Ratan Tata Favourite Foods: రతన్ టాటాకి ఇష్టమైన వంటకాలు ఇవే, టాటా ఇండస్ట్రీస్‌కి ఒక ఆస్థాన్ చెఫ్ కూడా!-celebrating ratan tata legacy through favourite foods ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Ratan Tata Favourite Foods: రతన్ టాటాకి ఇష్టమైన వంటకాలు ఇవే, టాటా ఇండస్ట్రీస్‌కి ఒక ఆస్థాన్ చెఫ్ కూడా!

Ratan Tata Favourite Foods: రతన్ టాటాకి ఇష్టమైన వంటకాలు ఇవే, టాటా ఇండస్ట్రీస్‌కి ఒక ఆస్థాన్ చెఫ్ కూడా!

Galeti Rajendra HT Telugu
Oct 10, 2024 01:35 PM IST

రతన్ టాటా గత ఆదివారం ఆసుపత్రిలో చేరే వరకూ యాక్టివ్‌గానే కనిపించారు. ముంబయిలోని ఒక చిన్న ఇంట్లో ఒంటరిగా ఉన్న రతన్ టాటా ఏవి ఇష్టంగా తినేవారంటే?

రతన్ టాటా
రతన్ టాటా (PTI)

దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం అర్ధరాత్రి ముంబయిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 86 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా మొన్నటి వరకు కనిపించిన రతన్ టాటా.. చివరి వరకూ క్రమశిక్షణతో కూడిన జీవన శైలిని వీడలేదు.

ఆఖరి వరకు పార్సీ స్టయిల్‌లోనే

రతన్ టాటా ఎప్పుడూ హోమ్-స్టైల్ ఫుడ్‌నే ఇష్టపడేవారు. అది కూడా పార్సీ సంప్రదాయ పద్ధతిలో వండే వంటకాలను తినేవారు. మరీ ముఖ్యంగా.. జంషెడ్‌పూర్‌లో ప్రతి ఏడాది జరిగే టాటా స్టీల్ ఫంక్షన్‌లో పార్సీ చెఫ్ పర్వేజ్ పటేల్ వండే వంటకాలను ఎప్పుడూ మిస్ కాకుండా రతన్ టాటా తినేవారు.

ముంబైలో పుట్టి పెరిగిన పర్వేజ్ పటేల్ ఒక గ్యారేజ్‌ను రెస్టారెంట్‌గా మార్చి తన చెఫ్ లైఫ్‌ను స్టార్ట్ చేశాడు. అతి కొద్దిరోజుల్లోనే పార్సీ వంటలలో ప్రావీణ్యం సాధించి టాటా ఇండస్ట్రీస్‌‌ ఆస్థాన వంటవాడిగా అతను పేరొందాడు. అంతేకాదు రతన్ టాటాకి కూడా చాలా ఇష్టమైన చెఫ్‌గా పర్వేజ్ నిలిచాడు.

బ్రహ్మచారి జీవితం.. 

పార్సీ వంటకాలను రతన్ టాటా ఎక్కువ ఇష్టంగా తినేవారు. ఇదే విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెఫ్ పర్వేజ్ కూడా వెల్లడించారు. ‘‘రతన్ టాటాకి ఇష్టమైన వంటకాల్లో కట్టా-మీటా మసూర్ దాల్ (మెంట్ ప్లేవర్), మటన్ పులావ్ దాల్, పల్లీతో నిండిన బేక్డ్ కస్టర్డ్‌ను రతన్ టాటా ఇష్టంగా తింటారు’’ అని ఆ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వివాహం చేసుకోని రతన్ టాటాకి కొన్ని దశాబ్దాల పాటు పార్సీ వంటకాలను పర్వేజ్ చేసి పెట్టారు.

విదేశాలకి వెళ్లినా రతన్ టాటా దేశీయ వంటకాలనే ఇష్టపడేవారు. మరీ ముఖ్యంగా పార్సీ వంటకాల్లోని సాలి కీమా, చికెన్ ఫర్చా వంటివి ఇష్టంగా తినేవారు. రతన్ టాటాకి చెల్లెళ్లు లేరు. కానీ.. అమ్మ తరఫున ఒక మహిళను చెల్లిగా పిలిచేవారు. ఆమె చేసే వంటకాలను ఎక్కువ ఇష్టపడేవారట. కాఫీ అంటే కూడా రతన్ టాటాకి బాగా ఇష్టం.

ఆఖరి వరకు చిన్న ఇంట్లోనే

రతన్ టాటా చాలా నిరాడంబరమైన జీవితాన్ని ముంబయిలో గడిపారు. ఆఖరి రోజు వరకు ముంబయిలోని ఒక చిన్న ఇంట్లోనే ఉండేవారు. అంతేకాదు.. విలాసవంతమైన కార్లను పక్కన పెట్టి కేవలం టాటా సెడాన్‌ కారు వాడేవారు. రతన్ టాటాతో పాటు కేవలం పెంపుడు శనకాలు, పుస్తకాలు మాత్రమే ఆ ఇంట్లో ఉండేవి.

Whats_app_banner