Amazon Sale:అమెజన్‌‌లో భారీ డిస్కౌంట్స్.. ఈ స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం తగ్గింపు!-amazon great indian festival 2022 sale special discounts on smartwatches ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Amazon Sale:అమెజన్‌‌లో భారీ డిస్కౌంట్స్.. ఈ స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం తగ్గింపు!

Amazon Sale:అమెజన్‌‌లో భారీ డిస్కౌంట్స్.. ఈ స్మార్ట్‌వాచ్‌లపై 80 శాతం తగ్గింపు!

HT Telugu Desk HT Telugu
Sep 24, 2022 10:17 PM IST

Amazon Sale 2022: Amazon Great Indian Festival Sale 2022లో కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, స్మార్ట్‌వాచ్‌లు మొదలైన వాటిపై ప్రత్యేక తగ్గింపు లభిస్తున్నాయి . ఈ సంవత్సరం, అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఎనిమిది రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే సెప్టెంబర్ 30 వరకు ఈ సేల్‌ను కొనసాగుతుంది.

Amazon Sale 2022
Amazon Sale 2022

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2022 ప్రారంభమైంది. ఈ సంవత్సరం, అమెజాన్ ఫెస్టివల్ సేల్ సెప్టెంబర్ 30 వరకు ఎనిమిది రోజుల పాటు వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ సెల్‌లో కస్టమర్లు స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, కంప్యూటర్ పెరిఫెరల్స్, స్మార్ట్‌వాచ్‌లు మొదలైన వాటిపై ప్రత్యేక తగ్గింపులను పొందవచ్చు. ఈ ఆఫర్ కింద, బ్లూటూత్ కాలింగ్ ఫీచర్, AMOLED డిస్‌ప్లేతో కూడిన స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్ భారీ తగ్గింపును అందిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు అపరిమిత క్యాష్‌బ్యాక్ ప్రకటించింది. ఈ సేల్ కింద క్యాష్ బ్యాక్ ఆఫర్ రివార్డ్‌ల కోసం అమెజాన్ డైమండ్స్‌ను రీడీమ్ చేసుకునే అవకాశాన్ని కస్టమర్‌లు పొందుతారు . బ్యాంక్ ఆఫర్‌లో SBI క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను ఉపయోగించి చేసే కొనుగోళ్లపై 10 శాతం తక్షణ తగ్గింపు కూడా పొందవచ్చు. అమెజాన్ స్మార్ట్‌వాచ్‌లపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో తెలుసుకుందాం.

ఫైర్-బోల్ట్ విజనరీ

Fire-Bolt Visionaryలో 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, 368×448 పిక్సెల్ రిజల్యూషన్, 100 కంటే ఎక్కువ యాక్టివ్ స్పోర్ట్స్ మోడ్‌లు, వాయిస్ అసిస్టెంట్, BT కాలింగ్ ఫీచర్‌తో పాటు మరెన్నో ఫీచర్లను అందించారు. వాచ్ వాటర్ ప్రూఫ్, SpO2 ఫీచర్లతో వస్తుంది. ఈ స్మార్ట్ వాచ్ ధర రూ. 17,999 మరియు ఆఫర్ కింద ఈ స్మార్ట్ వాచ్ రూ. 3,799 ధరకు లభిస్తుంది.

నాయిస్ కలర్ ఫిట్ అల్ట్రా 2 బజ్

ఈ స్మార్ట్ వాచ్ ధర 6,999గా ఉండగా.. ఆఫర్ కింద, 2,799 తగ్గింపు ధరతో లభిస్తుంది. ఇది 1.78-అంగుళాల AMOLED డిస్ప్లే , BT కాలింగ్ కలిగి ఉంది, ఇందులో 368×448 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ను అందించారు. ఈ స్మార్ట్‌వాచ్‌లో 100+ వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. ఆటో డిటెక్షన్‌తో 100 స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది

ZEBRONICS ఐకానిక్

రూ.10,999 గల ZEBRONICS Iconic వాచ్ ఆఫర్ కింద రూ.3,099కి అందుబాటులో ఉంది. ఇది 1.9-అంగుళాల AMOLED డిస్‌ప్లే, BT కాలింగ్ ఫీచర్, వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్, 'ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే' ఫీచర్, 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, ఇక ఇతర ఆప్షన్స్‌ను కలిగి ఉంది.

TAGG వెర్వ్ కనెక్ట్ అల్ట్రా

TAGG వెర్వ్ కనెక్ట్ అల్ట్రా 1.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే, BT కాలింగ్, పాస్‌వర్డ్ సెప్టీ, 120కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, కాలిక్యులేటర్, ఇన్-బిల్ట్ గేమ్‌లు మరిన్నింటిని కలిగి ఉంది. TAGG Verve Connect Ultra ధర రూ. 9,999, ఆఫర్ కింద రూ. 3,299కి అందుబాటులో ఉంది.

BoAt Xtend ప్రో

ఈ స్మార్ట్ వాచ్ 1.78-అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. BT కాలింగ్‌ను చేసుకోవచ్చు. 30 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. అదనంగా ఇది 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లను కలిగి ఉంది. boAt Xtend Pro ఒక మెటల్ పట్టీతో వస్తుందని గమనించాలి. BoAt Xtend Pro ధర రూ. 9,799గా ఉంది ఆఫర్ కింద, ఈ స్మార్ట్ వాచ్ రూ. 2,999 తగ్గింపు ధరతో లభిస్తుంది.

WhatsApp channel