Hunt Pre Release Event: సుధీర్ బాబు హంట్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?-sudheer babu hunt pre release press meet on january 22nd at amb cinemas hyderabad ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hunt Pre Release Event: సుధీర్ బాబు హంట్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Hunt Pre Release Event: సుధీర్ బాబు హంట్‌ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

Hunt Pre Release Event: సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హంట్. ఈ సినిమాకు సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జనవరి 26న విడుదల కానుంది.

హంట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్

Hunt Pre Release Event: టాలీవుడ్ హీరో సుధీర్ బాబు నటించిన తాజా చిత్రం హంట్. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ ఇప్పటికే విడుదలై ప్రేక్షకుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. భవ్య క్రియేషన్స్ పతాకంపై చేస్తోన్న ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్‌గా రాబోతుంది. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా మరో సరికొత్త అప్డేట్ ఇచ్చింది. హంట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్ చేసింది.

సుధీర్ బాబు నటించిన హంట్ ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌కు జనవరి 22 ఆదివారం నాడు ఉదయం 9.30 గంటలకు నిర్వహించనున్నారు. హైదరాబాద్ ఏఎంబీ సినిమాస్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాపతో పైలం అనే పాట చిత్రంపై అంచనాలను భారీగా పెంచేశాయి. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఇది తెరకెక్కింది. హాలీవుడ్ చిత్రం జాన్ విక్ 4కు ఫైట్లు కంపోజ్ చేసిన రేనాడ్ ఫవెరో, బ్రయన్ విజయర్ ఈ సినిమా పోరాటాలు చిత్రీకరించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రాని సెన్సార్ టీమ్ యూ/ఏ సర్టిఫికేట్‌ను ఇచ్చింది.

ఈ సినిమాలో సుధీర్ బాబుతో పాటు శ్రీకాంత్, ప్రేమిస్తే ఫేమ్ భరత్, మంజుల ఘట్టమనేని, మైమ్ గోపి, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శ్రీ భవ్య క్రియేషన్స్ పతాకంపై వీ ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. జీబ్రాన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న సినిమా విడుదల కానుంది.

సంబంధిత కథనం