Singer Mangli : దాడి ఘటనపై క్లారిటీ ఇచ్చిన సింగర్ మంగ్లీ
Singer Mangli Viral News : తన కారు మీద దాడి జరిగిందని వచ్చిన వార్తలపై సింగర్ మంగ్లీ స్పందించింది. బళ్లారిలో ఓ కార్యక్రమంలో తన కారుపై దాడి అని జరిగిన ప్రచారంలో నిజం లేదని స్పష్టం చేసింది.
కర్ణాటక(Karnataka)లోని బళ్లారిలో బళ్లారి ఫేస్ట్ కు సింగర్ మంగ్లీ హాజరైంది. అయితే ప్రోగ్రామ్ అయిపోయాక తిరిగి వస్తుండగా.. ఆమె కారుపై దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై గాయని స్పందించింది. ఎలాంటి దాడి జరగలేదని స్పష్టం చేసింది. వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. తనపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా(Social Media) గ్రూపులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది.
బళ్లారి ఈవెంట్(Ballari Event) సక్సెస్ అయిందని, తాను చేసిన ఉత్తమ ఈవెంట్లలో ఇది ఒకటని మంగ్లీ తెలిపింది. కన్నడ ప్రజలు(Kannada People) తనపై అపారమైన ప్రేమను చూపించారని చెప్పుకొచ్చింది. కార్యక్రమంలో తనను బాగా చూసుకున్నారని వెల్లడించింది. తన ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలా చేస్తున్నారని ట్వీట్ చేసింది.
బళ్లారి ఉత్సవ్ కు మంగ్లీ హాజరైంది. శనివారం రాత్రి కారుపై దాడి జరిగిందని వార్తలు వచ్చాయి. బళ్లారి(bellary) మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో సింగర్ మంగ్లీ(Singer Mangli) పాల్గొంది. కార్యక్రమం అయిపోయాక.. వేదిక నుంచి తిరిగి వెళ్లేప్పుడు కార్యక్రమానికి వచ్చిన కొంతమంది ఆమె కారుపై రాళ్లతో దాడి చేశారని వార్తలు వైరల్ అయ్యాయి.
బళ్లారి ఉత్సవం (బళ్లారి ఫెస్టివల్) అట్టహాసంగా మెుదలైంది. రెండు రోజుల ఉత్సవాన్ని మంత్రి శ్రీరాములు ప్రారంభించారు. ఉత్సవంలో సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొదటి రోజు ఉత్సవంలో సింగర్ మంగ్లీ, కొంతమంది గాయకులు పాల్గొన్నారు. శాండిల్ వుడ్ ప్రముఖ యాంకర్ అనుశ్రీ(Anchor Anushree), సంగీత దర్శకుడు అర్జున్ బృందం కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.
'రాబర్ట్' సినిమా ద్వారా కన్నడ ప్రేక్షకులకు పరిచయం అయింది మంగ్లీ. జోగి ప్రేమ్ దర్శకత్వంలో 'ఏక్ లవ్ యా' చిత్రం తర్వాత కన్నడలో వరుసగా పాటలు పాడే అవకాశాలు వస్తున్నాయి. 'పుష్ప' సినిమా(Pushpa Movie) ఊ అంటావా మామ పాటను కన్నడలో మంగ్లీనే పాడింది.