చలికాలంలో రోజూ నెయ్యి తింటే ఇన్ని ప్రయోజనాలు-know why you must eat ghee daily during winter season ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  చలికాలంలో రోజూ నెయ్యి తింటే ఇన్ని ప్రయోజనాలు

చలికాలంలో రోజూ నెయ్యి తింటే ఇన్ని ప్రయోజనాలు

HT Telugu Desk HT Telugu
Nov 08, 2023 04:45 PM IST

Ghee Benefits in winter: చలికాలంలో నెయ్యిని తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఎంతోమంది నెయ్యి తింటే బరువు పెరుగుతామని తినడం మానేస్తారు. నిజానికి రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు. పైగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

చలికాలంలో నెయ్యి వాడకం వల్ల ప్రయోజనాలు తెలుసుకోండి
చలికాలంలో నెయ్యి వాడకం వల్ల ప్రయోజనాలు తెలుసుకోండి

చలికాలం వచ్చేసింది. వాతావరణం చల్లబడిపోయింది. రాత్రయితే చాలు ఇంటి తలుపులు, కిటికీలు మూసుకోవాల్సిన పరిస్థితి. చలికాలంలో మనిషి రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆహారాలను ప్రత్యేకంగా తినాలి. అలా చలికాలంలో కచ్చితంగా తినాల్సిన ఆహారాలలో నెయ్యి ఒకటి.

ఇది మన శరీరాన్ని వెచ్చగా ఉంచడమే కాదు. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పోషకాహార నిపుణులు చలికాలంలో నెయ్యిని తప్పనిసరిగా రోజువారీ ఆహారంలో భాగం చేసుకోమని సూచిస్తున్నారు. ఎంతోమంది నెయ్యి తింటే బరువు పెరుగుతామని తినడం మానేస్తారు. నిజానికి రోజుకు ఒక స్పూను నెయ్యి తినడం వల్ల ఎలాంటి బరువు పెరగరు. పైగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

నెయ్యిలో ఏ పోషకాలు ఉంటాయి?

వందల ఏళ్లుగా భారతీయ వంటకాల్లో నెయ్యి భాగమైపోయింది. నెయ్యిని తినడం వల్ల శరీరానికి శక్తి స్థిరంగా అందుతుంది. నెయ్యి చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అందుకే మీ వింటర్ డైట్లో కచ్చితంగా నెయ్యి ఉండాల్సిందే.

  1. ముఖ్యంగా చలికాలంలో నెయ్యిని తింటే శరీరం వెచ్చగా ఉంటుంది.
  2. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి.
  3. నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.
  4. దీనిలో కొవ్వులో కరిగే విటమిన్లు అయినా విటమిన్ A, విటమిన్ E పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో ముఖ్యం.
  5. నెయ్యిని తినడం వల్ల స్త్రీలకు రుతుస్రావ సమయంలో వచ్చే సమస్యలు కూడా తగ్గుతాయి.

నెయ్యిని ఎలా వాడాలి?

  1. నెయ్యిని మీ ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలో ఆలోచిస్తున్నారా? చపాతీలు చేసుకునేటప్పుడు పైన నెయ్యిని అప్లై చేయండి. మంచి రుచిగా ఉంటుంది.
  2. స్టఫ్డ్ పరాటాలు తయారు చేసినప్పుడు కూడా నెయ్యిని పరాటా మధ్యలో స్పూన్‌తో అద్దవచ్చు. అది పరాటాకు మంచి రుచిని అందిస్తుంది.
  3. కూరలు వండేటప్పుడు నూనెకు బదులు నెయ్యిని వేసుకోండి. లేదా ఒక స్పూను నెయ్యి, ఒక స్పూన్ నూనె వేసుకుని కూరలు వండుకోవచ్చు.
  4. అలాగే అన్నం ఉడికాక స్టవ్ ఆపేముందు ఒక స్పూను నెయ్యిని అన్నం పై చల్లుకున్నా మంచిదే. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉన్న కొవ్వులో కరిగే పోషకాలను శరీరం గ్రహించేలా నెయ్యి చేస్తుంది.
  5. పప్పు, నెయ్యి మంచి కాంబినేషన్. పప్పు వండుకున్నప్పుడు నెయ్యితోనే పోపు పెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది మంచి రుచిగా ఉంటుంది.
  6. స్వీట్ కార్న్, పాప్ కార్న్ వంటి వాటి తయారీలో కూడా నెయ్యిని భాగం చేసుకోవచ్చు. ఆకుకూరలు వండేటప్పుడు అందులో ఒక స్పూను నెయ్యిని వేసి వండండి. అలాగే టీ, కాఫీ వంటి వాటిలో కూడా ఒక చెంచా నెయ్యి వేసుకోవచ్చు.

Whats_app_banner