం. కావున హృదయంలో నొప్పిగా అనిపిస్తే జాగ్రత్తగా ఉండాలి. సరైన చికిత్స తీసుకోవాలి.

WhatsApp channel

సంబంధిత కథనం