Egg Shells: ఎగ్ షెల్స్ పడేయకుండా.. ఇలా ఉపయోగించండి!
సాధరణంగా గుడ్డును ఉపయోగించిన తర్వాత చాలా మంది వాటి షెల్స్‌ను బయట పడేస్తుంటారు. అయితే వాటితో అద్ఢుత ప్రయోజనాలు ఉన్నాయి. చర్మ సౌందర్యాన్ని పెంపోదించడంలో షెల్స్ పొడి చాలా బాగా ఉపయోగపడుతుంది
గుడ్లు ఆరోగ్యానికి మాత్రమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా గుడ్డు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి. గుడ్డులోని తెల్లసొన, పచ్చసొన రెండూ ఆరోగ్యానికి, అందానికి చాలా మేలు చేస్తాయి. చర్మ సంబంధమైన సమస్యలకు గుడ్డు పెంకులు ఉపయోగపడతాయి.గుడ్డు షెల్స్ చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది.
గుడ్డు షెల్స్ ఎలా ఉపయోగించాలి?
గుడ్డు పెంకును ఉపయోగించే ముందు ఎండలో ఆరబెట్టాలి. తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి. కావాలంటే, ఈ పొడిలో ఇతర పోషకాలను జోడించి ఉపయోగించవచ్చు. వెనిగర్‌ను గుడ్డు షెల్ పౌడర్‌తో కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి మసాజ్ చేయడం వల్ల ఫేస్ స్మూత్‌గా మారుతుంది. ఈ రెమెడీని కొన్ని వారాల పాటు ఉపయోగించడం ద్వారా ముఖం ఫెయిర్, ప్రకాశవంతంగా మారుతుంది.
1. గుడ్డు పెంకుతో తయారు చేసిన పౌడర్‌కి నిమ్మరసం లేదా వెనిగర్‌ను అప్లై చేయడం వల్ల చర్మం మచ్చలు లేకుండా ఉంటుంది. ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. స్కిన్‌పై ఎలాంటి ఇన్ఫెక్షన్ ఉన్నా ఈ రెమెడీ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
2. గుడ్డు పెంకులో రెండు చెంచాల తేనె కలపండి. తేమగా ఉన్న ముఖంపై రాస్తే ప్రయోజనం ఉంటుంది. పౌడర్, తేనె కలిపి చిక్కటి పేస్ట్‌లా చేసి చర్మంపై ఉండే గాయలపై రాయడం వల్ల తేడాను గమనించవచ్చు.
3. గుడ్డు పెంకుతో చేసిన పొడికి కొద్దిగా చక్కెర పొడిని కలపి తర్వాత గుడ్డులోని తెల్లసొనతో కలసండి. వారానికి ఒకసారి దీన్ని మాస్క్‌గా అప్లై చేయండి. కొన్ని రోజుల తర్వాత ఫలితాన్ని చూడవచ్చు.
4. దంతాలు పసుపు రంగులో ఉంటే ఈ పొడితో మీ దంతాలను క్రమం తప్పకుండా శభ్రం చేయండి. ఇలా చేయడం వల్ల దంతాలు సహజసిద్ధంగా తెల్లగా మారుతాయి.
5 ఈ పొడిలో అలోవెరా జెల్ మిక్స్ చేసి ముఖానికి రాసుకోవచ్చు. దీని ఉపయోగం వల్ల చర్మానికి అవసరమైన తేమ అందుతుంది. ముఖానికి కాంతిని ఇస్తుంది.
సంబంధిత కథనం