Directors Likes Masooda: టాలీవుడ్ యువ దర్శకులు మెచ్చిన మసూద.. సరైన హర్రర్ చిత్రమని ప్రశంస
Directors Likes Masooda: రాహుల్ యాదవ్ నక్కా నిర్మాతగా వ్యవహించిన చిత్రం మసూద. సాయి కిరణ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ప్రీమియర్ టాలీవుడ్ యువదర్శకులు వీక్షించారు. అంతేకాకుండా సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.
Directors Likes Masooda: మళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన రాహుల్ యాదవ్ నక్కా మరో వినూత్న చిత్రాన్ని నిర్మించారు. అదే మసూద. ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో సంగీత, తిరువీర్, కావ్య కల్యాణ్ రామ్, బాంధవి శ్రీధర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని నవంబరు 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మసూద ప్రీమియర్‌ను చిత్రయూనిట్‌తో పూటు టాలీవుడ్ యువ దర్శకులు చూశారు. అనంతరం మీడియా సమావేశంలో వారు తమ స్పందనను తెలియజేశారు.
ఈ సందర్భంగా ఏజెంట్ ఆత్రేయ శ్రీనివాస దర్శకుడు స్వరూప్ ఆర్ జే మాట్లాడుతూ.. ఇది సరైన హర్రర్ చిత్రమని కొనియాడాడు. ఇలాంటి చిత్రాలను థియేటర్లో చూస్తే థ్రిల్లింగ్‌గా ఉంటుందని, మేము సినిమాను చూస్తునన్నంత సేపు ఎంజాయ్ చేశామని స్పష్టం చేశాడు. అనంతరం కలర్ ఫొటో డైరెక్టర్ సందీప్ రాజు మాట్లాడుతూ.. మళ్లీ రావా, ఏజెంట్ చిత్రాల తర్వాత రాహుల్ ఎలాంటి సినిమా తీస్తారో అనుకున్నాను.. హర్రర్ అనే సరికి రొటీన్ అని అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత షాక్ అయ్యానని తెలిపాడు. మ్యూజిక్, సౌండ్ కెమేరా అన్ని బాగా కుదిరాయని స్పష్టం చేశాడు.
అనంతరం కెరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేష్ మహా మాట్లాడుతూ.. హర్రర్ జోనర్ తీయాలనే ఇంట్రెస్ట్ లేదని ఇప్పుడున్న దర్శకులు అంటున్నారు. నేను కూడా అన్నాను కానీ నేను ఈ చిత్రాన్ని రెండు సార్లు చూశాను, హర్రర్‌ను పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తారు. హర్రర్ అంటే కామెడీ, మసాలా ఉండాలనుకునే సమయంలో ఇలాంటి కథను నిర్మిచిన రాహుల్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు స్పష్టం చేశాడు.
మసూద చిత్ర నిర్మాత రాహుల్ యాదవ్ మాట్లాడుతూ.. "సూపర్‌స్టార్ మరణం చాలా బాధాకరణం. మహేష్ బాబు, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. మళ్లీ రావా, ఏజెంట్ తర్వాత మళ్లీ ఓ మంచి చిత్రం చేసినందుకు ఆనందంగా ఉంది. మసూద శుక్రవారం విడుదల కాబోతుంది. సినిమా కచ్చితంగా నచ్చుతుందని నా నమ్మకం. సినిమా కోసం అందరం కష్టపడి పనిచేశాం." అని తెలిపాడు.
సంబంధిత కథనం
టాపిక్