Taapsee Pannu: నేనేం ప్రజల ఆస్తిని కాదు.. నాపై అరిస్తే ఊరుకోను.. హీరోయిన్ తాప్సీ షాకింగ్ కామెంట్స్
Taapsee Pannu About Fight With Photographers: తెలుగు హీరోయిన్ తాప్సీ తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను ప్రజల ఆస్తిని ఏం కాదని, తనపై అరిస్తే.. తాను కూడా అరుస్తానని, ఒకరు తనపై అరవడాన్ని ఈజీగా తీసుకోలేనని, ఊరుకోనని ఇటీవల ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో తాప్సీ పన్ను చెప్పుకొచ్చింది.
Taapsee Pannu Says I Am Not Public Property: తెలుగు సినిమాతో పరిచయమై బాలీవుడ్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతోంది బ్యూటిఫుల్ హీరోయిన్ తాప్సీ పన్ను. ఇటీవల ఫిర్ ఆయీ హసీన్ దిల్‌రూబా మూవీతో ఓటీటీలోకి వచ్చి అలరించింది. రొమాంటిక్ సీన్స్ చేసి బోల్డ్ హీరోయిన్ అనిపించుకుంది.
ఫొటోగ్రాఫర్స్‌తో గొడవ
అయితే, తాజాగా తాప్సీ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల ఏఎన్ఐ పాడ్‌కాస్ట్‌లో పాపరాజీలతో (సెలబ్రిటీ ఫొటోగ్రాఫర్స్) అయిన గొడవపై, నెగెటివ్ ట్రోలింగ్‌పై, పబ్లిక్ ఫిగర్‌గా ఉంటే వచ్చే సమస్యలపై రియాక్ట్ అయింది. తానేం పబ్లిక్ ప్రాపర్టీ కాదంటూ, తనపై అరిస్తే ఊరుకోనని తేల్చి చెప్పింది తాప్సీ.
"ఏం చేసిన సరే ట్రోలింగ్‌కు గురి కావడం ఖాయం అనే విషయాన్ని నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. కానీ, నేను నా జీవిత లక్ష్యం ఏంటో ఎంచుకున్నాను. ఇదే నా జీవితం (సినిమాలు). మనందరి జీవితాల్లోకి ఈ ట్రోలింగ్ అనేది వచ్చేసిందనే అనుకుంటున్నాను. ట్రోలింగ్ అవడానికి నేను కూడా ఒక సెలబ్రిటీనే అని భావిస్తున్నా" అని తాప్సీ తెలిపింది.
ఇక్కడ ఉండేదాన్ని కాదు
"ప్రజలు ఎప్పుడు నెగెటివిటీపైనే టైమ్ స్పెండ్ చేస్తుంటారు. సరే నేను కూడా వారికి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతున్నాను అని అనుకుంటాను. నేటి ట్రోలింగ్ చాలా కఠినంగా ఉన్నప్పటికీ ఇదివరకు ఒక నటుడి కెరీర్ నాశనం చేసే విధమైన విమర్శల అంత ప్రభావితంగా లేదు అని నా అభిప్రాయం. ఎవరు ఎవరి కెరీర్‌ను నాశనం చేయలేరు. లేకపోతే నేను ఇక్కడ ఉండేదాన్ని కాదు" అని తాప్సీ చెప్పుకొచ్చింది.
ఇక పాపరాజీలతో గొడవ గురించి తాప్సీ చెబుతూ.. "నేను పబ్లిక్ ఫిగర్‌ను. కానీ, పబ్లిక్ ప్రాపర్టీని కాదు. దీనిపై నాకు పూర్తి క్లారిటీ ఉంది. ఈ రెండింటికి మధ్య చాలా చాలా పెద్ద తేడా ఉంది. నువ్ నాపై అరిస్తే.. నేను కచ్చితంగా పడను. నేను కూడా అరుస్తాను. మీరు నాపైకి దూసుకురావడం, ఫిజికల్‌గా హ్యాండిల్ చేయడం అనేది కరెక్ట్ కాదు" అని తాప్సీ తెలిపింది.
చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి
అయితే, ఫొటోగ్రాఫర్స్ పరిధి దాటి ప్రవర్తించిన తీరును ఖండిస్తూ తాప్సీ ఈ కామెంట్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే తనపై వ్యక్తిగతంగా వచ్చే నెగెటివ్ మీడియా కథనాలపై తాప్సీ స్పందించింది. "నెగెటివ్ కథనాలు చాలా ఉత్తేజకరంగా ఉంటాయి. ఏం చెప్పింది. ఏం చేసింది అనే విషయాలు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి" అని తాప్సీ చెప్పింది.
ఎలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, తాప్సీ తన కెరీర్‌పై దృష్టి సారించేందుకే ప్రయత్నిస్తుంటాను అని తెలిపింది. "నేను చాలా కష్టపడుతున్నాను. ప్రతి చిత్రానికి నా చెమట, రక్తాన్ని చిందిస్తున్నాను. నేను ఏదైనా మంచి సినిమా చేశానని మీరు అనుకుంటే దయచేసి వచ్చి చూడండి" అని ఎమోషనల్‌గా మాట్లాడింది తాప్సీ.
అయితే, ఒక సినిమా కమర్షియల్‌గా విజయం సాధించనప్పటికీ, విమర్శకుల నుండి తనకు లభించే ప్రశంసలు, తన పని పట్ల తన నిబద్ధత ఎలా ప్రభావితం చేస్తుందనే విషయంపై తాప్సీ ఈ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.