Vijay Sethupathi: నా కష్టకాలంలో ఆ మహేష్ బాబు సినిమా ఎన్నిసార్లు చూశానో: విజయ్ సేతుపతి-vijays sethupathi says he watched mahesh babus athadu so many times in his struggling days ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Sethupathi: నా కష్టకాలంలో ఆ మహేష్ బాబు సినిమా ఎన్నిసార్లు చూశానో: విజయ్ సేతుపతి

Vijay Sethupathi: నా కష్టకాలంలో ఆ మహేష్ బాబు సినిమా ఎన్నిసార్లు చూశానో: విజయ్ సేతుపతి

Hari Prasad S HT Telugu
Aug 12, 2024 08:13 AM IST

Vijay Sethupathi: తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. తన కష్టకాలంలో మహేష్ బాబు నటించిన ఓ సినిమాను ఎన్నోసార్లు చూసినట్లు అతడు వెల్లడించాడు.

నా కష్టకాలంలో ఆ మహేష్ బాబు సినిమా ఎన్నిసార్లు చూశానో: విజయ్ సేతుపతి
నా కష్టకాలంలో ఆ మహేష్ బాబు సినిమా ఎన్నిసార్లు చూశానో: విజయ్ సేతుపతి

Vijay Sethupathi: మహేష్ బాబుకు సాధారణ అభిమానులే కాదు సెలబ్రిటీలు కూడా ఫ్యాన్సే అని చెప్పడానికి ఇది మరో ఉదాహరణ. తమిళ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా పేరుగాంచిన విజయ్ సేతుపతి ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మహేష్ నటించిన అతడు మూవీ గురించి చెబుతూ.. తాను హీరోగా ఎదగడానికి ప్రయత్నిస్తున్న రోజుల్లో ఆ సినిమాను ఎన్నోసార్లు చూసినట్లు చెప్పాడు.

అతడు ఎన్నిసార్లు చూశానో..

విజయ్ సేతుపతి కొంత కాలం కిందట ఇచ్చిన ఇంటర్వ్యూల్లో నుంచి ఒక వీడియో క్లిప్ ను ఈ మధ్య మహేష్ బాబు, అతడు మూవీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. అతడు సినిమాకు మరో సెలబ్రిటీ అభిమాని దొరికాడంటూ ఆ ఇంటర్వ్యూలో విజయ్ సేతుపతి ఈ మూవీ గురించి చేసిన కామెంట్స్ వీడియోను షేర్ చేశారు. అందులో ఈ సినిమాపై విజయ్ తమిళంలో మాట్లాడటం చూడొచ్చు.

తన కష్టకాలంలో ఈ అతడు సినిమాను చాలాసార్లు చూసినట్లు ఆ ఇంటర్వ్యూలో విజయ్ తెలిపాడు. మొదట షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ.. తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఓ నటుడిగా నిలదొక్కుకోవడానికి విజయ్ చాలానే శ్రమించాల్సి వచ్చింది. ఆ సమయంలో ఈ సినిమా నుంచి తాను స్ఫూర్తి పొందినట్లు చెప్పాడు. ఆ మూవీలో మహేష్ బాబు ఎంట్రీ సీన్ నుంచి చివరి సీన్ వరకు ప్రతి ఒక్కటీ తనకు గుర్తుందని అన్నాడు. ఇక మహేష్, త్రిష మధ్య కెమెస్ట్రీ కూడా చాలా బాగుందని తెలిపాడు.

మహేష్ అతడు మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో వచ్చిన అతిపెద్ద హిట్స్ లో ఈ అతడు ఒకటి. 2005లో రిలీజైన ఈ సినిమా అప్పట్లో అన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మహేష్ నటనకు ఫిదా కాని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదు. కాస్త నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రే అయినా.. ఈ మూవీతో మహేష్ కు మంచి పాపులారిటీ వచ్చింది.

సినిమాలోని డైలాగ్స్, పాటలు ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఈ సినిమాతో అతని కెరీర్ పూర్తిగా మలుపు తిరిగింది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. ఆ మరుసటి ఏడాదే పోకిరి మూవీతో మరో ఇండస్ట్రీ హిట్ ను మహేష్ సొంతం చేసుకున్నాడు.

ఇక విజయ్ సేతుపతి గురించి చెప్పాలంటే అతడు ఈ మధ్యే మహారాజా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అతని కెరీర్లో ఇది 50వ సినిమా కావడం విశేషం. అదిరిపోయే ట్విస్టులు ఉన్న ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఇది. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు వచ్చాయి. తర్వాత ఓటీటీలోనూ నెట్‌ఫ్లిక్స్ టాప్ ట్రెండింగ్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.