UPSSSC Recruitment 2022 : 701 ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
UPSSSC Recruitment 2022 : UPSSSC రిక్రూట్మెంట్లో భాగంగా.. 701 ఫారెస్ట్ గార్డ్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు upsssc.gov.inలో ద్వారా అప్లై చేసుకోవచ్చు.
UPSSSC Recruitment 2022 : ఉత్తరప్రదేశ్ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్ (UPSSSC) 701 ఫారెస్ట్ గార్డ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దరఖాస్తు విండో తెరిచినప్పుడు ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ upsssc.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 17, 2022 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ నవంబర్ 6, 2022.
UPSSSC Recruitment 2022 అర్హతలు
* పోస్ట్‌కి అర్హత సాధించడానికి అభ్యర్థులు జూలై 1, 2022 నాటికి కనీసం 21 ఏళ్ల వయస్సు, గరిష్టంగా 40 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
* అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/బోటనీ/జువాలజీ సబ్జెక్టులలో సైన్స్ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి.
పోస్టుకోసం దరఖాస్తు ఎలా చేయాలంటే..
* అధికారిక వెబ్‌సైట్ upsssc.gov.in ని సందర్శించండి.
* ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ కోసం దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయండి.
* దరఖాస్తు ఫారమ్‌ను నింపండి. అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయండి.
* రుసుము చెల్లించండి.
* భవిష్యత్ సూచన కోసం సమర్పించిన పత్రాన్ని సేవ్ చేసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్