Easy Breakfast Recipes : 20 నిమిషాల్లోనే చేసే 5 రకాల అల్పాహారాలు
Breakfast Recipes : ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు ముందు రోజు రాత్రి నుంచే ఆలోచించాలి. రేపు ఉదయం ఏం చేయాలనే ఆలోచనతోనే కొంతమంది సమయం అయిపోతుంది. అందుకే మీకు 20 నిమిషాల్లో చేసే 5 రకాల అల్పాహారాల గురించి.. ఇక్కడ చెబుతున్నాం.
ఉదయం.. లేచేసరికి.. ఎన్నో పనులు ఉంటాయి. దీనికితోడు బ్రేక్ ఫాస్ట్ గురించి.. ఆలోచించాలి. దీనికోసం ముందురోజు నుంచే ప్లాన్ చేయాలి. అయితే ఉదయం పూట మంచి ఆహారం తీసుకోవాలి. దీనితోపాటుగా.. త్వరగా చేసే ఆహారాలు అయితే మరి బెస్ట్ కదా. ఇక మీరు.. బ్రేక్ ఫాస్ట్ గురించి చింతించాల్సిన పని లేదు. క్షణాల్లో అయిపోయే అల్పాహారాల లిస్ట్ ఇక్కడ ఉంది. ప్యాకెట్ ఫుడ్ అంటే బ్రెడ్, సెరెల్, కార్న్ ఫ్లేక్స్ అంటూ వివిధ రకాలైన ఆహారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. కేవలం 20 నిమిషాల్లోనే.. అల్పాహారం చేయోచ్చు.
ఉగ్గాని కర్ణాటకలో సాధారణంగా చేసే ఒక రకమైన ఉప్మా. మీరు పోహా చేసే అటుకులను తీసుకోవాలి. కడిగి.. ఆ తర్వాత.. అదనపు నీటిని తీసేయాలి. తర్వాత.. ఉల్లిపాయ-టమోటోతో వేరుశెనగ, పప్పు అన్ని వేసి.. కుక్ చేయాలి. ఆపైన కొంచెం నిమ్మరంస పిండి.. తింటే బాగుంటుంది.
ఆలూ పోహా గురించి వినే ఉంటారు. త్వరగా సులభంగా అయిపోయే పోహా వంటకం చేసుకోవచ్చు. ఆవాలు, కరివేపాకు, ఇతర సాధారణ మసాలా దినుసులతో పాటు ఉల్లిపాయలు, బంగాళాదుంపలను తరిగి, వేయించి పోహాను చేయాలి. అంతే.. సంతృప్తిని ఇచ్చే ఆలు పోహా రెడీ అవుతుంది.
చిల్లీ గార్లిక్ పుదీనా పరాటా.. ఆలూ లేదా గోబీ పరాటాతో విసుగు అనిపిస్తే మిరపకాయలతో కూడిన ఈ వెల్లుల్లి పరాటా తయారు చేయండి. భిన్నమైన రుచిని వస్తుంది. ఇందులో ఉండే పుదీనా కచ్చితంగా మీ బ్రేక్ ఫాస్ట్ రుచిని పెంచుతుంది.
రుచితోపాటుగా.. ప్రోటీన్ రూపంలో ఆరోగ్యం కూడా కావాలి అనుకుంటే.. ఎగ్ మసాలా భుర్జీ చేయండి. పరాటాకు పిండిని కలుపుకున్న తర్వాత.. గుడ్లను కొట్టి కొన్ని మసాలాలు వేసి వేయించి భుర్జీ చేయాలి. పరాటాలు చేసుకుని వాటిలో ఈ భుర్జీ పెట్టుకోవచ్చు. ఉదయం తింటే.. మధ్యాహ్నం వరకు కడుపు నిండుగా ఉంటుంది.
బేసన్ చీలా.. ఉత్తర భారతదేశంలో సాధారణంగా చేసే అల్పాహారం. ఇది చాలా సులభం, త్వరగా చేసేయోచ్చు. నీరు, ఉప్పు, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టొమాటోను శనిగపిండిలో కలుపుకోవాలి. దానిని పాన్ మీద పోసి సమాంతరంగా ఉండేలా చూసుకోవాలి. బాగా కాలాక మరోవైపు తిప్పి కాల్చాలి. కరకరలాడే బేసన్ చీలా అల్పాహారం తయారు అయిపోతుంది.
సంబంధిత కథనం