Beer Bus । బీర్ ప్రియులకు శుభవార్త, బస్సు ప్రయాణంలోనే చల్లటి బీర్ తాగొచ్చు!
Beer Bus: మండే ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు బస్సులో చల్లటి బీర్ సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది. ఇదే ఐడియాతో ముందుకొచ్చింది ఓ బ్రూవరీ కంపెనీ, ఆ టూర్ ప్యాకేజీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
గాలివానలో వాననీటిలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, మండే ఎండలో ప్రయాణాలు చేయటం అంటే చాలా చిరాకుగా ఉంటుంది. సాధారణంగా ప్రయాణం చేయడం వలన శరీరం అలసిపోతుంది, ముఖ్యంగా వేసేవిలో బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు. అయితే ప్రయాణాలు ఇలా విసుగుపుట్టకుండా రిఫ్రెషింగ్ ఆలోచనలతో కొన్ని పర్యాటక రంగ సంస్థలు ముందుకొస్తున్నాయి.
మీరు ఎండలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు చిల్డ్ బీర్ అందిస్తే ఎలా ఉంటుంది? కొంతమందైతే ఎగిరి గంతేస్తారు. మీరు ఎండలో బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు మీకు చిల్డ్ బీర్ (Chilled Beer) అందిస్తే ఎలా ఉంటుంది? కొంతమందైతే ఎగిరి గంతేస్తారు.
ప్రయాణాలను ఇష్టపడే బీర్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మీరు బస్సు ప్రయాణం చేస్తూ చల్లటి బీర్ రుచిని ఆస్వాదించవచ్చు. కాటమరాన్ బ్రూయింగ్ కంపెనీ ఈ వినూత్న ఐడియాను ప్రవేశపెట్టింది. ఇందుకోసం ప్రతీవారం వీకెండ్ (Weekend Tour) లో 'బ్రూవరీ టూర్ బస్సు' ను నడిపించనుంది. ఈ 'బీర్ బస్సు' (Beer Bus) లో వారాంతాల్లో చెన్నై నుండి పుదుచ్చేరికి ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణంలో అపరిమిత బీర్‌తో (Unlimited Beer) పాటు, మూడు సార్లు రుచికరమైన భోజనాన్ని అందిస్తారు ఈ వన్-డే ప్యాకేజ్డ్ రౌండ్ ట్రిప్ ఏప్రిల్ 22 నుంచి ప్రారంభం అవుతుంది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఉత్సాహంతో ఉత్సాహంతో ఉన్నారా? తొందరెందుకు..? కొన్ని షరతులు వర్తిస్తాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
Beer Bus Details- బీర్ బస్సు వివరాలు
- ఈ బీర్ బస్సులో ప్రయాణానికి పెద్దలకు రూ. 3,000, 12-18 ఏళ్ల వారికి రూ. 2,000, 12 ఏళ్లలోపు పిల్లలకు రూ.1500గా టికెట్ ధరను నిర్ణయించారు.
- ఈ బస్సు శని, ఆదివారాల్లో నడుస్తుంది. చెన్నైలోని ఒక నిర్ణీత పాయింట్ నుండి ఉదయం 10.30 గంటలకు పికప్ చేసుకొని పుదుచ్చేరి తీసుకెళ్తుంది, తిరిగి రాత్రి 9 గంటలకు యధాస్థానంలో వదలుతుంది.
- ప్రతీ వారాంతంలో మొత్తం 40 మంది ప్రయాణీకులతో ఈ బస్సు బయలు దేరుతుంది. పర్యటనలో భాగంగా మైక్రోబ్రూవరీ గైడెడ్ టూర్ కూడా ఉంటుంది. అలాగే పాండిచ్చేరిలోని రెండు ప్రసిద్ధ టూరిస్ట్ స్పాట్ లను కూడా చూపిస్తారు.
- 12 గంటల ప్రయాణంలో అపరిమిత క్రాఫ్ట్ బీర్, మూడు కోర్సుల భోజనాన్ని వడ్డిస్తారు.
- బీర్ తాగటం విషయంలో ప్రభుత్వ నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఎవరైనా గొడవ చేస్తే వారిని అక్కడే ఏదైనా బస్ స్టేషన్ లో దింపి వేస్తామని కంపెనీ నిబంధనలను పెట్టింది.
ఏది ఏమైనా, బస్సులో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు నానా పాట్లు పడుతున్న సంస్థలకు ఈ బీర్ ఐడియా కలిసి రావచ్చు.
సంబంధిత కథనం