Gandhi Jayanti Quotes : గాంధీజీ చెప్పిన గొప్ప మాటలు.. ఈ కోట్స్ మీరూ షేర్ చేయండి-gandhi jayanti quotes whatsapp messages inspirational and motivational quotes slogans of mahatma gandhi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Gandhi Jayanti Quotes : గాంధీజీ చెప్పిన గొప్ప మాటలు.. ఈ కోట్స్ మీరూ షేర్ చేయండి

Gandhi Jayanti Quotes : గాంధీజీ చెప్పిన గొప్ప మాటలు.. ఈ కోట్స్ మీరూ షేర్ చేయండి

HT Telugu Desk HT Telugu
Oct 01, 2023 03:00 PM IST

Gandhi Jayanti Wishes : అక్టోబర్ 2న జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. మహాత్మా గాంధీని ఫాలో అయ్యేవారు మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ఉన్నారు. ఆయన చెప్పిన గొప్ప మాటలు ఎంతో మందికి స్ఫూర్తి. గాంధీ జయంతి సందర్భంగా కొన్నింటిని గుర్తుచేసుకుందాం..

గాంధీ జయంతి
గాంధీ జయంతి

బ్రిటీష్ వారి బానిసత్వం నుండి భారతదేశాన్ని విడిపించడానికి గాంధీజీ ఎన్నో ఉద్యమాలు చేశారు. సత్యం, అహింసను ఆయుధంగా చేసుకున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించారు. భారతదేశానికి స్వాతంత్య్రం రావడంలో ఆయన పాత్ర చాలా గొప్పది. గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ ఆలోచనలు, సిద్ధాంతాల గురించి తెలుసుకోవాలి. ఆయన చాలా విలువైన మాటలు చెప్పారు. అందులో కొన్ని ఇక్కడ చూద్దాం..

yearly horoscope entry point

నా విశ్వాసాల్లో అహింస మార్గమే మెుట్టమెుదటి ఆర్టికల్.. నా మతంలోనూ అదే చివరి ఆర్టికల్..

తప్పులు చేసే స్వేచ్ఛ లేనప్పుడు ఆ స్వేచ్ఛకు అంత విలువ ఉండదు..

రేపే మీ చివరి రోజు అన్నట్టుగా జీవించాలి. అయితే రేపు కూడా జీవించాలన్న దృక్పథంతో నిరంతరం నేర్చుకోవాలి.

కన్నుకు కన్ను అనే సిద్ధాంతం.. ప్రపంచాన్నే గుడ్డిగా మారుస్తుంది.

నేను ఎవరిని వారి మురికి పాదాలతో నా ఆలోచనల గుండా నడవనివ్వను

పాపాన్ని ద్వేషించండి.. పాపిని ప్రేమించండి.

దేవుడికి మతం అనేది లేదు.. మతంతో సంబంధమే లేదు..

అహింసకు మించిన ఆయుధం లేదు..

ఓటు, సత్యాగ్రహం ఈ రెండూ ప్రజల చేతిలో ఆయుధాలు..

తృప్తి అనేది ప్రయత్నంలో తప్ప విజయం ద్వారా లభించదు. పూర్తి ప్రయత్నమే నిజమైన విజయం..

సముద్రంలో కొన్ని నీళ్లు కలుషితమైతే.. సముద్రం మెుత్తం చెడిపోయినట్టు కాదు. ఎక్కడో ఓ చేదు అనుభవం ఎదురైనంత మాత్రం మానవత్వం మంటగలిసినట్టు కాదు..

నన్ను స్తుతించే వారికంటే.. కఠినంగా విమర్శించే వారితోనే అధికంగా లబ్ధి పొందుతా..

ఆత్మాభిమానం, గౌరవాన్ని ఎవరో రక్షించరు.. మనకు మనమే వాటిని కాపాడుకోవాలి.

మేధావులు మాట్లాడుతారు.. మూర్ఖులే వాదిస్తారు.

ఈ ప్రపంచంలో నువ్ చూడాలనుకునే మార్పు మెుదట నీతోనే మెుదలవ్వాలి.

గొప్ప పుస్తకాలు మనతో ఉంటే.. గొప్ప మిత్రుడు లేని లోటు తీరినట్టే..

బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు.. ఎందుకంటే క్షమించేందుకు చాలా ధైర్యం కావాలి.

ఎంత గొప్పగా జీవించావో నీ చేతులు చెప్పాలి.. అదే ఎంత గొప్పగా మరణించావో నీ గురించి ఇతురులు చెప్పాలి..

విశ్వాసం కొద్దిపాటి గాలికి వాలి పోయేది కాదు.. అది అచంచలమైనది.. హిమాలయాలంత స్థిరమైనది.

చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి.. కానీ మనం మాటలతోనే ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం..

అంతరాత్మ తప్పు అని చెప్పినప్పుడు.. ఇతరుల మెప్పు కోసమో.. తాత్కాలిక ప్రయోజనం కోసమో.. ఒకరికి అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం అనైతికం..

ఎవరికైనా సాయం చేస్తే మరిచిపో.. ఇతురల సాయం పొందితే మాత్రం గుర్తుంచుకో..

మానవుల ఆవేశాలు వేగంగా పరుగెత్తుతాయి.. వీటిని అదుపులో పెట్టడానికి కొండంత సహనం కావాలి.

Whats_app_banner