Ustaad Bhagat Singh: పవర్ స్టార్ వచ్చేశాడు.. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ వచ్చేశాడు. ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. రాజకీయ కారణాలతో చిన్న బ్రేక్ తీసుకున్న పవన్ కల్యాణ్.. మళ్లీ ఈ మూవీ సెట్స్ లోకి వచ్చిన ఫొటోస్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Ustaad Bhagat Singh: పైన ఫొటో చూశారు కదా. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ లో మళ్లీ అడుగుపెట్టాడు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడంతో అర్ధంతరంగా అక్కడికి వెళ్లిన పవన్.. కొన్ని రోజుల పాటు షూటింగ్ కు దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పట్లో షూటింగ్ ప్రారంభం కాదనుకుంటున్న సమయంలో సడెన్ గా సెట్స్ లో ప్రత్యక్షమయ్యాడు.
పోలీస్ డ్రెస్ లో చాలా స్టైలిష్ లుక్ లో పవన్ కనిపించాడు. ఉస్తాద్ భగత్ సింగ్ షెడ్యూల్ ఇక శరవేగంగా జరగనుంది. ఇప్పటికే అతని మరో మూవీ ఓజీ నుంచి పవన్ బర్త్ డే సందర్భంగా వచ్చిన టీజర్ ఫ్యాన్స్ ను అలరిస్తోంది. ఇక ఇప్పుడు హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి కూడా కీలకమైన అప్డేట్ వచ్చేసింది. సెట్స్ లో పవన్ కు సీన్ వివరిస్తున్న హరీష్ శంకర్ ఫొటోతోపాటు పవన్ స్టైలిష్ గా నడుచుకుంటూ వస్తున్న ఫొటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఈ ఫొటోలనే మేకర్సే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాన్ స్టాప్ షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోందని మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాను నవీన్ యెర్నేని, రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
గబ్బర్‌సింగ్ రూపంలో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో మూవీలతో హ్యాట్రిక్ కొట్టిన పవర్ స్టార్.. ఇప్పుడు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.