Skanda Worldwide Collection: రామ్ రాంపేజ్ - ఫ‌స్ట్ డే అంచ‌నాల్ని మించి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన స్కంద‌-skanda movie day 1 worldwide collections area wise details ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Worldwide Collection: రామ్ రాంపేజ్ - ఫ‌స్ట్ డే అంచ‌నాల్ని మించి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన స్కంద‌

Skanda Worldwide Collection: రామ్ రాంపేజ్ - ఫ‌స్ట్ డే అంచ‌నాల్ని మించి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన స్కంద‌

HT Telugu Desk HT Telugu

Skanda Worldwide Collection: రామ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన మూవీగా స్కంద నిలిచింది. గురువారం రోజు రిలీజైన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 18. 2 కోట్ల గ్రాస్‌, తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల షేర్‌ను రాబ‌ట్టింది.

రామ్ స్కంద

Skanda Worldwide Collection: స్కంద మూవీ తొలి రోజు భారీ క‌లెక్ష‌న్స్‌తో కుమ్మేసింది. అంచ‌నాల‌కు మించి వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఫ‌స్ట్ డే స్కంద మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 18. 2 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌గా తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న‌ది. తెలుగు రాష్ట్రాల్లో అత్య‌ధికంగా నైజాం ఏరియాలో 3.23 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. గురువారం రోజు సీడెడ్‌లో కోటి ఇర‌వై రెండు ల‌క్ష‌లు, వైజాగ్‌లో కోటి పంతొమ్మిది ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను రామ్ సినిమా రాబ‌ట్టింది.

గుంటూరులో కోటి నాలుగు ల‌క్ష‌ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకున్న‌ది. ఓవ‌రాల్‌గా తొలిరోజే తెలుగు రాష్ట్రాల్లో 8.62 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రామ్ కెరీర్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన మూవీగా స్కంద నిలిచింది. మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చిన కూడా సినిమాపై ఉన్న హైప్ కార‌ణంగా అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా జ‌రిగాయి. అందువ‌ల్లే సినిమా తొలిరోజు భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా స్కంద సినిమాను ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కించాడు.

ఈ సినిమాలో ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో రామ్ న‌ట‌న ఫ్యాన్స్‌ను మెప్పిస్తోంది. త‌న తండ్రి స్నేహితుడికి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు చేసిన అన్యాయంపై ఓ యువ‌కుడు ఎలా ప్ర‌తీకారం తీర్చుకున్నాడ‌న్న‌ది ఈ సినిమా క‌థ‌. స్కంద సినిమాలో శ్రీలీల‌, స‌యి మంజ్రేక‌ర్ హీరోయిన్లుగా న‌టించారు. శ్రీకాంత్‌, ప్రిన్స్‌, ద‌గ్గుబాటి రాజా కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాకు స్కంద 2 పేరుతో సీక్వెల్ తెర‌కెక్కించ‌బోతున్న‌ట్లు రామ్‌, బోయ‌పాటి శ్రీను ప్ర‌క‌టించారు.