Rao Ramesh Help to his Makeup Man: సినీ నటులంటే కేవలం డబ్బుల కోసం నటిస్తారని మనలో చాలా మందికి అపోహ ఉంటుంది. అయితే నటనలోనే కాదు.. సమాజ సేవలోనూ ముందుంటున్నామని నిరూపిస్తున్నారు కొంతమంది యాక్టర్లు. సోనూ సూద్ లాంటి నటులు.. సమాజానికి ఏదైనా చేయాలనే తలంపుతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ప్రముఖ నటుడు రావు రమేశ్ కూడా చేరిపోయారు. ఇటీవల మృతి చెందిన తన మేకప్ మ్యాన్ కుటుంబానికి అండగా నిలిచి గొప్ప మనస్సు చాటుకున్నారు. అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
రావు రమేశ్ పర్సనల్ మేకప్ మ్యాన్‌గా పనిచేస్తున్న బాబు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఆయన మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన రీసెంట్‌గా ఇటీవల బాబు కుటుంబ సభ్యులను కలిశాడు. సదరు మేకప్ మ్యాన్ కుటుంబానికి రూ.10 లక్షల చెక్‌ను అందజేశారు. అంతేకాకుండా వారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని, ఏ సాయం కావాలన్నా చేస్తానని భరోసానిచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. రావు రమేశ్ గొప్ప మనస్సుకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
రావు రమేశ్ మాదిరిగానే ఇతర నటీ, నటులు కూడా తమ వద్ద పనిచేసే కళాకారులను, అసిస్టెంట్లకు మద్దతుగా ఉండాలని కోరుతున్నారు. రావు రమేశ్‌ను అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని కొనియాడుతున్నారు. ప్రస్తుతం రావు రమేశ్ చెక్ అందజేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అలనాటి సీనియర్ నటుడు రావు గోపాల్ రావు తనయుడిగా చిత్రసీమలోకి అడుగుపెట్టిన రావు రమేశ్.. విలక్షణ నటనతో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. విలన్‌గా, తండ్రిగా, సహాయ నటుడిగా, ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోతూ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటున్నారు. తాజాగా తన మేకప్ ఆర్టిస్ట్ కుటుంబానికి అండగా నిలిచి మరోసారి అభిమానుల మనస్సు గెలుచుకున్నారు.
సంబంధిత కథనం
టాపిక్