ఎక్కువగా అన్నం తింటే బరువు పెరుగుతారా?
కార్బోహైడ్రేట్ వినియోగంపై చాలా మందికి అనేక అపోహలు ఉంటాయి. ఎక్కువ రైస్ తినడం వల్ల బరువు పెరగడానికి కారణమవుతుందని భావిస్తారు. మరి నిజంగానే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారా? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్బోహైడ్రేట్లు ఎక్కువ తీసుకోవడం వల్ల బరువు పెరగరని నిపుణులు అంటున్నారు. ఇవి ప్రోటీన్‌తో సమానమైన శక్తిని కలిగి ఉంటాయని వివరిస్తున్నారు. పాలు ,పండ్లు కూరగాయలలో సహజంగా లభించే కార్బోహైడ్రేట్లు ఉంటాయని ఈ విషయం చాలా మందికి తెలియదంటున్నారు. కార్బోహైడ్రేట్ లోపం వల్ల విపరీతమైన అలసట, బద్ధకం, శక్తి లోపానికి దారితీస్తుంది, ఎందుకంటే కార్బోహైడ్రేట్లు సాధారణ శారీరక పనితీరుకు అవసరమైన 45 నుండి 65% కేలరీలను అందిస్తాయి. ఇక కార్బోహైడ్రేట్లు అత్యంత ముఖ్య అవయవమైన మెదడుకు అద్భుత శక్తిని అందిస్తాయి. అయితే కార్బోహైడ్రేట్ వినియోగం వల్ల శరీరం అదనపు ఇన్సులిన్‌ను విడుదల చేస్తుంది. దీని వలన బరువు పెరుగుతారు.
సాధారణ కార్బోహైడ్రేట్లు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతాయి. శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి, అయితే సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు రోజువారీ జీవనానికి అవసరమైన ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు . ఖనిజాలతో కూడిన చక్కెరల పూర్తి గొలుసును అందిస్తాయి. బరువు పెరగడం అనేది వినియోగించే కేలరీల సంఖ్యతో ముడిపడి ఉంటుందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ఎక్కువ కేలరీలు ఉన్న ఏదైనా ఆహారం బరువు పెరుగుటకు దారి తీస్తుంది. జన్యు, మందులు, గర్భం, మెనోపాజ్, డిప్రెషన్ సమస్యలతో పాటు బరువు పెరగడానికి అనేక ఇతర కారణాలలో ఉన్నాయి. అందుకే ఏది తిన్నా స్మార్ట్‌గా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.
"ఆరోగ్యకరమైన జీవనశైలి కలిగి ఉండాలంటే రోజు వారిగా వ్యాయామాల తప్పక చేయాలి. ఎందుకంటే కెలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకున్నప్పుడు వ్యాయామం చేయకుండా ఉంటే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. తిన్న 10 నిమిషాల తర్వాత నడవడం వల్ల శరీరం జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. మధుమేహంతో బాధపడేవారికి నడక తప్పని సరి . రెగ్యులర్ వాకింగ్, తిన్న తర్వాత వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు, LDL (చెడు) కొలెస్ట్రాల్ తగ్గుతుంది, అదే సమయంలో స్ట్రోక్ లేదా గుండె ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
శరీరానికి పిండి పదార్థాలు ఇంధనంలా పని చేస్తాయి. సగటు భారతీయ శరీరాల ప్రకారం, ఒక వ్యక్తి రోజుకు 282 గ్రాముల కార్బోహైడ్రేట్‌లను తీసుకోవాలి, ఇది వ్యక్తికి వ్యక్తికి మారుతూ ఉంటుంది, ఎందుకంటే ఏ వ్యక్తి ఒకే విధమైన శరీరాన్ని కలిగి ఉండరు, వయస్సు అంశం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వారికి కార్బోహైడ్రేట్లు శక్తి ప్రదాత. ఎక్కువగా వ్యాయామ చేయడానికి ఇవి సహాయపడతాయి, వర్కౌట్ తర్వాత, కణజాలం మరమ్మత్తు, పునరుద్ధరణకు ప్రోటీన్‌తో కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం. కోల్పోయిన గ్లైకోజెన్ (బ్రోకెన్-డౌన్ కార్బోహైడ్రేట్లు) ద్రవాలను భర్తీ చేయడానికి ఇవి ఉపయోగపడుతాయి.
సంబంధిత కథనం