Horror Movie: హారర్ థ్రిల్లర్ డీమాంటీ కాలనీ 2తోపాటు 3, 4 సినిమాలు రానున్నాయి.. తమిళ హీరో అరుల్ నిధి
Arulnithi About Demonte Colony 2 Success: ఇటీవల తెలుగులో కూడా విడుదలై మంచి సక్సెస్ అందుకున్న తమిళ హారర్ మూవీ డీమాంటీ కాలనీ 2. ఈ నేపథ్యంలో తన సంతోషాన్ని తెలియజేశాడు తమిళ హీరో అరుల్ నిధి. ఈ క్రమంలోనే డీమాంటీ కాలనీ 3, 4 పార్ట్స్ కూడా ఉంటాయని అరుల్ నిధి తెలిపాడు.
Arulnithi About Demonte Colony 3, 4 Parts: హారర్ థ్రిల్లర్ "డీమాంటీ కాలనీ 2" సినిమాకు ఘన విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు తమిళ హీరో అరుల్ నిధి. ఆగస్ట్ 23న "డీమాంటీ కాలనీ 2" తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.
ఈ సినిమాను ఎన్ శ్రీనివాస రెడ్డి సమర్పణలో శ్రీ బాలాజీ ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్స్ బి సురేష్ రెడ్డి, బి.మానస రెడ్డి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. "డీమాంటీ కాలనీ 2" బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించిన నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో సంతోషాన్ని వ్యక్తం చేశారు హీరో అరుల్ నిధి.
- డిమాంటీ కాలనీ 2 సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చాలా సంతోషంగా ఉంది. తెలుగులో మా సినిమా స్కేల్‌తో చూస్తే చాలా పెద్ద సక్సెస్ ప్రేక్షకులు ఇచ్చారు. ఇక తమిళంలో మా సినిమా వండర్స్ క్రియేట్ చేస్తోంది. మాతో పాటు విక్రమ్ గారి తంగలాన్ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది.
- డీమాంటీ కాలనీ 2 సినిమాను తెలుగు ఆడియెన్స్ దగ్గరకు ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారు బాగా తీసుకెళ్లారు. తెలుగులో మంచి ప్రమోషన్ చేశారు. మా కంటే ఎక్కువగా మా సినిమాను ఆయన బిలీవ్ చేశారు. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన వల్లే తెలుగులో మా సినిమా ఇంత పెద్ద సక్సెస్ అందుకుంది. తెలుగులో సక్సెస్ సెలబ్రేషన్స్ చేసేందుకు సురేష్ రెడ్డి గారు మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారు. ఇక్కడ కొన్ని అనివార్యమైన పనులతో హైదరాబాద్ రాలేకపోయాం. త్వరలోనే హైదరాబాద్ వచ్చి సక్సెస్ మీట్ నిర్వహిస్తాం.
- డిమాంటీ కాలనీ 2 పర్పెక్ట్ సీక్వెల్ అనే పేరు వస్తోంది. డీమాంటీ కాలనీ 2తో పాటు 3, 4 సినిమాలు రాబోతున్నాయి. ఈ ఫ్రాంచైజీలో డీమాంటీ కాలనీ 3 బిగ్ స్పాన్ మూవీ అవుతుంది. ఎన్నో ట్విస్టు లు టర్న్‌లతో ఈ సినిమా ఉండబోతోంది. కొత్త కొత్త స్టోరీస్ , క్యారెక్టర్స్ డీమాంటీ కాలనీ 3లో యాడ్ అవుతాయి.
- డీమాంటీ కాలనీ 2 సక్సెస్ మాకు ఎంతో సంతృప్తినిచ్చింది. టెక్నికల్‌గా సామ్ సీఎస్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. రీ రికార్డింగ్ తర్వాత సినిమాలోని కంటెంట్ చాలా ఎఫెక్టివ్‌గా మారింది. సామ్‌కు థ్యాంక్స్ చెబుతున్నాం.
- ఈ సినిమాలో నేను ద్విపాత్రాభినయం చేశాను. శ్రీని క్యారెక్టర్ డీమాంటీ కాలనీ 1లో ఉన్నదే కంటిన్యూ అయింది. రఘు అనే క్యారెక్టర్ కొత్తగా యాడ్ చేశాం. రఘు క్యారెక్టర్ చాలా స్టైలిష్‌గా ఉంటుంది. తనొక బిగ్ ఆర్కిటెక్చర్. కాబట్టి స్టైల్‌గా ఉంటాడు. రిచ్ కిడ్ కాబట్టి కేర్ లెస్‌గా బిహేవ్ చేస్తుంటాడు.
- శ్రీని క్యారెక్టర్‌కు కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ రఘు. ద్విపాత్రాభినయం చేయడం కష్టమే. గతంలో నేను డ్యూయర్ రోల్ చేశాను. బాగా నటించాననే పేరొచ్చింది. డీమాంటీ కాలనీ 2కు మా డైరెక్టర్ అజయ్ మంచి స్క్రిప్ట్ చేశాడు.