Beetroot Rice: సింపుల్‌గా, టేస్టీగా బీట్‌రూట్ రైస్ రెసిపీ.. పిల్లలూ ఇష్టంగా తింటారు..-know how to cook beetroot rice or pulao in tasty way ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Beetroot Rice: సింపుల్‌గా, టేస్టీగా బీట్‌రూట్ రైస్ రెసిపీ.. పిల్లలూ ఇష్టంగా తింటారు..

Beetroot Rice: సింపుల్‌గా, టేస్టీగా బీట్‌రూట్ రైస్ రెసిపీ.. పిల్లలూ ఇష్టంగా తింటారు..

Koutik Pranaya Sree HT Telugu
Dec 21, 2023 11:00 AM IST

Beetroot Rice: సింపుల్‌గా, రుచిగా బీట్‌రూట్ రైస్ ఎలా చేసేయాలో పక్కాకొలలతతో సహా చూసేయండి.

బీట్‌రూట్ రైస్
బీట్‌రూట్ రైస్ (https://creativecommons.org/licenses/by-sa/4.0)

పిల్లల లంచ్ బాక్స్ లోకైనా, లేదా మధ్యాహ్న భోజనంలోకి అయినా బీట్‌రూట్ బాగుంటుంది. బీట్‌రూట్ ఇష్టపడనివాళ్లు దాన్ని తినడానికి ఇది మంచి ఆప్షన్. చాలా తక్కువ మసాలాలు, నూనెతో చేస్తాం కాబట్టి ఆరోగ్యకరం కూడా. తయారీ ఎలాగో చూసేయండి.

బీట్‌రూట్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు:

2 కప్పులు పొడిగా ఉడికించుకున్న అన్నం

2 బీట్‌రూట్, సన్నటి తురుము

2 టమాటాలు, సన్నటి ముక్కలు

పావు కప్పు పచ్చి బటానీ (ఆప్షనల్)

సగం కప్పు ఉల్లిపాయ ముక్కలు

2 పచ్చిమిర్చి

పావు చెంచా జీలకర్ర

పావు చెంచా ఆవాలు

1 కరివేపాకు రెబ్బ

సగం చెంచా అల్లం తురుము

1 చెంచా సాంబార్ పొడి

సగం చెంచా పసుపు

పావు చెంచా యాలకుల పొడి

తగినంత ఉప్పు

2 చెంచాల నూనె

1 చెంచా నెయ్యి

కొద్దిగా కొత్తిమీర తరుగు

బీట్‌రూట్ రైస్ తయారీవిధానం:

  1. ఈ రైస్ చేయడానికి అప్పుడే ఉడికించుకున్న అన్నం లేదా మిగిలిపోయినా అన్నం అయినా వాడుకోవచ్చు.
  2. ముందుగా కడాయి పెట్టుకుని నూనె, చెంచా నెయ్యి కూడా వేసుకోవాలి. వేడెక్కాక ఆవాలు, జీలకర్ర వేసుకుని చిటపటలాడనివ్వాలి. కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి.
  3. అల్లం తరుగు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని కాస్త రంగు మారేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు బటానీ, టమాటా ముక్కలు కూడా వేసుకుని కలుపుకోవాలి. పసుపు, కొద్దిగా సాంబార్ పొడి వేసుకుని కలుపుకోవాలి.
  4. టమాటా కాస్త మెత్తబడ్డాక బీట్‌రూట్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. మంట సన్నం పెట్టి మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి.
  5. పచ్చివాసన పోయి కాస్త మెత్తబడ్డాక యాలకుల పొడి, కొత్తిమీర తరుగు వేసుకుని ఒకసారి కలియబెట్టి ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న అన్నం కలిపేసుకోవాలి.
  6. అన్నీ బాగా కలిశాక ఒక నిమిషం పాటూ మూత పెట్టి స్టవ్ కట్టేయాలి. దీన్ని రైతాతో సర్వ్ చేసుకుంటే బాగుంటుంది.

WhatsApp channel

టాపిక్