Varun Tej Lavanya Tripathi: అందుకే లావణ్యను ఇటలీలో పెళ్లి చేసుకున్నా.. ఆమెకు ఇచ్చిన వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇదే: వరుణ్-varun tej lavanya tripathi mega prince revealed why he married in italy and valentines day gift tollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Varun Tej Lavanya Tripathi: అందుకే లావణ్యను ఇటలీలో పెళ్లి చేసుకున్నా.. ఆమెకు ఇచ్చిన వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇదే: వరుణ్

Varun Tej Lavanya Tripathi: అందుకే లావణ్యను ఇటలీలో పెళ్లి చేసుకున్నా.. ఆమెకు ఇచ్చిన వాలెంటైన్స్ డే గిఫ్ట్ ఇదే: వరుణ్

Hari Prasad S HT Telugu
Feb 20, 2024 10:46 AM IST

Varun Tej Lavanya Tripathi: లావణ్య త్రిపాఠీని ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి కారణమేంటన్నదానితోపాటు వాలెంటైన్స్ డేకు ఆమెకు తాను ఇచ్చిన గిఫ్ట్ ఏంటన్నది కూడా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ వెల్లడించాడు.

లావణ్య త్రిపాఠీని ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి కారణం వెల్లడించిన వరుణ్ తేజ్
లావణ్య త్రిపాఠీని ఇటలీలో పెళ్లి చేసుకోవడానికి కారణం వెల్లడించిన వరుణ్ తేజ్ (Instagram)

Varun Tej Lavanya Tripathi: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠీ పెళ్లి గతేడాది నవంబర్ లో జరిగిన విషయం తెలుసు కదా. చాలా మంది సెలబ్రిటీల్లాగే వీళ్లు కూడా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఇటలీలో పెళ్లి చేసుకున్నారు. అయితే తాజా దీని వెనుక కారణమేంటో వరుణ్ వెల్లడించాడు. మార్చి 1న అతని కొత్త సినిమా ఆపరేషన్ వాలెంటైన్ రిలీజ్ కానున్న నేపథ్యంలో జూమ్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ మాట్లాడాడు.

అందుకే ఇటలీ వెళ్లాం: వరుణ్

తన పెళ్లిలో కుటుంబం మొత్తం బాగా ఎంజాయ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఇలా ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లు వరుణ్ తేజ్ వెల్లడించాడు. మామూలుగా అయితే వేల మంది పెళ్లికి వస్తుంటారని, కానీ తన పెళ్లికి మాత్రం కేవలం 100 మందే వచ్చినట్లు చెప్పాడు. "నా కంటే నా పెళ్లిలో నా కజిన్స్ బాగా ఎంజాయ్ చేశారు. కానీ నా ఫ్యామిలీలో అందరికీ మంచి సంబంధాలు ఉన్నాయి.

అందరం బాగా ఎంజాయ్ చేశాం. లావణ్యను కలిసిన తర్వాత ఏడేళ్లకు పెళ్లి చేసుకున్నా. నా కుటుంబం ఎంజాయ్ చేయాలని భావించాను. మామూలు అయితే మా కుటుంబంలో 4 వేల నుంచి 10 వేల మంది పెళ్లిళ్లకు వస్తారు. కానీ నా పెళ్లికి కేవలం 100 మందిని ఆహ్వానించాం. మా ఫ్యామిలీ ఎంజాయ్ చేయడమే నాకు ముఖ్యం. అందుకే అందరినీ విదేశానికి తీసుకెళ్లాను" అని వరుణ్ చెప్పాడు.

లావణ్యకు అదే వాలెంటైన్స్ డే గిఫ్ట్

పెళ్లి తర్వాత వరుణ్ తేజ్, లావణ్య తొలి వాలెంటైన్స్ డే జరుపుకున్నారు. సాధారణంగా ఈ సందర్భంలో ఎవరైనా ఒకరికొకరు మంచి గిఫ్ట్ లు ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ తాను లావణ్యకుగానీ, ఆమె తనకుగానీ ఎలాంటి బహుమతులూ ఇవ్వలేదని వరుణ్ చెప్పాడు. హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్లో యాంకర్ సుమ అడిగిన ప్రశ్నకు వరుణ్ ఇలా స్పందించాడు.

"ఆమెకు నేను ఏ గిఫ్టూ ఇవ్వలేదు. ఆమె కూడా నాకు ఏమీ ఇవ్వలేదు. దానికి బదులు మేమిద్దరం కశ్మీర్ వెకేషన్ కు వెళ్లాం. కాలేజీ రోజుల్లో వాలెంటైన్స్ డేకు చాలా మందికి చాలా గిఫ్ట్ లు ఇచ్చేవాడిని. ఇప్పుడు అలా కాదు" అని వరుణ్ అన్నాడు. వరుణ్ తేజ్, మానుషి చిల్లర్ కలిసి నటించిన ఆపరేషన్ వాలెంటైన్ మూవీ మార్చి 1న థియేటర్లలో రిలీజ్ కానుంది.

ఈ మూవీ ఫస్ట్ సింగిల్ వందే మాతరం రిలీజైన విషయం తెలిసిందే. ఈ పాటను వాఘా సరిహద్దులో రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా వరుణ్ తేజ్ ఆ మధ్య సోనీలో వచ్చే ఇండియన్ ఐడల్ షోకి కూడా వెళ్లాడు. శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ద్వారా వరుణ్ తేజ్.. బాలీవుడ్ లో అడుగు పెడుతుండగా.. మానుషి టాలీవుడ్ లోకి వస్తోంది. ఈ మూవీలో వరుణ్ ఓ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిగా కనిపిస్తున్నాడు.

Whats_app_banner