Belly Fat | ఈ ఐదు తింటే చాలు.. పొట్ట చుట్టు ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.-here is top five foods for reduce belly fat ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Belly Fat | ఈ ఐదు తింటే చాలు.. పొట్ట చుట్టు ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

Belly Fat | ఈ ఐదు తింటే చాలు.. పొట్ట చుట్టు ఉండే కొవ్వు ఇట్టే కరిగిపోతుంది.

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 16, 2022 02:40 PM IST

పొట్ట చుట్టూ ఉండే కూడా కొవ్వు కూడా మనం అనుకున్నదానికంటే ప్రమాదకరం. మన వయసు పెరిగే కొద్దీ లేదా ఎక్కువ నిశ్చలంగా ఉండే కొద్దీ, ఈ 'కిల్లర్ ఫ్యాట్'ని మన నడుము చుట్టూ చేరుతుంది. ఈ అదనపు కొవ్వు మన ఆరోగ్యానికి చాలా హానికరమని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇది మన అంతర్గత అవయవాలపై ప్రభావం చూపి మధుమేహం, గుండె జబ్బులు, కాలేయ సమస్య వంటి అనేక ఆరోగ్య సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది.

బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే మార్గాలు
బెల్లీ ఫ్యాట్ తగ్గించుకునే మార్గాలు

Belly Fat | పొత్తికడుపు చుట్టు ఉండే కొవ్వు ప్రాణాంతక జీవనశైలి వ్యాధులను అభివృద్ధి చేస్తుంది. ఈ కొవ్వు పొత్తికడుపు చుట్టూ పేరుకుపోతుంది. దీనిని కరిగించేందుకు తప్పక ప్రయత్నించాలి అంటున్నారు నిపుణులు. లేకుంటే ప్రమాదాలు తప్పవంటున్నారు. నెమ్మదిగా, స్థిరంగా, కొన్ని శాశ్వత జీవనశైలి మార్పులు చేయాలని సూచిస్తున్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, రిఫైన్డ్, ప్రాసెస్, చక్కెర ఆహారాలను నివారించడం లాంటివి చేయాలంటున్నారు. చురుకుగా ఉండటం అలవాటు చేసుకుంటేయయ పొట్ట చుట్టూ కొవ్వు తగ్గుతుందని వెల్లడించారు.

పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కోల్పోయే మీ లక్ష్యాన్ని సాధించడంలో కొన్ని ఆహారాలు మీకు సహాయపడతాయి. ప్రొటీన్లు, సిట్రస్ పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు వంటి కొన్ని ఆహారాలు మీకు వీలైనంత కాలం వ్యాధి-రహితంగా ఉండటానికి సహాయపడతాయి. పొట్ట కొవ్వు తగ్గడానికి ఈ ఐదు ఆహారాలను కచ్చితంగా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని డైటీషియన్ గరిమా గోయల్ సూచిస్తున్నారు.

1. గుడ్లు

జనాదరణ పొందిన నమ్మకానికి విరుద్ధంగా, 1 మొత్తం గుడ్డు అదనపు కొవ్వును కోల్పోవడంలో మీకు సహాయపడుతుంది. గుడ్డులో ప్రోటీన్‌లు అధికంగా ఉంటాయి. కొవ్వును కాల్చే ప్రక్రియను ఉత్ప్రేరకపరిచే ముఖ్యమైన అమైనో యాసిడ్ లూసిన్‌ను కూడా కలిగి ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో కోలిన్ ఉండటం వల్ల కొవ్వు పెరిగే జన్యువులను ఆపివేస్తుంది.

2. పెరుగు

పెరుగులో ప్రయోజనకరమైన బ్యాక్టీరియా జాతి లాక్టోబాసిల్లస్ ఉంటుంది. ఇది కొవ్వు నిల్వను తగ్గిస్తుంది.

3. సిట్రస్ పండ్లు

మొసాంబి, నారింజ, నిమ్మ, ఉసిరి, జామ, కివి వంటి సిట్రస్ పండ్లు విటమిన్ సితో నిండి ఉన్నాయి. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలోని నీటి సమతుల్యతను నియంత్రించడంలో ముఖ్యమైన ఖనిజంగా పని చేస్తుంది. ఇది ఉబ్బరం, కొవ్వు నిల్వలో చేరిన వాపుతో పోరాడుతుంది.

4. గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఫ్లేవనాయిడ్స్, పాలీఫెనాల్ ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ కనీసం ఒక కప్పు గ్రీన్ టీని తీసుకోవడం మంచిది.

గ్రీన్ టీలో కెఫిన్, క్యాటెచిన్ అనే ఫ్లేవనాయిడ్ పుష్కలంగా ఉంటాయి. ఈ రెండు సమ్మేళనాలు శరీరంలోని అదనపు కొవ్వును విచ్ఛిన్నం చేయడంలో సహాయపడతాయి.

5. ఆకుపచ్చ కూరగాయలు

గ్రీన్ వెజిటేబుల్స్: గ్రీన్ లీఫీ, సీజనల్ వెజిటేబుల్స్ మీ రోగనిరోధక శక్తికి మంచివి. ఎందుకంటే వాటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వాటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, విటమిన్ కె, మెగ్నీషియం మొదలైన అనేక పోషకాలు ఉన్నాయి. బచ్చలికూర, కాలే, బ్రోకలీ వంటి కూరగాయలు క్యాన్సర్ నిరోధక, శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటాయి.

బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ వంటి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ విటమిన్లు మరియు మినరల్స్‌తో నిండి ఉండటమే కాకుండా కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్‌తో లోడ్ అవుతాయి. ఫైబర్ కంటెంట్ మీకు తక్కువ తినడానికి.. ఎక్కువ సేపు నిండుగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది.

WhatsApp channel