alu sandwich: టైం లేకపోతే.. ఈ ఫటాఫట్ ఆలూ శ్యాండ్‌విచ్ చేస్కోండి..-know recipe details of alu masala sandwich in detail ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Alu Sandwich: టైం లేకపోతే.. ఈ ఫటాఫట్ ఆలూ శ్యాండ్‌విచ్ చేస్కోండి..

alu sandwich: టైం లేకపోతే.. ఈ ఫటాఫట్ ఆలూ శ్యాండ్‌విచ్ చేస్కోండి..

HT Telugu Desk HT Telugu
May 23, 2023 06:30 AM IST

alu sandwich: అల్పాహారంలోకి సులువుగా తక్కువ సమయంలో చేసుకోగలిగే ఆలూ శ్యాండ్‌విచ్ సులభంగా ఎలా తయారు చేసుకోవాలో వివరంగా చూసేయండి.

బంగాళదుంప శ్యాండ్‌విచ్
బంగాళదుంప శ్యాండ్‌విచ్ (freepik)

ఉదయం అల్పాహారం చేసుకోడానికి సమయం లేకపోతే సులువుగా ఈ బంగాళా దుంప శ్యాండ్ విచ్ చేసుకోండి. తయారీ చాలా సులభం. కావాల్సిన పదార్థాలు కూడా తక్కువే.

కావాల్సిన పదార్థాలు:

2 ఉడికించిన బంగాళా దుంపలు

సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు

రెండు చెంచాల క్యాప్సికం ముక్కలు

1 చెంచా కొత్తిమీర

అర చెంచా కారం

1 స్పూన్ చాట్ మసాలా

పావు స్పూన్ ఉప్పు

8 బ్రెడ్ స్లైసులు

2 చెంచాల టమాటా సాస్

2 చెంచాల గ్రీన్ చట్నీ

1 టమాటా సన్నటి గుండ్రటి ముక్కలు

చీజ్

బటర్

తయారీ విధానం:

  1. ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపను మెత్తగా మెదుపుకోవాలి, అందులో ఉల్లిపాయ తరుగు, క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి.
  2. దాంట్లోనే సగం చెంచా కారం, చెంచా చాట్ మసాలా, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.
  3. ఇపుడు రెండు బ్రెడ్ స్లైసులు తీసుకుని ఒక వైపు చెంచా టమటా సాస్, ఒక చెంచా గ్రీన్ చట్నీని బ్రెడ్ అంతటా రాసుకోవాలి.
  4. ఆలూ మసాలా బ్రెడ్ అంతటా రాసుకోవాలి. కాస్త మిరియాల పొడి, చీజ్ తురుము, సన్నగా గుండ్రగా తరిగిన టమాటా ముక్కలు, మీద ఇంకో బ్రెడ్ ఒక వైపు టమాటా సాస్ రాసుకుని ఆలూమసాలా మీద పెట్టుకోవాలి.
  5. పెనం మీద బటర్ వేసుకుని ఆలూ మసాలా పెట్టుకున్న బ్రెడ్ ముక్కలు పెట్టుకోవాలి. రెండు వైపులా బటర్ వేసుకుని కాల్చుకోవాలి.

రెండు ముక్కలుగా చేసుకుని టమాటా సాస్ తో ఈ శ్యాండ్ విచ్ సర్వ్ చేసుకోవాలి.

WhatsApp channel