Shruti Haasan Furious: మెంటల్‌ థెరపిస్ట్‌కు చూయించుకోండి: శృతి హాసన్‌ సీరియస్‌-shruti haasan furious over reports of her facing mental health issues ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan Furious: మెంటల్‌ థెరపిస్ట్‌కు చూయించుకోండి: శృతి హాసన్‌ సీరియస్‌

Shruti Haasan Furious: మెంటల్‌ థెరపిస్ట్‌కు చూయించుకోండి: శృతి హాసన్‌ సీరియస్‌

Hari Prasad S HT Telugu
Jan 13, 2023 12:13 PM IST

Shruti Haasan Furious: మెంటల్‌ థెరపిస్ట్‌కు చూయించుకోండి అంటూ తనపై పుకార్లకు కారణమైన రిపోర్టులపై శృతి హాసన్‌ సీరియస్‌ అయింది. తాను వాల్తేర్‌ వీరయ్య మెగామాస్‌ ఈవెంట్‌కు ఎందుకు రాలేకపోయానో వివరిస్తూనే పుకార్లపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

వాల్తేర్ వీరయ్య మూవీలో చిరంజీవి, శృతిహాస‌న్‌
వాల్తేర్ వీరయ్య మూవీలో చిరంజీవి, శృతిహాస‌న్‌

Shruti Haasan Furious: టాలీవుడ్‌లో ఒకేసారి రెండు సంక్రాంతి సినిమాల్లో మెరిసింది శృతి హాసన్‌. ఈ బ్యూటీ ఇటు బాలకృష్ణ వీర సింహా రెడ్డి, అటు చిరంజీవి వాల్తేర్‌ వీరయ్య సినిమాల్లో ఫిమేల్‌ లీడ్‌గా కనిపించిన విషయం తెలిసిందే. ఇద్దరు టాప్‌ హీరోలతో నటించిన సినిమాలు ఒకేసారి రిలీజ్‌ కావడం, అది కూడా సంక్రాంతికి రావడంతో శృతి చాలా ఆనందంగా ఉంది.

yearly horoscope entry point

అయితే అదే సమయంలో తన ఆరోగ్యంపై పుకార్లు రావడంతో ఆమె అసహనం వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా వైజాగ్‌లో జరిగిన వాల్తేర్‌ వీరయ్య మెగామాస్‌ ఈవెంట్‌కు రాకపోవడంపై ఎన్నో పుకార్లు వచ్చాయి. శృతి మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వల్లే రాలేదని కూడా వార్తలు వచ్చాయి. వీటిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా చేసింది.

తన మానసిక ఆరోగ్యం బాగా లేదంటూ కొన్ని సైట్లలో వచ్చిన వార్తలను షేర్‌ చేస్తూ.. ఆమె ఓ నోట్‌ రిలీజ్‌ చేసింది. నేను కాదు మీరు ముందు మెంటల్‌ థెరపిస్ట్‌లకు చూపించుకుంటే మంచిది అని కూడా ఈ సందర్భంగా శృతి అనడం విశేషం.

"బాగా ట్రై చేశారు. నేను నా వైరల్‌ ఫీవర్‌ నుంచి కోలుకుంటున్నాను. కానీ ఒక విషయం. ఇలాంటి తప్పుడు వార్తలు, మానసిక ఆరోగ్యాన్ని ఏదో పెద్దదిగా చేసి చూపించడంలాంటి వాటి వల్ల చాలా మంది దాని గురించి పబ్లిగ్గా మాట్లాడలేకపోతున్నారు. కానీ ఇది పని చేయదు. నేనెప్పుడూ మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడతాను. నా గురించి నేను అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటాను. నాకు అప్పుడు వైరల్‌ ఫీవర్‌ ఉండింది. బాగా ట్రై చేశారు. ఇలాంటివి పక్కన పెట్టి కాస్త మీరు కూడా థెరపిస్ట్‌కు చూపించుకుంటే మంచిది" అంటూ కాస్త ఘాటుగానే శృతి కౌంటర్ ఇచ్చింది.

శృతి హాసన్‌ నటించిన వీర సింహా రెడ్డి గురువారం (జనవరి 12), వాల్తేర్‌ వీరయ్య శుక్రవారం (జనవరి 13) రిలీజైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు పాజిటివ్‌ టాకే వచ్చింది. ముఖ్యంగా వీర సింహారెడ్డి తొలి రోజు కలెక్షన్లు బాలయ్య కెరీర్‌లో అత్యధికం కావడం విశేషం.

Whats_app_banner

సంబంధిత కథనం