World Thalassemia Day 2023: ప్రపంచ తలసేమియా దినం ఎందుకు జరుపుకుంటామంటే..-know the significance and importance of world thalassemia day 2023 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  World Thalassemia Day 2023: ప్రపంచ తలసేమియా దినం ఎందుకు జరుపుకుంటామంటే..

World Thalassemia Day 2023: ప్రపంచ తలసేమియా దినం ఎందుకు జరుపుకుంటామంటే..

Tapatrisha Das HT Telugu
May 07, 2023 06:00 PM IST

World Thalassemia Day 2023: ప్రపంచ తలసేమియా దినం ప్రాముఖ్యత, థీమ్ గురించి తెలుసుకోండి.

World Thalassaemia Day 2023: Date, history, significance, theme
World Thalassaemia Day 2023: Date, history, significance, theme (Shutterstock)

World Thalassaemia Day 2023: రక్తం అన్ని శరీర భాగాలకు ఆక్సిజన్ సరఫరా చేయడంలో అవసరమయ్యే ప్రొటీన్, ఎర్ర రక్తకణాలు సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండటమే తలసేమియా. అలసట, నీరసం, శరీరంలో ఎదుగుదల తక్కువగా ఉండటం దీని లక్షణాలని చెప్పొచ్చు. ఈ వ్యాధి తీవ్రస్థాయిలో ఉంటే రక్త మార్పిడి లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరమవుతుంది. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రపంచ తలసేమియా రోజును జరుపుతారు. ఈ రోజు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

తేదీ:

ఈ సంవత్సరం మే 8వ తేదీన ప్రపంచ తలసేమియా దినాన్ని నిర్వహిస్తున్నారు. ఈ రోజు వ్యాధి గురించి అవగాహన కల్పించే కొన్ని సంస్థలు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తాయి. చికిత్సల గురించి , వ్యాధి లక్షణాల గురించి తెలియజేస్తూ వివిధ వర్క్‌షాపులు ఏర్పాటు చేస్తారు.

థీమ్:

ఈ సంవత్సరం ప్రపంచ తలసేమియా దినం థీమ్ “బీ అవేర్, షేర్ ,కేర్”. ఈ వ్యాధి గురించి అందరూ కలిసి పనిచేయాలని, అందుబాటులో ఉన్న చికిత్సల గురించి , వ్యాధి గురించి అవగాహన కల్పించాలని దాని ఉద్దేశం.

చరిత్ర:

తలసేమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ స్థాపకులు, అద్యక్షులు పానోస్ ఎంగ్లేజోస్, 1994 లో ఈ రోజును ప్రకటించారు. తన కుమారుడు జార్జ్, తలసేమియాతో ధైర్యంగా పోరాడిన తలసేమియా వ్యాధి బాధితులకు గుర్తుగా ఈ రోజును అంకితం చేశారు. అప్పటి నుంచి ప్రపంచ తలసేమియా రోజు ను మే 8 న జరుపుతున్నాం.

ప్రాముఖ్యత:

తల్లిదండ్రుల నుంచి పిల్లలకు వచ్చే జన్యుపరమైన వ్యాధి ఇది. ఈ వ్యాధికి సంబంధించిన ఊహగానాలు, వదంతులను తుడిచేసి సరైన సమాచారాన్ని చేరవేయడానికి ఈ రోజున చాలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక సంస్థలు ఈ వ్యాధి చికిత్స ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వచ్చేలా చేయాలని కలిసి పనిచేస్తున్నాయి. అయితే తలసేమియా బాధితుల్ని పెళ్లి చేసుకునే ముందు ఒకసారి వైద్యుల్ని సంప్రదించాలని, తరువాత ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకూడదని సలహా ఇస్తున్నారు వైద్యులు.

WhatsApp channel

టాపిక్