Paneer Cutlet Recipe । రుచికరమైన పనీర్ కట్లెట్ తింటూ.. మీ నాన్నతో కలిసి ఈ సాయంత్రాన్ని ఆస్వాదించండి!
Father's Day Recipes: సాయంత్రం వేళ మీ నాన్నకోసం ఏదైనా డెజర్ట్ వంటకం సిద్ధం చేయండి. ఇక్కడ మీకు రుచికరమైన పనీర్ కట్లెట్ రెసిపీని అందిస్తున్నాము.
Happy Father's Day Recipes: ఫాదర్స్ డే దాదాపు వచ్చేసింది. ప్రపంచంలోని తండ్రులందరు తమ పిల్లలతో కలిసి వేడుక చేసుకునే సందర్భం ఇది. ఓ తండ్రి తన కుటుంబం కోసం, పిల్లల కోసం చేసిన త్యాగాలు సాధారణంగా గుర్తింపులోకి రావు. ఎందుకంటే అవి కళ్లతో చూసేవి కావు, మనసుతో చూడాల్సినవి. తన ఇష్టాయిష్టాలను వదిలి అందరి కోసం తన జీవితాన్ని, తన సర్వస్వాన్ని ధారపోస్తాడు. ఇందుకోసం తనకు ఎంతో ఇష్టమైన కుటుంబం, పిల్లలతో కూడా సమయాన్ని కేటాయించలేకపోతాడు. ఈ క్రమంలో తల్లితో సమానంగా పిల్లలతో తన అనుబంధాన్ని పెంచుకోవడంలో వెనకబడతాడు, అయినప్పటికీ అగ్రస్థానం ఆయనకే. అందుకే ఆయన గుర్తుగా మనం ఫాదర్స్ డే జరుపుకుంటాం.
మీరూ మీ తండ్రితో ఫాదర్స్ డే జరుపుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, ఇందులో ఆయనకు నచ్చినవి వండిపెట్టడం కూడా మీరు ఆయనపై మీ ప్రేమను చూపించినట్లు అవుతుంది. సాయంత్రం వేళ మీ నాన్నకోసం ఏదైనా డెజర్ట్ వంటకం సిద్ధం చేయండి. ఇక్కడ మీకు రుచికరమైన పనీర్ కట్లెట్ రెసిపీని అందిస్తున్నాము. వీటిని ప్రత్యేకంగా చేసి డిన్నర్ టేబుల్ వద్ద మీ నాన్నను ఆశ్చర్యపరచండి.
Paneer Cutlet Recipe కోసం కావలసినవి
- ఉడకబెట్టిన బంగాళదుంప గుజ్జు - 1 కప్పు
- పనీర్ చూర్ణం - 400 గ్రాములు / 2½ కప్పులు
- కొత్తిమీర తరుగు - పిడికెడు
- కసూరి మేతి ఆకులు - 2 tsp
- బ్రెడ్ ముక్కలు - 4
- నూనె - 4 టేబుల్ స్పూన్లు
- ఇంగువ - ½ tsp
- జీలకర్ర - 1½ tsp
- అల్లం, తరిగినవి - 1 టేబుల్ స్పూన్
- పచ్చిమిర్చి, తరిగినవి - 2 సం
- పచ్చి బఠానీలు - 1 కప్పు
- ఉప్పు - రుచికి
- మిరియాల పొడి - 2 tsp
- ధనియాల పొడి - 1 టేబుల్ స్పూన్
- చాట్ మసాలా - 1 టేబుల్ స్పూన్
- నల్ల ఉప్పు - 1 స్పూన్
- శనగపిండి - ½ కప్పు
- ఉప్పు - చిటికెడు
- నీరు - ½ కప్పు
- నూనె - డీప్ ఫ్రై కోసం
- అదనపు బ్రెడ్ ముక్కలు - 2 కప్పులు
- భుజియా - 1 కప్పు
పనీర్ కట్లెట్ తయారీ విధానం
- మిశ్రమాన్ని సిద్ధం చేయడానికి, కొద్దిగా నూనె వేడి చేసి ఆపై ఇంగువ, తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి, అన్నింటినీ కలపండి.
- ఆపై పచ్చి బఠానీలు, ఉప్పు, కారం, కొత్తిమీర, చాట్ మసాలా, బ్లాక్ సాల్ట్ జోడించండి.
- తరువాత ఉడికించిన మెత్తని బంగాళాదుంపలను వేసి ప్రతిదీ కలపాలి. అది చల్లారనివ్వండి
- తర్వాత మెత్తని పనీర్, కసూరీ మేతి, ఉప్పు , కొత్తిమీర తరుగు వేసి కలపాలి. కొన్ని బ్రెడ్‌క్రంబ్‌లను వేసి, మిక్స్‌ను కలిపి కట్టుకోండి.
- పూత చేయడానికి,శనగపిండి, ఉప్పు, నీరు కలపండి. కట్లెట్లను మిశ్రమంలో ముంచి బ్రెడ్‌క్రంబ్స్‌తో కోట్ చేయండి.
- చివరగా వాటిని మీడియం ఉష్ణోగ్రతలో నూనెలో వేయించండి.
పనీర్ కట్లెట్లు రెడీ అయినట్లే, వేడి వేడిగా మీ నాన్నకు వడ్డించండి.
సంబంధిత కథనం