IBPS Clerk jobs: 6035 క్లర్క్ పోస్ట్‌లకు IBPS నోటిఫికేషన్..TS,AP ఖాళీల వివరాలివే-ibps clerk 2022 application begins for 6035 posts of ibps clerk ibps clerk 2022 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ibps Clerk Jobs: 6035 క్లర్క్ పోస్ట్‌లకు Ibps నోటిఫికేషన్..Ts,ap ఖాళీల వివరాలివే

IBPS Clerk jobs: 6035 క్లర్క్ పోస్ట్‌లకు IBPS నోటిఫికేషన్..TS,AP ఖాళీల వివరాలివే

HT Telugu Desk HT Telugu
Jul 01, 2022 02:48 PM IST

IBPS Clerk Recruitment 2022: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) వివిధ ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.

IBPS Clerk Recruitment 2022
IBPS Clerk Recruitment 2022

IBPS Clerk Recruitment 2022: IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ప్రభుత్వ బ్యాంకుల్లో ఉన్న 6035 క్లర్క్‌ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు IBPS అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ 21 జూలై 2022. IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్ష సెప్టెంబర్ 2022లో జరుగుతుంది. IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు అర్హులు.మె యిన్స్ పరీక్ష అక్టోబర్ 2022లో నిర్వహించబడుతుంది.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.

వయోపరిమితి: 20 - 28 ఏళ్ళ మద్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.

బ్యాంక్‌లు: బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్

రాష్ట్రాల వారిగా పోస్టుల వివరాలు

అండమాన్ & నికోబార్ - 04

ఆంధ్రప్రదేశ్ - 209

అరుణాచల్ ప్రదేశ్ - 14

అస్సాం - 157

బీహార్ - 281

చండీగఢ్ - 12

ఛత్తీస్‌గఢ్ - 104

దాదర్ నగర్ / డామన్ డయ్యూ - 01

ఢిల్లీ NCT - 295

గోవా - 71

గుజరాత్ - 304

హర్యానా - 138

హిమాచల్ ప్రదేశ్ - 91

జమ్మూ & కాశ్మీర్ - 35

జార్ఖండ్ - 69

కర్ణాటక - 358

కేరళ - 70

లక్షద్వీప్ - 05

మధ్యప్రదేశ్ - 309

మహారాష్ట్ర - 775

మణిపూర్ - 04

మేఘాలయ - 06

మిజోరాం - 04

నాగాలాండ్ - 04

పుదిచేరి - 02

పంజాబ్ - 407

రాజస్థాన్ 129

సిక్కిం - 11

తమిళనాడు - 288

తెలంగాణ - 99

త్రిపుర - 17

ఉత్తర ప్రదేశ్ - 1089

ఉత్తరాఖండ్ - 19

పశ్చిమ బెంగాల్ -528,

మొత్తం పోస్టులు: 6035

IBPS Clerk Recruitment 2022: ఎలా దరఖాస్తు చేయాలి

step 1- ముందుగా అధికారిక వెబ్‌సైట్ ibps.inకి వెళ్లండి.

step 2- 'CRP క్లర్క్-XII' లింక్‌పై క్లిక్ చేయండి.

step 3- ఇప్పుడు హోమ్ పేజీలో చూపిన “Click here for a new registration” లింక్‌పై క్లిక్ చేయండి.

step 4- ఇప్పుడు, ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ చేతి బొటనవేలు ముద్రను అప్‌లోడ్ చేయండి.

step 5- దరఖాస్తు రుసుము చెల్లించండి.

step 6- ఫారమ్‌ను సమర్పించండి.

IBPS క్లర్క్ రిక్రూట్‌మెంట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

ముఖ్యమైన తేదీలు

రిజిస్ట్రేషన్ ప్రారంభం- 2022 జూలై 21

01.07.2022 నుండి 21.07.2022 వరకు దరఖాస్తు రుసుము చెల్లింపు(ఆన్‌లైన్)

01.07.2022 నుండి 21.07.2022 ఎగ్జామినేషన్ ట్రైనింగ్

ఆగస్టు 2022ఆన్‌లైన్ పరీక్ష కాల్ లెటర్ డౌన్‌లోడ్

ఆగస్టు 2022ఆన్‌లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ –

సెప్టెంబర్ 2022ఆన్‌లైన్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు –

సెప్టెంబర్/అక్టోబర్ 2022 ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ కోసం కాల్ లెటర్ డౌన్‌లోడ్ చేయండి –

మెయిన్ ఎగ్జామ్- 2022 అక్టోబర్

ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2023 ఏప్రిల్

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్