మన సత్తా ఏంటో చూపించారు: సౌత్‌ సినిమాలపై కరణ్‌ జోహార్‌-they completely told us how big our standard can be says karan johar on south directors ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మన సత్తా ఏంటో చూపించారు: సౌత్‌ సినిమాలపై కరణ్‌ జోహార్‌

మన సత్తా ఏంటో చూపించారు: సౌత్‌ సినిమాలపై కరణ్‌ జోహార్‌

HT Telugu Desk HT Telugu
May 22, 2022 05:29 PM IST

మూడు సౌత్‌ సినిమాలు హిందీ బెల్ట్‌లోనూ దుమ్మురేపడంతో బాలీవుడ్ vs సౌత్‌ సినిమా అన్న చర్చ మొదలైంది. దీనిపై తాజాగా బాలీవుడ్‌ బడా దర్శకనిర్మాత కరణ్‌ జోహార్‌ స్పందించాడు.

బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్
బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ (AFP)

మూడు సినిమాలు.. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2.. ఇండియన్‌ సినిమా చరిత్రనే తిరగరాశాయి. ఇండియన్‌ సినిమా అంటే బాలీవుడ్ ఒక్కటే కాదు అని నిరూపించాయి. వీటిలో రెండు సినిమాలు ఏకంగా రూ.1200 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి దుమ్మురేపాయి. దీంతో దేశమంతా బాలీవుడ్ vs సౌత్ సినిమా అన్న చర్చ మొదలైంది. నవాజుద్దీన్‌ సిద్ధిఖీలాంటి కొందరు సౌత్‌ సినిమాల సక్సెస్‌ను జీర్ణించుకోలేకపోతుంటే.. మరికొందరు మాత్రం దీనిని స్వాగతిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌ జోహార్‌ కూడా ఈ డిబేట్‌పై స్పందించాడు. జుగ్‌ జుగ్‌ జియో మూవీ ట్రైలర్‌ రిలీజ్‌ సందర్భంగా అతనితోపాటు ఈ మూవీ హీరో వరుణ్‌ ధావన్‌ కూడా సౌత్‌ సినిమాల సక్సెస్‌పై మాట్లాడాడు. బాక్సాఫీస్‌ దగ్గర హిందీ సినిమాలను వెనక్కి నెట్టి సౌత్‌ సినిమాలు భారీగా కలెక్షన్లు రాబడుతున్నాయి కదా.. దీనిపై మీరేమంటారు అని జర్నలిస్టులు కరణ్‌ను అడిగారు.

దీనిపై అతడు స్పందిస్తూ.. "మనమంతా ఇండియన్‌ సినిమాలో భాగం. అది ఆర్‌ఆర్‌ఆర్‌ కానీ, కేజీఎఫ్‌ కానీ, పుష్ప కానీ.. ఇండియన్‌ సినిమాను చూసి గర్వపడుతున్నాం. ప్రశాంత్‌ నీల్‌, రాజమౌళి, సుకుమార్‌లు మన సత్తా ఎంతో చేసి చూపించారు. అయితే హిందీ సినిమాలు కూడా ట్రాక్‌లోకి వస్తున్నాయి. గంగూబాయి కఠియావాడి సక్సెసైంది. భూల్‌ భులయ్యా 2 బాగానే నడుస్తోంది. జుగ్ జుగ్‌ జియో మూవీ కూడా సక్సెస్‌ అవుతుందని అనుకుంటున్నా" అని కరణ్ అన్నాడు.

అటు ఈ మూవీ హీరో వరుణ్‌ ధావన్‌ కూడా ఈ చర్చపై స్పందించాడు. "ఇలాంటివి దేశాన్ని ఏకం చేస్తాయి. దేశాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే సత్తా సినిమాకు ఉంది" అని వరుణ్‌ అనడం విశేషం. ఈ మూడు సౌత్‌ సినిమాల దెబ్బకు 83, జెర్సీ, అటాక్‌లాంటి బాలీవుడ్ సినిమాలు దారుణంగా ఫెయిలవగా.. తాజాగా వచ్చిన జయేష్‌భాయ్‌ జోర్దార్‌, ధాకడ్‌ సినిమాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్