Maharaja Director: థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న మూవీ.. డైరెక్టర్‌కు నిర్మాత లగ్జరీ కారు గిఫ్ట్-vijay sethupathi maharaja movie completes 100 days in theaters producer gift luxury car to director ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Maharaja Director: థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న మూవీ.. డైరెక్టర్‌కు నిర్మాత లగ్జరీ కారు గిఫ్ట్

Maharaja Director: థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న మూవీ.. డైరెక్టర్‌కు నిర్మాత లగ్జరీ కారు గిఫ్ట్

Hari Prasad S HT Telugu
Oct 07, 2024 03:22 PM IST

Maharaja Director: థియేటర్లలో సినిమా 100 రోజులు పూర్తి చేసుకోవడంతో డైరెక్టర్ కు ఓ లగ్జరీ కారును ప్రొడ్యూసర్ గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. విజయ్ సేతుపతి నటించిన 50వ సినిమా మహారాజా బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే.

థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న మూవీ.. డైరెక్టర్‌కు నిర్మాత లగ్జరీ కారు గిఫ్ట్
థియేటర్లలో 100 రోజులు పూర్తి చేసుకున్న మూవీ.. డైరెక్టర్‌కు నిర్మాత లగ్జరీ కారు గిఫ్ట్

Maharaja Director: ఒకప్పుడు థియేటర్లలో సినిమాలు 100, 200 రోజుల వరకూ ఆడేవి. అలా ఆడిన సినిమాలనే హిట్, సూపర్ హిట్ అని పిలిచేవాళ్లు. కానీ ఆ తర్వాత మెల్లగా వీటిని నిర్ణయించడానికి బాక్సాఫీస్ వసూళ్లనే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఇప్పటికీ ఏదో ఒక సినిమాల కొన్ని థియేటర్లలో 100 రోజులు ఆడుతోంది. అలాంటి మూవీయే విజయ్ సేతుపతి నటించిన మహారాజా.

మహారాజా డైరెక్టర్‌కు కారు

తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా వచ్చి ఓ మైలురాయిగా మిగిలిపోయిన మూవీ మహారాజా. ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్ల వరకూ వసూలు చేసింది. అంతేకాదు ఈ మధ్యే 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ ప్రొడ్యూసర్లు సుధన్ సుందరమ్, జగదీశ్ కలిసి డైరెక్టర్ నిథిలన్ సామినాథన్ కు ఓ బీఎండబ్ల్యూ కారును గిప్ట్ గా ఇచ్చారు.

ఈ కారు కీని మూవీ హీరో విజయ్ సేతుపతే డైరెక్టర్ కు అందజేయడం విశేషం. తన 50వ సినిమాను మరింత మధుర జ్ఞాపకంగా మార్చేసిన డైరెక్టర్ ను విజయ్ కూడా అభినందించాడు. ఈ లగ్జరీ కారు డైరెక్టర్ అందుకుంటున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. మహారాజా మూవీ ఆ తర్వాత నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చి అక్కడా ప్రేక్షకుల మనసులు దోచుకుంది.

మహారాజా మూవీ ఏంటి?

మహారాజా కేవలం రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.107 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. ఓ సింపుల్ రివేంజ్ స్టోరీకి ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఇస్తూ మహారాజా మూవీని దర్శకుడు నిథిలన్ సామినాథన్ అద్భుతంగా తెరకెక్కించాడు.

ఈ సినిమాలో విలన్ గా నటించిన బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. అంతకుముందు మెర్రీ క్రిస్మస్ మూవీ ఇచ్చిన పరాజయాన్ని విజయ్ సేతుపతి.. ఈ మహారాజా ద్వారా భర్తీ చేయగలిగాడు.

మహారాజా మూవీ ఓ క్రైమ్ థ్రిల్లర్. ఈ సినిమాలో ఓ సాధారణ బార్బర్ గా నటించాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. తన ఇంట్లో ఓ దొంగతనం జరిగిందని, తమ జీవితాల్లో ఎంతో ముఖ్యమైన లక్ష్మిని ఎవరో ఎత్తుకెళ్లారని మహారాజా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తాడు. అసలు ఆ లక్ష్మి ఎవరు అన్నది ఓ ట్విస్ట్ కాగా.. దాని చుట్టూ తిరిగే కథ, అందులో భాగంగా వచ్చే ట్విస్టులకు మైండ్ బ్లాంక్ అవుతుంది.

ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీని ప్రేక్షకుల ఊహకు అందని ట్విస్టులతో తీస్తే ఎలా ఉంటుందో ఈ మహారాజా మూవీ నిరూపిస్తోంది. మొదటి సీన్ నుంచి క్లైమ్యాక్స్ వరకు ప్రతి సీన్లోనూ సినిమా ఎంతో ఉత్కంఠ రేపుతోంది. తెలిసిన స్టోరీయేగా అని అనుకునే ప్రతిసారీ ఓ ట్విస్ట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది. ఇదే ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ గా నిలుస్తోంది.

Whats_app_banner