Regular Sex Benefits: రెగ్యులర్‌గా శృంగారం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే 8 ప్రయోజనాలు ఇవే!-8 health benefits of having regular sex ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Regular Sex Benefits: రెగ్యులర్‌గా శృంగారం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే 8 ప్రయోజనాలు ఇవే!

Regular Sex Benefits: రెగ్యులర్‌గా శృంగారం చేయడం వల్ల ఆరోగ్యానికి కలిగే 8 ప్రయోజనాలు ఇవే!

HT Telugu Desk HT Telugu
Jul 28, 2023 12:19 AM IST

Regular Sex Benefits: రెగ్యులర్‌గా శృంగారంలో పాల్గొనడం వల్ల పురుషులు, మహిళలకు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఎలాంటి బెనెఫిట్స్ ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Regular Sex Benefits: లైఫ్ పార్ట్‌నర్స్ తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. రెగ్యులర్‌ సెక్స్ వల్ల ఆరోగ్యానికి బెనెఫిట్స్ కలుగుతాయి. శృంగారంలో ఎక్కువగా పాల్గొంటే పురుషులు, మహిళలకు ఆరోగ్య మెరుగుదల పరంగా కొన్ని లాభాలు ఉంటాయి. శృంగారంలో చేయగానే ఒత్తిడి, ఆందోళన తగ్గిందని కొందరు చెబుతుంటారు. అది మాత్రమే కాదు శృంగారం వల్ల ఆరోగ్యానికి మరిన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి. రెగ్యులర్ సెక్స్ వల్ల కలిగే 8 హెల్త్ బెనిఫిట్స్ ఏవో ఇక్కడ చూడండి.

ఎమోషనల్ బంధం మెరుగుదల

జీవిత భాగస్వాములు తరచూ శృంగారంలో పాల్గొనడం వల్ల వారి మధ్య ఎమోషనల్ బంధం మరింత బలపడుతుంది. భావోద్వేగ సంబంధం మరింత మెరుగవుతుంది. లవ్ హర్మోన్‍గా పిలిచే ఆక్సిటోసిన్.. సెక్స్ సమయంలో వెలువడుతుంది. ఒకరిపై ఒకరికి ఎఫెక్షన్ పెరిగేందుకు ఇది ఉపకరిస్తుంది. లైఫ్ పార్ట్‌నర్స్ మధ్య బంధం బలంగా ఉండాలంటే తరచూ శృంగారం చేసుకోవడం మంచి మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

గుండెకు మేలు

సెక్స్‌లో తరచూ పాల్గొనడం వల్ల గుండెకు కూడా వ్యాయామంగా ఉంటుంది. శృంగారం చేసుకునే సమయంలో గుండె స్పందన రేటు, రక్త ప్రవాహం, ఆక్సిజన్ వినియోగం అధికమవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రోగ నిరోధక శక్తి మెరుగు

శృంగారం వల్ల రోగ నిరోధక వ్యవస్థకు కూడా మేలు జరుగుతుందని పలు అధ్యయానాలు వెల్లడించాయి. లైంగిక ప్రేరేపణ వల్ల ఇమ్యునోగ్లోబిన్ ఏ (IgA) ఉత్పత్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షల నుంచి శరీరాన్ని రక్షించేందుకు ఇది తోడ్పడుతుంది.

ఒత్తిడి తగ్గుతుంది

సహజ శృంగారంలో పాల్గొంటే చాలా మందికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ మూడ్ ఏర్పడుతుంది. సెక్స్ సమయంలో శరీరం ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్‍ను విడుదల చేస్తుంది. దీని వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.

నొప్పుల నుంచి కూడా..

సెక్స్ సమయంలో ఎండార్ఫిన్ విడుదలవడం వల్ల కొన్ని రకాల శరీర నొప్పుల నుంచి తాత్కాలిక కూడా ఉపశమనం లభిస్తుంది. శృంగారంలో పాల్గొన్న తర్వాత చాలా మందికి తలనొప్పి లాంటి నొప్పుల నుంచి కాసేపు రిలాక్సియేషన్ కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

నిద్ర మెరుగుదల

రెగ్యులర్‌గా లైంగిక కార్యకలాపాల్లో పాల్గొనే వారికి మెరుగైన నిద్ర పడుతుందని పలు అధ్యయనాలు తేల్చాయి. సెక్స్ సమయంలో ఎండార్ఫిన్ విడుదల వల్ల మనసుకు హాయిగా అనిపించి నిద్ర కూడా బాగా పడుతుంది. తరచూ శృంగారం వల్ల నిద్రలేమి సమస్య తగ్గే అవకాశం ఉంటుంది.

కండరాల దృఢత్వానికి..

తరచూ శృంగారం వల్ల మహిళల్లో.. గర్భాశయం, మూత్రాశయం, ప్రేగులకు సపోర్టు ఉండడంలో కీలక పాత్ర పోషించే కటి కండరాల దృఢత్వం పెరుగుతుంది.

వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి

లైంగికంగా చురుకుగా ఉండే మహిళలు వృద్ధాప్యం వచ్చాక మెరుగైన జ్ఞాపకశక్తిని కలిగి ఉంటారని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. కొందరు పురుషుల్లో కూడా ఈ ప్రయోజనం ఉంటుందని తేలింది.

WhatsApp channel