Semolina Cheese Balls | చల్లని సాయంకాలానా.. కిర్రెక్కించే రుచిగల స్నాక్స్!-enjoy this evening with lip smacking semolina cheese balls ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Semolina Cheese Balls | చల్లని సాయంకాలానా.. కిర్రెక్కించే రుచిగల స్నాక్స్!

Semolina Cheese Balls | చల్లని సాయంకాలానా.. కిర్రెక్కించే రుచిగల స్నాక్స్!

HT Telugu Desk HT Telugu
May 26, 2022 07:15 PM IST

చల్లని సాయంకాలానా వేడివేడి సూజి చీజ్ బాల్స్ తింటుంటే వెచ్చగా, మత్తుగా.. అమోఘంగా అనిపిస్తుంది. ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

Sooji/ Ravva Balls
Sooji/ Ravva Balls (Unsplash)

ఆకాశం మేఘావృతం అయింది అక్కడక్కడా జల్లులు కురిసి వాతావరణం చల్లగా మారింది. మరి ఇలాంటి సాయంకాలాన్ని చూసి ఎన్ని రోజులవుతుందో కదా. ఈ సాయంత్రం వేళలో మంచి స్నాక్స్ ఏవైనా తినాలనే ఆలోచన చాలా మందికి వస్తుంది. ఇది చదివితే మీకూ వస్తుంది. 

మరి ఏం స్నాక్స్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? బయట క్రిస్పీగా లోపల జ్యూసీగా తింటే రుచికరంగా ఉండే సూజీ చీజ్ బాల్స్ రెసిపీని ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ప్రిపేర్ చేయడం ఎంతో తేలిక కూడా. కేవలం నాలుగు రకాల పదార్థాలతో 15 నిమిషాలలో చేసుకోవచ్చు. వాటిని చూస్తే నాలుక లపలపలాడుతుంది. ఇంకా ఊరించడం దేనికి? ఏమేం కావాలో.. ఎలా చేసుకోవాలో ఇక్కడ తెలుసుకోండి.

కావాల్సినవి

  • 1/2 కప్పు సెమోలినా
  • 1/2 టీస్పూన్ కారం పొడి
  • చిటికెడు ఉప్పు
  • చిటికెడ్ మిరియాల పొడి
  • 4 చీజ్ క్యూబ్స్
  • 1.5 కప్పుల నీరు

తయారీ విధానం

  1. ముందుగా ఒక పాన్‌ తీసుకొని అందులో నీరు పోసి మరిగించాలి.
  2. ఈ మరుగులోనే ఉప్పు, కారం, మిరియాల పొడి వేయండి.
  3. అనంతరం దీంట్లో సెమోలినా లేదా రవ్వ వేసి కలపండి.
  4. మెత్తగా ఉడికిన తర్వాత పక్కకు తీసుకొని, చల్లారనివ్వండి.
  5. ఇప్పుడు ఈ రవ్వముద్దను చిన్నచిన్న ముద్దలుగా చదునుగా చేసి మధ్యలో చీజ్ స్టఫ్ చేసి గుండ్రని బాల్స్ లాగా తయారు చేసుకోవాలి.
  6. ఇప్పుడు ఈ బాల్స్ ను నూనెలో వేయించుకోవాలి.

చీజ్ బాల్స్ రెడీ అయినట్లే సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకొని గ్రీన్ చట్నీ లేదా కెచప్ తో కలిపి తీసుకుంటే ఆ రుచికి కేకపెడతారు.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్