Lunar Eclipse 2022 :చంద్రగ్రహణాన్ని.. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా నేరుగా చూడవచ్చా?-is it safe to watch lunar eclipse 2022 with naked eyes here is the facts ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Lunar Eclipse 2022 :చంద్రగ్రహణాన్ని.. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా నేరుగా చూడవచ్చా?

Lunar Eclipse 2022 :చంద్రగ్రహణాన్ని.. ఎలాంటి జాగ్రత్తలు లేకుండా నేరుగా చూడవచ్చా?

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 08, 2022 07:24 AM IST

Lunar Eclipse 2022 : చాలామంది గ్రహణాలను నేరుగా చూడకూడదు అంటారు. మరికొందరు అసలు గ్రహణాన్ని చూడకూడదు అంటారు. కళ్లకు అద్దాలు పెట్టుకుని.. లేదంటే వివిధ సంరక్షణ చర్యలు తీసుకుంటూ గ్రహణాన్ని చూడవచ్చని మరికొందరు అంటారు. మరి చంద్రగ్రహణాన్ని నేరుగా చూడవచ్చా? లేదా వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చంద్రగ్రహణం 2022
చంద్రగ్రహణం 2022

Lunar Eclipse 2022 : ఈరోజు ఈ సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అయితే చాలా మంది తమ కంటితో చంద్రగ్రహణాన్ని నేరుగా చూడవచ్చా లేదా అనే విషయంపై అయోమయంలో ఉన్నారు. అయితే హానికరమైన UV కిరణాలు ఉండే సూర్యగ్రహణంలా కాకుండా.. చంద్రగ్రహణాన్ని కంటితో చూడటానికి సంకోచించాల్సిన అవసరం లేదు అంటున్నారు నాసా శాస్త్రవేత్తలు. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA) ప్రకారం.. చంద్ర లేదా సూర్యగ్రహణం అనేది సహజమైన దృగ్విషయం. ఇది సూర్యోదయం, సూర్యాస్తమయం వంటిది. చంద్రుడు, సూర్యుని మధ్య భూమి వచ్చినప్పుడు జరిగే ఈ సంఘటననే చంద్రగ్రహణం అంటారు. కాబట్టి దీనిని నేరుగా చూసినా ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు.

వాస్తవానికి సూర్యుని కాంతి హానికరమైన UV కిరణాలను కలిగి ఉంటుంది. ఇది కళ్లపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ చంద్రుని కిరణాలు అంత తీవ్రంగా ఉండవు. అంటే సూర్యగ్రహణం వలె కాకుండా.. చంద్రగ్రహణాన్ని కంటితో చూడటానికి ప్రజలు వెనుకాడాల్సిన అవసరం లేదన్నమాట.

వాస్తవానికి చంద్రగ్రహణం సహజ దృగ్విషయం. మీరు దానిని ఎలాంటి సంరక్షణ లేకున్నా.. నేరుగా చూడవచ్చు. ఇది పూర్తిగా సురక్షితం. కానీ.. మీరు ఇప్పటికీ దాని గురించి సంకోచించినట్లయితే.. నేరుగా చూడకుండా టెలిస్కోప్ ద్వారా చూడండి. చంద్రగ్రహణాన్ని చూడటానికి మీరు బైనాక్యులర్లు, టెలిస్కోప్‌లు లేదా ఆన్‌లైన్ వీడియోలను చూడవచ్చు.

చంద్రగ్రహణం ఎక్కడ కనిపిస్తుంది?

2022లో రెండవ, చివరి సంపూర్ణ చంద్రగ్రహణం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో కనిపిస్తుంది. వీటిలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, ఆసియా, ఉత్తర, దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియా, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం వద్ద చంద్రగ్రహణం కనిపిస్తుంది.

పాక్షిక చంద్రగ్రహణం..

భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. కోహిమా, అగర్తల, గౌహతి, కోల్‌కతా, భువనేశ్వర్, సిలిగురి, పాట్నా, రాంచీలో గ్రహణం కనిపిస్తుంది.

సంపూర్ణ చంద్రగ్రహణం దశలు

* పాక్షిక చంద్రగ్రహణం ప్రారంభం - మధ్యాహ్నం 2.39

* సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభం - మధ్యాహ్నం 3.46

* గరిష్ట సంపూర్ణ చంద్రగ్రహణం - సాయంత్రం 4:29

* సంపూర్ణ చంద్రగ్రహణం ముగింపు- సాయంత్రం 5:11

* చంద్రాస్తమయం - ఉదయం 6.19 గంటలకు

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్