Radha Madhavam Movie: రాధామాధ‌వం రిలీజ్ డేట్ ఫిక్స్ - తమిళ్ సినిమాలకు మించి రియ‌లిస్టిక్ ల‌వ్‌స్టోరీ-tollywood news radha madhavam release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Radha Madhavam Movie: రాధామాధ‌వం రిలీజ్ డేట్ ఫిక్స్ - తమిళ్ సినిమాలకు మించి రియ‌లిస్టిక్ ల‌వ్‌స్టోరీ

Radha Madhavam Movie: రాధామాధ‌వం రిలీజ్ డేట్ ఫిక్స్ - తమిళ్ సినిమాలకు మించి రియ‌లిస్టిక్ ల‌వ్‌స్టోరీ

Nelki Naresh Kumar HT Telugu
Feb 17, 2024 01:37 PM IST

Radha Madhavam Movie: విలేజ్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతోన్న రాధామాధ‌వం రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. మార్చి 1న థియేట‌ర్ల ద్వారా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

 రాధామాధ‌వం రిలీజ్ డేట్
రాధామాధ‌వం రిలీజ్ డేట్

Radha Madhavam Movie: గ్రామీణ ప్రేమ కథ చిత్రం రాధా మాధ‌వం రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. వినాయ‌క్ దేశాయ్‌, అప‌ర్ణ దేవి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ మూవీ మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. అచ్చమైన ప్రేమ కథతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీని గోనాల్ వెంక‌టేష్ నిర్మించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు.కంప్లీట్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో రాధా మాధ‌వం మూవీ తెర‌కెక్కుతోంది. రాధ‌, మాధ‌వ్ అనే జంట క‌థ‌తో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కిస్తోన్న‌ట్లు క‌నిపిస్తోంది.

కుల‌మతాల అంత‌రాలు...

కుల‌మ‌తాల అంత‌రాలు ఓ జంట ప్రేమ‌కు అడ్డంకిగా ఎలా నిలిచాయ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఈ మూవీని తెర‌కెక్కించాడు. త‌మిళ సినిమాల‌కు మించి రియ‌లిస్టిక్‌గా ఈ ప్రేమ‌క‌థ ఉండ‌బోతున్న‌ట్లు సినిమా యూనిట్ చెప్పింది. ల‌వ్ స్టోరీతో పాటు సినిమాలో ఓ సందేశం ఉండ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు తెలిపాడు. వినాయ‌క్ దేశాయ్‌, అప‌ర్ణ దేవి ఈ సినిమాతోనే హీరోహీరోయిన్లుగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారు. కొత్త వారు అయినా చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచార‌ని సినిమా యూనిట్ చెబుతోన్నారు.

ట్రైల‌ర్‌కు వ‌న్ మిలియ‌న్ వ్యూస్‌

రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయ‌ని అంటున్నారు. .ట్రైల‌ర్‌కు వ‌న్ మిలియ‌న్‌కుపైగా వ్యూస్ వ‌చ్చాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రంగా సెన్సార్ నుంచి ప్ర‌శ్నంలు అందుకున్న‌ట్లు నిర్మాత తెలిపారు. మార్చి 1న భారీ స్థాయిలో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించాడు.రాధామాధ‌వంలో మేక రామకృష్ణ, జయ ప్రకాష్, ప్రియ, నవీన్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు చైతూ మ్యూజిక్ అందిస్తున్నాడు.

మార్చి 1న రాబోతున్న సినిమాలు..

మార్చి 1న ప‌లు చిన్న సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద పోటీప‌డ‌బోతున్నాయి. మెగా హీరో వ‌రుణ్‌తేజ్ హీరోగా న‌టిస్తోన్న ఆప‌రేష‌న్ వాలెంటైన్ మార్చి 1న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. దీనితో పాటు టాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ వెన్నెల‌కిషోర్ హీరోగా న‌టిస్తోన్న చారి 111 మూవీ మార్చి 1న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాతో పాటు శివ కందుకూరి భూత‌ద్ధం భాస్క‌ర్ నారాయ‌ణ‌, ర‌జాకార్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతున్నారు.

IPL_Entry_Point