తెలంగాణ ఆడపడుచు- ఆంధ్రాలో మంత్రి
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్‌లో తెలంగాణ ఆడపడచు మంత్రిగా బాధ్యతలు స్వీకరించడంతో ఆమె స్వగ్రామంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన విడదల రజని వాస్తవానికి తెలంగాణ స్థానికురాలు.
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యం, విద్యా శాఖ మంత్రి రజని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన వారు. తుర్కపల్లి మండలం కొండాపురం గ్రామానికి చెందిన రాగుల సత్తయ్య రెండో కూతురైన రజని చదువు పూర్తైన తరువాత కొన్నాళ్లు అమెరికాలో పనిచేశారు. ఆ తర్వాత గుంటూరు జిల్లా చిలకలూరి పేటకు చెందిన పారిశ్రామిక వేత్త విడదల కుమారస్వామిని వివాహం చేసుకున్నారు. అమెరికాలో ఐటీ కంపెనీలు నిర్వహించే క్రమంలో 20117లలో రజని రాజకీయాల్లోకి వచ్చారు.
అప్పట్లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా టీడీపీలలో చురుగ్గా తిరిగే వారు. 2018 నాటికి టీడీపీని విడిచి వైసీపీలో చేరారు. తొలి ఎన్నికలోనే విజయం సాధించారు. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణలో కీలకమైన వైద్య, ఆరోగ్య శాఖకు మంత్రి కావటంపై ఆ గ్రామంలో ప్రజలు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తండ్రి రాగుల సత్తయ్య బతుకుదెరువు నిమిత్తం 40 ఏళ్ల క్రితం హైదరాబాద్‌కు వలస వెళ్లారు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. మరోవైపు శాఖల కేటాయింపులో రజనికి హోంశాఖను అప్పగిస్తారని ప్రచారం జరిగినా చివరకు వైద్య ఆరోగ్య శాఖను అప్పగించారు. అటు సీనియర్లను కాదని విడదల రజనికి మంత్రి పదవి కేటాయించడంపై వైసీపీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాపిక్