Post Holi Fatigue | హ్యాంగోవర్​ అయినా? హోలీ ఓవర్ అయినా చిట్కాలు ఇవే..-8 tips for cope up festval blues after holi ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Post Holi Fatigue | హ్యాంగోవర్​ అయినా? హోలీ ఓవర్ అయినా చిట్కాలు ఇవే..

Post Holi Fatigue | హ్యాంగోవర్​ అయినా? హోలీ ఓవర్ అయినా చిట్కాలు ఇవే..

Geddam Vijaya Madhuri HT Telugu
Mar 19, 2022 01:36 PM IST

హోలీ భారతదేశంలో అత్యంత ఆసక్తితో ఎదురుచూసే పండుగలలో ఒకటి. హోలీ విషయానికి వస్తే పాటలు, ఆటలు, ఆహారం, రంగులు. ఇలా ఒకటా రెండా.. ఆడి పాడేందుకు, అలసి సొలసేందుకు ఎన్నో వేడుకలు ఉంటాయి. ఈ హోలీ ఆడినప్పుడు బాగానే ఉంటుంది కానీ.. వేడుక ముగిసేసరికే అలసట వచ్చేస్తుంది. కాబట్టి హోలీ తర్వాత అలసట నుంచి బయటపడటం ఎలా?

అలసటను తగ్గించే చిట్కాలు
అలసటను తగ్గించే చిట్కాలు

 పండుగ వేడుకల తర్వాత అలసిపోవడం సాధారణం. అందులోనూ హోలీ. ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. ఫెస్టివ్​ మోడ్​లో ఎంత ఎగురుతామో.. ఎంత ఆడుతామో ఆ దేవునికే తెలియాలి అన్నట్లు ఉంటాది. ఇంత ఎగిరిన తరువాత అలసిపోవడం అనేది చాలా కామన్. మరి దానిని అధిగమించాలి అంటే ఈ 8 చిట్కాలను పాటించాలి అంటున్నారు నిపుణులు.

హోలీ తర్వాత ఎందుకు అలసట వస్తుంది?

హోలీ సమయంలో భాంగ్ లేదా ఆల్కహాల్ వంటి పదార్ధాలను చాలా మంది తీసుకుంటారు. కాబట్టి మరుసటి రోజు మైకము, అలసటతో ఉంటారు. ఇది మాత్రమే కాదు, అలసట, వికారం, తలనొప్పి కూడా వస్తుంది. కాబట్టి మరుసటి రోజు హ్యాంగోవర్ వచ్చే అవకాశముంటుందని డాక్టర్ షా తెలిపారు. అదనపు ఆహారం, ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం కూడా కారణాలు కావొచ్చు. కాబట్టి హోలీ తర్వాత మీ అలసటను సమర్థవంతమైన తగ్గించుకునేందుకు 8 చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

1. నిమ్మకాయ నీరు త్రాగాలి

హ్యాంగోవర్‌తో బాధపడేవారు, రీహైడ్రేషన్‌లో సహాయపడే నిమ్మరసం లేదా పొట్టకు ఉపశమనం కలిగించే మజ్జిగ (చాస్) కూడా తాగవచ్చు. భాంగ్, తండై లేదా ఆల్కహాల్ మిమ్మల్ని డీహైడ్రేట్ చేస్తాయి. మీకు కడుపు నొప్పి ఉండవచ్చు కాబట్టి వాటిని ఇవి నివారిస్తాయి.

2. హైడ్రేటెడ్​గా ఉండండి

శరీరం నుంచి టాక్సిన్స్​ను బయటకు పంపేందుకు తగినంత నీరు తాగడం చాలా అవసరం. మిమ్మల్ని మీరు వీలైనంత ఎక్కువగా హైడ్రేట్​గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి. కాఫీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు నీరసంగా ఉన్నప్పుడు కాఫీ తాగడం అనేది చెడు ఆలోచన. ఎందుకంటే కాఫీ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది.

3. ఆరోగ్యకరమైన అల్పాహారం

హ్యాంగోవర్ తర్వాత మరుసటి రోజు ఖాళీ కడుపుతో మీకు వికారంగా అనిపించవచ్చు. కాబట్టి, శక్తి స్థాయిలను పెంచడానికి విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని తినండి.

4. పండ్లు, కూరగాయలు

పుచ్చకాయ, అరటిపండు, యాపిల్ లేదా నారింజ వంటి పండ్లు... పాలకూర, బ్రోకలీ, బీట్‌రూట్ వంటి కూరగాయలను ఎక్కువగా తినండి. ఎందుకంటే వాటిలో విటమిన్ సి, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అవి మత్తును వదిలిస్తాయి. రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి. మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతాయి.

5. గోరు వెచ్చని నీటితో స్నానం

హ్యాంగోవర్ తర్వాత మరుసటి రోజు మిమ్మల్ని మీరు పునరుద్ధరించుకోవడానికి గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. నిజానికి పడుకునే ముందు దీన్ని తీసుకోవడం వల్ల మీ నిద్రను మెరుగుపరుస్తుంది.

6. ఆహారాలు తినండి

హోలీ తర్వాత బద్ధకం, అలసట నుంచి బయటపడటానికి.. చిక్కుళ్ళు, గింజలు, పెరుగు, ఖర్జూరాలు లేదా వోట్స్ వంటి ఆహారాన్ని తీసుకోండి. ఈ ఆహారాలలో ప్రొటీన్లు, ఫైబర్ కాపర్, ఐరన్, విటమిన్లు, అన్ని ఇతర శక్తి ఉత్పత్తి పోషకాలు అధికంగా ఉన్నందున అవి మీకు బద్ధకాన్ని పోగొట్టి మీ మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

7. బాగా నిద్రపోండి

పండుగ సమయంలో నిత్యం ఉండే సరదాల వల్ల శరీరంలో శక్తి స్థాయి పడిపోతుంది. ట్రాక్‌లోకి తిరిగి రావడానికి మీకు కొంత శక్తి అవసరముంటుంది. కాబట్టి మంచి నిద్ర అవసరం. ఇది మీ శరీరానికి, మనస్సుకు విశ్రాంతి ఇస్తుంది.

8. మంచి వ్యాయామం

హోలీ తర్వాత మీ ఎనర్జీ లెవల్స్‌ను పెంచుకోవడానికి, మంచి వర్కవుట్ రొటీన్ చేయండి. వర్కవుట్ చేయడం వల్ల మీరు మరింత శక్తివంతంగా ఉంటారు. అలసటను తగ్గించడంలో గ్రేట్​గా సహాయపడుతుంది. అలసటను త్వరగా వదిలించుకోవడానికి కొన్ని సాగదీయడం, బలపరిచే వ్యాయామాలు లేదా యోగా వ్యాయామాలు చేయండి.

కాబట్టి ఈ చిట్కాలను అనుసరించి.. పండుగ అలసటకు బై బై చెప్పండి!

WhatsApp channel

సంబంధిత కథనం