Saturday Vibes : వైఫల్యం నిరాశకు కారణం కాకూడదు.. కొత్త ప్రేరణకు పునాది కావాలి
Saturday Motivation : ఒక్క వైఫల్యంతో కొంతమంది జీవితాంతం కుమిలి కుమిలి ఏడుస్తారు. కానీ ఒక్క వైఫల్యం జీవితాన్ని నాశనం చేస్తుందంటే.. మీ ఆలోచనలు సరిగా లేవని అర్థం. ఒక వైఫల్యం.. మరో ప్రేరణకు పునాది కావాలి.
ఏడుపు లేని పుట్టుక.., వైఫల్యం లేని జీవితం ఉండదు. అదే వాస్తవం. కానీ ఒక్క వైఫల్యంతో జీవితానికి సరిపడా నిరాశలోకి వెళ్లిపోతారు కొంతమంది. కానీ కొత్త ప్రేరణకు పునాదిలాగా ఫీల్ అవ్వాలి. అప్పుడే ముందుకు వెళ్తారు. జీవితానికి సరిపోయేంత అనుభవాలను పోగేసుకోవాలి. నిరాశను పోగేసుకుంటే.. ఉన్న చోటే ఉంటావ్. ఒక్క అడుగూ ముందుకు వేయలేవ్. అడుగు పడితేనే అనుభవాలు ఎదరవుతాయ్. అక్కడే ఆగిపోతే.. నిరాశలో మునిగిపోతావ్.
మనం అనుకున్న ఒక్క విషయం జరగకపోవడం వేరు.. కానీ అన్ని విషయాలూ జరగవు అని అనుకోవడం వేరు. పాజిటివ్ గా ఆలోచిస్తే.. కచ్చితంగా ఏదో ఒక రోజు.. నువ్ అనుకున్నది నీ దగ్గరకు వస్తుంది. గమ్యం ముఖ్యం కాదు.. గమ్యం కోసం వేసే అడుగులే కీలకం. చిన్నప్పుడు నడుస్తూ.. ఉంటే.. అడుగులు తడబడతాయి. ఆ తర్వాతే నడక వచ్చేది. జీవితమనే ప్రయాణంలో నడుస్తుంటే.. వైఫల్యాలు ఎదురవుతాయ్.. వాటికి నిరాశ చెందింతే.. అన్ని అవయవాలు ఉన్నా.. మానసికంగా వికలాంగుడిలా తయారవుతావ్.
గెలుపు, ఓటమి.. శాశ్వతం కాదు.. కానీ వాటి కోసం చేసే ప్రయత్నాల్లో నువ్ చూసిన అనుభవాలు శాశ్వతం. ఒక్కసారి గెలుస్తావ్.. వేరే దారిలో ఓడిపోతావేమో.. ఒక్కసారి ఓడిపోతావ్.. కానీ మళ్లీ వేరే దారిలో గెలుస్తావేమో. అందుకే గెలుపు కంటే ముందు ఓటమి చూడాలి. గెలిస్తే.. ప్రపంచానికి నువ్ తెలుస్తావ్. కానీ ఒక్కసారి ఓడిపోయి చూడు.. ప్రపంచమంటే ఏంటో నీకు తెలుస్తుంది.
ఏ విషయానికి కూడా నిరాశ చెందకు. ఒక వేళ చెందినా.. అది తాత్కాలికమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఓటమి ఒకరి సొంత కాదు.. గెలుపు ఒకరి బానిస కాదు. ప్రయత్నాలు చేయడం.. వైఫల్యాలు చెందడం, గెలవడం.. అదే జీవితం. నేను ఒక్కడిని ఏం చేయగలను అని నిరాశ పడకండి.. ఒక్కసారి పైకి తలెత్తి చూడు.. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడు కూడా ఒక్కడే.
సంబంధిత కథనం
టాపిక్