Sunny Leone: సన్నీ లియోన్ తెలుగు రొమాంటిక్ హారర్ కామెడీ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్!
Sunny Leone: సన్నీలియోన్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ నవంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మందిర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్‌లోదయ్యంగా, యువరాణిగా రెండు డిఫరెంట్ గెటప్‌లో సన్నీలియోన్ కనిపించింది.
Sunny Leone: సన్నీ లియోన్ హీరోయిన్‌గా నటించిన తెలుగు మూవీ మందిర రిలీజ్ డేట్ ఫిక్సయింది. నవంబర్ 22న థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తమిళ మూవీ ఓ మై ఘోస్ట్‌కు డబ్బింగ్ వెర్షన్‌గా మందిర తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలో సతీష్, యోగిబాబు కీలక పాత్రలు పోషించారు. .
రొమాంటిక్ హారర్...
రొమాంటిక్ హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన మందిర మూవీకి ఆర్ యువన్ దర్శకత్వం వహించాడు. మందిర మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. హారర్ ఎలిమెంట్స్‌తో ఈ మూవీ ట్రైలర్ ప్రారంభమైంది. నేటి రాత్రి నిండు అమవాస్య...రాణి తప్పకుండా ఊళ్లోకి వస్తుంది...ఊళ్లో ఉన్న మగాళ్లందరి తాట తీస్తుందని ఓ మాత్రికుడు భయంగా చెప్పగానే...ఓ పెద్దాయన రాణి ఎన్నిగంటలకు వస్తుందని అడగటం నవ్వులను పంచుతోంది. సినిమా తీసేందుకు ఇద్దరు యువకుడు పడే కష్టాలు ట్రైలర్‌లో నవ్వులను పంచాయి.
రెండు డిఫరెంట్ రోల్స్‌లో...
ట్రైలర్‌లో దయ్యం రూపంలో సన్నీలియోన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మందిరారాణిగా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించింది. తన బలంతో పాటు అందచందాలతో రాజులను ఓడించే రాణిగా డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించింది.
మంచు విష్ణు జిన్నాలో...
మంచు మనోజ్ కరెంట్ తీగ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది సన్నీ లియోన్. మంచు విష్ణు జిన్నాలో ఓ హీరోయిన్‌గా నటించింది. రాజశేఖర్ పీఎస్‌వీ గరుడవేగ సినిమాలో స్పెషల్ సాంగ్‌లో నటించింది. సన్నీలియోన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ సినిమాలు కొటేషన్ గ్యాంగ్‌తో పాటు పెట్టరాప్ ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చాయి.
ఉపేంద్ర యూఐ…
పెట్టారాప్ మూవీ మంగళవారం నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం కన్నడంలో ఉపేంద్ర యూఐతో పాటు హిందీలో మూడు, మలయాళంలో రెండు సినిమాలు చేస్తోంది సన్నీలియోన్. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా కంటే ఎక్కువగా స్పెషల్ సాంగ్స్‌లోనే నటించింది సన్నీలియోన్. మందిర సినిమాకు జావెద్ రియాజ్ సంగీతం అందించారు. దీపక్ డి. మీనన్ కెమెరామెన్‌గా పని చేశారు. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద కొమ్మలపాటి శ్రీధర్ సమర్పణలో సాయి సుధాకర్ కొమ్మలపాటి మందిర మూవీని నిర్మించాడు.
టాపిక్