International Daughters Day 2023 : మీ గారాల పట్టికి ఇలా డాటర్స్ డే విషెస్ చెప్పండి-international daughters day 2023 history significance daughters day quotes whatsapp wishes and celebration ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  International Daughters Day 2023 : మీ గారాల పట్టికి ఇలా డాటర్స్ డే విషెస్ చెప్పండి

International Daughters Day 2023 : మీ గారాల పట్టికి ఇలా డాటర్స్ డే విషెస్ చెప్పండి

HT Telugu Desk HT Telugu
Sep 24, 2023 11:58 AM IST

International Daughters Day 2023 : సెప్టెంబర్ 24 అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం. ఏటా సెప్టెంబర్ నాగులో ఆదివారం ఈ ప్రత్యేకమైన రోజును నిర్వహిస్తారు. ఈ రోజుకున్న ప్రాముఖ్యత తెలుసుకుని.. మీ గారాల పట్టికి శుభాకాంక్షలు చెప్పండి.

హ్యాపీ డాటర్స్ డే
హ్యాపీ డాటర్స్ డే

కుమారుడు పుడితేనే ఆనందంగా ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు. అయ్యో కుమార్తె పుట్టిందా అని బాధపడేవారు ఎక్కువ మంది. కొడుకు పుట్టినప్పుడే చాలా ఆనందపడతారు. అదే కూతురు పుడితే ఆలోచనల్లో పడతారు. కానీ ప్రతీ విషయంలో కూతురిదే పైచేయి. మిమ్మల్ని ప్రేమగా చూసుకోవడంలో, మీకు అమ్మగా సేవలు చేయడంలోనూ కూతురిని మించిన ప్రేమామూర్తి ఎవరూ లేరు.

ఈ రోజుల్లో మగ, ఆడ అనే తేడా లేకుండా.. టాలెంట్ ఉంటే దూసుకెళ్తున్నారు. ఆడపిల్ల పుడితే ఏం చేయలేదు అనేది పచ్చి అబద్ధం. ఎంతో మంది అమ్మాయిలు.. తల్లిదండ్రులను గర్వంగా తల ఎత్తుకునేలా చేస్తున్నారు. కుటుంబాన్ని పోషిస్తు్న్నారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ ప్రేమను పంచుతున్నారు. ఆడపిల్ల అంటే లక్ష్మీదేవీతో సమానం. పుట్టిన నాటి నుంచి తన కుటుంబానికి సేవలు చేసి ఆ ఇంటి వెలుగుగా నిలుస్తుంది. పెళ్లి తర్వాత మరొక ఇంటికి దేవతగా వెళ్తుంది. అయినా కన్నవాళ్ల మీద ప్రేమ ఏ మాత్రం తగ్గనివ్వదు.

ఆడపిల్ల లేనిదే సృష్టి లేదు. అమ్మ, అక్క, భార్యగా సమాజంలో తన పాత్ర చాలా గొప్పది. ఆడపిల్ల విశిష్టతను తెలియజేసేందుకు ఒక ప్రత్యేకమైన రోజును వేడుకగా జరుపుతున్నారు. ఈరోజు అంతర్జాతీయ కుమార్తెల దినోత్సవం (International Daughters’ Day 2023). ప్రతీ ఏటా సెప్టెంబర్ నాల్గో ఆదివారం రోజున నిర్వహిస్తారు.

ఎందుకు నిర్వహిస్తారు?

జనాభాలో లింగ అంతరాన్ని తొలగించేందుకు, సమాజంలో స్త్రీ పురుషులిద్దరికీ సమాన హక్కులు ఉంటాయని చెప్పటానికి, ఆడపిల్లలకు అనేక రంగాలలో ప్రభుత్వాలు, సంస్థలు ప్రత్యేక అవకాశాలను అందించడానికి ఈరోజు ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆడ బిడ్డ పుట్టుకను వేడుక చేసుకోవాలంటూ చెప్పే ప్రయత్నం చేస్తూనే, ఆడపిల్లల పట్ల జరిగిన కొన్ని చారిత్రిక తప్పులకు క్షమాపణగా ఈ కుమార్తెల దినోత్సవం నిర్వహిస్తారు. కుమారులే కాదు.. కుమార్తెలు.. ప్రపంచాన్ని ప్రభావితం చేయగలరు అని చాటి చెప్పే దినం ఇది. మగాళ్లు కూడా చేయలేని పనులను ఆడవాళ్లు చేసి చూపిస్తున్నారు.

సృష్టిలోని మాధుర్యం కూతురి ప్రేమ..

ఏ దేశమేగిన.. ఏ తీరం దాటినా..

మరువలేని మమకారం కూతురి ప్రేమ..

ప్రకృతి చేసిన బంగారు ప్రతిమా..

గుండే చేసే సడిలోని రూపమా..

హ్యాపీ డాటర్స్ డే..

కూతురంటే అమ్మకు ఇష్టం..

నాన్నకు ఆమే ఓ లోకం..

నీపై ప్రేమ అజరామరం

హ్యాపీ డాటర్స్ డే..

నువ్వే నా బలం..

నువ్వే నా బలగం..

నువ్వే నా బలహీనత..

నీ చిరునవ్వుతో నా బాధను తరిమేస్తావ్..

నీ చిలక పలుకులతో నా కష్టాన్ని మరిచిపోయేలా చేస్తావ్..

నాకు దేవుడిచ్చిన మరో అమ్మవు నువ్..

హ్యాపీ డాటర్స్ డే..

ఈ సృష్టిలో అందమైనది పువ్వు..

నా దృష్టిలో అందమైనది నా చిట్టి తల్లి నవ్వు..

హ్యాపీ డాటర్స్ డే..

నాకు కొడుకు ఉన్నా నీలా చూసుకోడేమో..

నాపై ప్రేమ వర్షం కురిపించలేడేమో..

నా జీవితపు చివరి క్షణాల్లో అమ్మలాగా అండగా నిలవలేడేమో..

అందుకే కంటే కూతుర్నే కనాలి..

హ్యాపీ డాటర్స్ డే..

WhatsApp channel