Sthree Anthem: మహిళా శక్తిని చాటే మ్యూజికల్ ఆంథమ్ స్త్రీ.. 4 భాషల్లో రిలీజ్.. మాస్టారూ సాంగ్ సింగర్‌ గాత్రంతో!-singer swetha mohan sthree anthem on international womens day 2024 ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Singer Swetha Mohan Sthree Anthem On International Womens Day 2024

Sthree Anthem: మహిళా శక్తిని చాటే మ్యూజికల్ ఆంథమ్ స్త్రీ.. 4 భాషల్లో రిలీజ్.. మాస్టారూ సాంగ్ సింగర్‌ గాత్రంతో!

Sanjiv Kumar HT Telugu
Mar 09, 2024 12:10 PM IST

Swetha Mohan Sthree Anthem: మహిళల శక్తి, వారి సామార్థ్యాలను చాటి చెప్పేలా స్త్రీ మ్యూజికల్ ఆల్బమ్ త్వరలో రానుంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. సార్ సినిమాలోని మాస్టారు అనే పాట పాడిన ప్రముఖ గాయనీ శ్వేత మోహన్ ఈ సాంగ్‌ను తీసుకొస్తున్నారు.

మహిళా శక్తిని చాటే మ్యూజికల్ ఆంథమ్ స్త్రీ.. 4 భాషల్లో విడుదల.. మాస్టారూ సాంగ్ సింగర్‌తో!
మహిళా శక్తిని చాటే మ్యూజికల్ ఆంథమ్ స్త్రీ.. 4 భాషల్లో విడుదల.. మాస్టారూ సాంగ్ సింగర్‌తో!

Sthree Musical Anthem: మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల శక్తి, సామర్థ్యాలను చాటేలా ‘స్త్రీ’ అనే ఓ ఆల్బమ్ శ్రోతల ముందుకు తీసుకువచ్చారు. ప్రముఖ నేపథ్య గాయని శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్‌ కలిసి "స్త్రీ" అనే ప్రాజెక్ట్‌ను అందించారు. ఈ ఆల్బమ్ నాలుగు భారతీయ భాషలలో విడుదల అయింది. హిందీ, తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో వచ్చిన ఈ స్త్రీ ఆల్బమ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ ఆకట్టుకుంటోంది.

మణిరత్నం ‘బాంబే’, చిత్రంలో ‘కుచ్చి కుచ్చి కునమ్మా..’, ‘ఆడువారి మాటలకు ఆర్థాలే వేరులే..’ చిత్రంలో ‘చెలి చమకు..’ ధనుష్ ‘సార్’ చిత్రంలో ‘మాస్టరూ మాస్టరూ..’ ఆదిపురుష్ చిత్రంలో ‘ప్రియమిథునం..’, ‘నాసామిరంగ’ చిత్రంలో ‘ఇంకా ఇంకా దూరమే..’ సహా ఎన్నో చిత్రాలో వినసొంపైన పాటలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్నారు సింగర్ శ్వేతా మోహన్. ఇప్పుడు ఆమె మైత్రి శ్రీకాంత్ కలిసి చేసిన ఈ ఆల్బమ్ మహిళా సాధికారిత, స్త్రీతత్త్వం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తూ, సాధికారత సార్వత్రిక సందేశాన్ని ఇస్తుంది.

స్త్రీ జీవిత ప్రయాణంలో ఎదుర్కొనే పోరాటాలను తెలియజేసేలా మైత్రి శ్రీకాంత్ రాసిన కవిత 'హర్ కెలిడోస్కోప్' నుంచి ఈ ‘స్త్రీ’ని రూపొందించారు. "సామాజిక సమస్యలపై దృష్టిని తీసుకురావడానికి, మహిళల సాధికారతను తెలియజేయడానికి, మహిళా శక్తిని అందరికీ చాటేలా చేసేందుకు ఈ సంగీత ప్రయాణం తోడ్పడటం నాకు చాలా ఆనందంగా ఉంది" అని శ్వేతా మోహన్ చెప్పారు. ఈ గీతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో పాటు, మహిళలందరినీ ప్రతిబింబించేలా ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మహిళలకు భారతదేశం నుంచి ఇది నివాళిగా పేర్కొన్నారు. ఆడ పిల్లల సాధికారత, మద్దతు కోసం మేము కట్టుబడి ఉన్నాము. ఈ గీతం లింగ సమానత్వం కోసం పోరాడే శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుంది. అన్ని అసమానతలకు వ్యతిరేకంగా, వారి రంగాలలో అత్యున్నత స్థానానికి చేరుకున్న, దృఢ సంకల్పానికి ఉదాహరణగా నిలిచిన మహిళల అద్భుతమైన ప్రయాణాన్ని సెలెబ్రేట్ చేసేలా ఉంటుందని వారు అంటున్నారు.

" 'స్త్రీ' కేవలం ఒక పాట కాదు. ఇది ఒక ఉద్యమం, మహిళల అద్వితీయమైన ఆత్మ" అని రాగా సొసైటీ ప్రెసిడెంట్, వ్యవస్థాపకురాలు మైత్రి శ్రీకాంత్ ప్రకటించారు. "మహిళల ఆరోగ్యం, దేశ సంపద" అనే సూత్రాన్ని ఆలింగనం చేసుకుంటూ, ఈ గీతం మరొక మార్పుకు శక్తివంతమైన ఉత్ప్రేరకం అవుతుంది. ప్రతి స్త్రీ ప్రయాణంలో అంతర్లీనంగా ఉండే ఒడిదుడుకులు, వారి పోరాటాలను చూపించామని తెలిపారు.

"స్త్రీ, ది ఆంథమ్" శ్వేతా మోహన్ అధికారిక యూట్యూబ్ హ్యాండిల్‌లో విడుదల చేశారు. ఇది ప్రపంచ ప్రేక్షకులకు మహిళ స్ఫూర్తిదాయకమైన ప్రయాణం, సాధికారత సందేశాన్ని ఇవ్వనుంది.

శ్వేతా మోహన్ అత్యంత ప్రశంసలు పొందిన నేపథ్య గాయని, స్వరకర్త. 15 సంవత్సరాలకు పైగా కెరీర్‌తో, శ్వేత భారతీయ సంగీత పరిశ్రమకు గణనీయమైన కృషి చేశారు. ఈ ముఖ్యమైన ప్రాజెక్ట్‌కి తన మధురమైన గాత్రాన్ని అందించారు.

లీగల్ థింక్ ట్యాంక్ అయిన రాగా సొసైటీ వ్యవస్థాపకుడు, ప్రెసిడెంట్, మైత్రి శ్రీకాంత్ తన న్యాయ నైపుణ్యం, మహిళల హక్కుల పట్ల నిబద్ధతకు గుర్తింపు పొందారు. వేదిక వ్యవస్థాపకుడు, క్రియేటివ్ హెడ్‌గా భారతదేశ గొప్ప వారసత్వం, గ్రామీణ జీవనోపాధికి ఉద్వేగభరితంగా శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. జాతీయవాద స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఈ ఆంథమ్ ఉంటుంది. "స్త్రీ" అనేది శ్వేతా మోహన్, మైత్రి శ్రీకాంత్ ఆధ్వర్యంలో రూపొందించబడింది. స్త్రీ శక్తి కోసం పోరాడే వారంతా కూడా ఈ ప్రాజెక్ట్‌కి మద్దతు తెలియజేయాలని కోరారు.

WhatsApp channel