Safety Tips: అమ్మాయిలు క్యాబ్‌లో లేదా ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆపద అనిపిస్తే ఈ చిట్కాలతో బయటపడండి-survive with these tips if girls feel unsafe traveling alone in a cab or auto ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Safety Tips: అమ్మాయిలు క్యాబ్‌లో లేదా ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆపద అనిపిస్తే ఈ చిట్కాలతో బయటపడండి

Safety Tips: అమ్మాయిలు క్యాబ్‌లో లేదా ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆపద అనిపిస్తే ఈ చిట్కాలతో బయటపడండి

Haritha Chappa HT Telugu
Aug 21, 2024 03:30 PM IST

Safety Tips: క్యాబ్‌లో లేదా ఆటోలో ఒంటరిగా ప్రయాణించాల్సిన సందర్భాలు అమ్మాయిలకు ఎక్కువగానే వస్తాయి. కొన్నిసార్లు క్యాబ్ డ్రైవర్లు లేదా ఆటో డ్రైవర్ల వల్ల ఆపద ఎదుర్కోవచ్చు. అలాంటి సమయంలో మీ భద్రత కోసం ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

క్యాబ్, ఆటోల్లో అమ్మాయిలు పాటించాలసిన సేఫ్టీ టిప్స్
క్యాబ్, ఆటోల్లో అమ్మాయిలు పాటించాలసిన సేఫ్టీ టిప్స్ (Pixabay)

Safety Tips: కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన దారుణం మన దేశాన్ని షాక్‌కు గురిచేసింది. ఈ ఘటన మళ్లీ మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చలు జరిగేలా చేసింది. మహిళలపై పెరుగుతున్న నేరాలు ఇప్పుడు అందరి మదిలో కూడా భయాన్ని నింపాయి. ముఖ్యంగా ఉద్యోగాలకు, కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు క్యాబ్‌లో, ఆటోలో ఒంటరిగా రావడానికి భయపడుతున్నారు అలా క్యాబ్ లేదా ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు భయపడకుండా మీరు ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.

ఈ చిట్కాలు పాటించండి

1. మీరు ఏదైనా ప్రదేశానికి వెళ్లాలనుకుంటే ముందుగానే రైడ్‌ను బుక్ చేసుకోండి. రోడ్డుపై ఒంటరిగా నిలబడి రైడ్ బుక్ చేసుకోవడం వంటివి చేయకూడదు. క్యాబ్ మీ ఇంటికి లేదా మీరు ఉన్న భవనం దగ్గరికి వచ్చాకే మీరు భవనం నుండి బయటికి వచ్చి క్యాబ్ ఎక్కండి.

2. క్యాబ్ లేదా ఆటో ఎక్కాక మీ బాడీ లాంగ్వేజ్ భయపడుతున్నట్టు ఉండకూడదు. మీ ముఖం, మీ బాడీ లాంగ్వేజ్‌లో భయం కనిపించకూడదు. అలా కనిపిస్తే నేర ప్రవృత్తి ఉన్న వ్యక్తులు మరింత ధైర్యంగా పనులు చేస్తారు.

3. మీరు క్యాబ్ లేదా ఆటోను ఆన్‌లైన్లో బుక్ చేసినా లేక దారిలో వెళ్తున్నప్పుడు ఆపి ఎక్కినా కూడా... వాహనాన్ని, నెంబర్ ప్లేట్లను ఫోటో తీయండి. ఆ ఫోటోను మీకు తెలిసిన వారికి వెంటనే పంపండి.

4. క్యాబ్ ఎక్కిన తర్వాత మీరు ఒంటరిగా ప్రయాణిస్తుంటే డోర్ హ్యాండిల్స్ చెక్ చేసుకోండి. అవి లోపల నుండి కూడా పనిచేస్తున్నాయో లేదో తనిఖీ చేయండి. అలాగే క్యాబ్ డోర్ మీద ఉండే అద్దాలను ఓపెన్ చేసే ఉంచమని చెప్పండి. వాటిని మూసే అవకాశం ఇవ్వకండి.

5.క్యాబ్‌లో లేదా ఆటోలో ఒంటరిగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ విషయాన్ని కచ్చితంగా మీ కుటుంబ సభ్యులకు కాల్ చేసి చెప్పండి. అలాగే ఏ సమయంలో క్యాబ్ ఎక్కారు, ఆ వాహనం నెంబర్, మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు, ఎన్ని గంటలకు ఇంటికి చేరుకుంటారో... ఫోన్లో డ్రైవర్ కు వినిపించేటట్టే గట్టిగా మాట్లాడండి.

6. మీకు క్యాబ్ డ్రైవర్ లేదా ఆటో డ్రైవర్ ప్రవర్తన అనుమానంగా అనిపిస్తే రైడ్ పూర్తయ్యే వరకు మీరు ఫోన్లో కుటుంబంతోనే లేదా మీ స్నేహితులతోనూ మాట్లాడుతూనే ఉండండి అలాగే మీరు ఉన్న లొకేషన్ గురించి ఎప్పటికప్పుడు వారికి క్యాబ్ డ్రైవర్ వినేలా చెబుతూనే ఉండండి

7. కొన్ని రకాల భద్రత యాప్లు కూడా ఉన్నాయి ఆ సేఫ్టీ ఆపిల్ నన్ను మీ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోండి ఒక క్లిక్ తో అత్యవసర కాలు వెళ్లేలా దాన్ని సెట్ చేయండి అలాగే ఆ యాప్ లొకేషన్ కూడా మీ సన్నిహితులకు షేర్ చేస్తుంది

8. క్యాబ్ లేదో ఆటోలో ఒంటరిగా వెళుతున్నప్పుడు మీ లొకేషన్ జిపిఎస్ లో ఆన్ చేసి ఉంచండి మీ లొకేషన్ ను మీ స్నేహితులతో షేర్ అయ్యేలా చూడండి

9. కొందరు క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు షార్్ కట్‌లోకి తీసుకెళ్తామని చెబుతూ ఉంటారు. అలాంటివి వద్దని చెప్పండి. జనాలు నడిచే మెయిన్ రోడ్డు మీద నుంచి వెళ్లడానికి ఆయనకి అనుమతినివ్వండి.

10. మీ భద్రత కోసం మీ దగ్గర ఎప్పుడూ పెప్పర్ స్ప్రే లేదా సేఫ్టీ టార్చ్ ను ఉంచుకోండి. స్ప్రే కళ్ళల్లో కొడితే కాసేపు వారు మంటతో ఏమీ చేయలేరు. అలాగే సేఫ్టీ టార్చ్ తో వారి శరీరానికి షాక్ ఇస్తే కాసేపు వారికి తీవ్రమైన షాక్‌తో ఏమీ చేయలేరు. ఆ టైంలో మీరు పారిపోవచ్చు.

11. క్యాబ్‌లో లేదా ఆటోలో ప్రయాణిస్తున్నప్పుడు నిత్యం ఫోన్ స్క్రీన్ పైనే మీ దృష్టిని పెట్టొద్దు. అప్రమత్తంగా ఉండి చుట్టూ చూడండి. అయినా సరైన రూట్లోనే వెళ్తున్నాడో లేదో చూసుకోండి. గుర్తుతెలియని వ్యక్తులు మీ క్యాబ్‌ను లేదా ఆటోను ఆపి మధ్యలో ఎక్కుతుంటే వెంటనే మీరు క్యాబ్ లేదా ఆటో దిగి పారిపోవడం ఉత్తమం.

టాపిక్