Em Chesthunnav OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వ‌చ్చి హిట్ కొట్టిన తెలుగు కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?-telugu comedy movie em chesthunnav getting blockbuster response in etv win ott ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Em Chesthunnav Ott: ఓటీటీలోకి సైలెంట్‌గా వ‌చ్చి హిట్ కొట్టిన తెలుగు కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Em Chesthunnav OTT: ఓటీటీలోకి సైలెంట్‌గా వ‌చ్చి హిట్ కొట్టిన తెలుగు కామెడీ మూవీ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 26, 2024 12:17 PM IST

Em Chesthunnav OTT: విజ‌య్ రాజ్‌కుమార్ హీరోగా భ‌ర‌త్ మిత్ర ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఏం చేస్తున్నావ్ మూవీ ఇటీవ‌ల ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీ ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌తో హిట్ టాక్‌ను తెచ్చుకుంది.

ఏం చేస్తున్నావ్ మూవీ
ఏం చేస్తున్నావ్ మూవీ

Em Chesthunnav OTT: ప్ర‌స్తుతం థియేట‌ర్‌, ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదైనా కంటెంట్ కీల‌కంగా మారింది. సినిమా క‌థ బాగుంటే అందులోస్టార్స్ ఉన్నారా? కొత్త‌వాళ్లు న‌టించారా అనే భేదాలు లేకుండా ఆడియెన్స్ హిట్ చేస్తున్నారు. ఆ న‌మ్మ‌కాన్ని మ‌రోసారి ప్రూవ్ చేసింది ఏం చేస్తున్నావ్ మూవీ. ఇటీవ‌ల ఈటీవీ విన్ ఓటీటీలో సైలెంట్ గా రిలీజైన ఈ మూవీ తెలుగు ఆడియెన్స్‌ను మెప్పిస్తోంది. ఓటీటీలో హిట్ టాక్‌ను తెచ్చుకున్న‌ది.

విజ‌య్ రాజ్‌కుమార్ హీరో...

ఈ సినిమాలో విజ‌య్ రాజ్‌కుమార్‌, నేహా ప‌ఠాన్ హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఆమ‌ని, రాజీవ్ క‌న‌కాల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ న్యూఏజ్ కామెడీ మూవీకి భ‌ర‌త్ మిత్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో అంత‌ర్లీనంగా యూత్ ఎదుర్కొంటున్న ఓ స‌మ‌స్య‌ను వినోదాత్మ‌కంగా చూపించాడు డైరెక్ట‌ర్‌.

ఏం చేస్తున్నావ్ సినిమా ఓటీటీలో రికార్డ్ వ్యూస్‌ను సొంతం చేసుకుంటోంది. ఈటీవీ విన్ ఓ టీటీలో 90ఎస్ మిడిల్‌క్లాస్ వెబ్‌సిరీస్‌, వ‌ళ‌రి త‌ర్వాత హ‌య్యెస్ట్ వ్యూస్ ఏం చేస్తున్నావ్ ద‌క్కించుకున్న‌ట్లు చెబుతోనం్నారు. నవీన్ కురువ, కిరణ్ కురువ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీకి గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు.

యూత్ ఎలిమెంట్స్‌తో...

హీరో రాజ్‌ పెర్ఫార్మన్స్ కి మంచి ప్రసంశలు ద‌క్కుతున్నాయి. . యూత్ కి నచ్చే ఎలిమెంట్స్‌తో డైరెక్ట‌ర్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం చూస్తున్న యువ‌కులు అందరూ రిలేట్ అయ్యేలా డైలాగ్స్‌ని రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. చ‌దువు పూర్తిచేసుకొని త‌ల్లిదండ్రుల చెప్పిన‌ట్లుగా ఉద్యోగం చేయాలా? లేదంటే త‌న గోల్‌వైపు అడుగులు వేయాలో తెలియ‌ని క‌న్ఫ్యూజ‌న్‌లో ఉన్న ఓ యువ‌కుడి క‌థ‌తో ఏం చేస్తున్నావ్‌ మూవీ తెర‌కెక్కింది. అత‌డి జీవితంలోకి ఓ అమ్మాయి ఎలా వ‌చ్చింద‌న్న‌ది నాచ‌ర‌ల్ కామెడీతో ద‌ర్శ‌కుడు ఈ మూవీలో ఆవిష్క‌రించాడు.

ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా...

ఏం చేస్తున్నావ్‌ మూవీ స‌క్సెస్ మీట్‌ను ఇటీవ‌ల జ‌రిగింది. ఈ వేడుక‌లో ఈటీవి విన్ మార్కెటింగ్ హెడ్ నితిన్ మాట్లాడుతూ... ఫ్యామిలీ మొత్తం చూడాల్సిన సినిమా ఇది. ఏం చేస్తున్నావు సినిమా చూస్తున్నంత సేపు అస్సలు రీగ్రేట్ అవ్వరు. క‌థ‌, క‌థ‌నాలు, క్యారెక్ట‌ర్స్ అన్ని ప్ర‌తి ఒక్క‌రికి రిలేట్ అయ్యేలా ఉంటాయి. ప్రేక్షకులు రిలేట్ అయ్యే కంటెంట్ ఈరోజుల్లో చాలా తగ్గిపోయింది. ఆ లోటును ఈ మూవీ భ‌ర్తీ చేసింది అని అన్నాడు.

ఏడేళ్లు క‌ష్ట‌ప‌డి దాచుకున్న డ‌బ్బు...

డైరెక్టర్ భ‌రత్ మిత్ర మాట్లాడుతూ... ప్రొడ్యూస‌ర్ న‌వీన్ వ‌ల్లే ఏం చేస్తున్నావ్ మూవీ పూర్తిచేయ‌గ‌లిగాం. ఒక చిన్న ఊరులో బట్టలు కొట్టు పెట్టుకుని ఏడు సంవత్సరాలు క‌ష్ట‌ప‌డి దాచుకున్న డబ్బులతో ఈ సినిమా చేశారు. అనుకున్న బ‌డ్జెట్ దాటిపోవ‌డంతో టెన్ష‌న్ ప‌డ్డాం. ఆ టైమ్‌లోనే హేమంత్ టీంలోకి వచ్చాడు. . మేము అనుకున్న‌దానికంటే సినిమా పెద్ద విజ‌యాన్ని ఆనందంగా ఉంద‌ని అన్నాడు.

ఏం చేస్తున్నావ్ హీరోగా విజ‌య్‌రాజ్‌కు డైరెక్ట‌ర్ భ‌ర‌త్‌కు ఫ‌స్ట్ మూవీ కావ‌డం గ‌మ‌నార్హం. థియేట‌ర్ల‌ను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈ మూవీ ఓటీటీలోనే రిలీజైంది.

IPL_Entry_Point

టాపిక్