Veera Simha Reddy Day 1 Collection: అఖండను అధిగమించిన వీరసింహారెడ్డి.. బాలయ్య కెరీర్‌లోనే అత్యధికం..!-here balakrishna veera simha reddy day 1 box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Here Balakrishna Veera Simha Reddy Day 1 Box Office Collection

Veera Simha Reddy Day 1 Collection: అఖండను అధిగమించిన వీరసింహారెడ్డి.. బాలయ్య కెరీర్‌లోనే అత్యధికం..!

వీరసింహారెడ్డి
వీరసింహారెడ్డి

Veera Simha Reddy Day 1 Collection: బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. ఈ సినిమాకు అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. విడుదలైన తొలి రోజు ఈ చిత్రం రూ.50 కోట్ల మార్కును అందుకున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఇందులో రూ.32 కోట్ల నెట్ వసూళ్ల ఉన్నట్లు తెలుస్తోంది.

Veera Simha Reddy Day 1 Collection: నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మన బాలయ్య.. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాకుండా వసూళ్ల పరంగానూ అదిరిపోయే ఓపెనింగ్స్ అందుకుంది. విడుదలైన మొదటి రోజే అన్ని చోట్లా అదిరిపోయే వసూళ్లను దక్కించుకుంది.

ట్రెండింగ్ వార్తలు

వీరసింహారెడ్డి నైజాం, సీడెడ్, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్ర అన్ని చోట్లా అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తొలి రోజే అన్ని ప్రదేశాల్లో కలిపి మొత్తం రూ.50 కోట్ల గ్రాస్‌ను(రూ.32 కోట్ల నెట్) అధిగమించినట్లు గురువారం సాయంత్రం జరిగిన సక్సెస్ మీట్‌లో మేకర్స్ తెలిపారు. దీంతో బాలయ్య గత చిత్రం అఖండ తొలిరోజు రికార్డును(రూ.25 కోట్లు) వీరసింహారెడ్డి అధిగమించినట్లయింది. బాలకృష్ణ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్‌కు అభిమానులే కాకుండా సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అవుతన్నారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రానికి మెరుగైన వసూళ్లు వస్తున్నాయి. ఈ సినిమా అమెరికాలో ఒక్కరోజే 708,000 డాలర్ల వసూళ్లను అందుకున్నట్లు అంచనా. త్వరలోనే మిలియన్ డాలర్లను అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. వీరసింహారెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో ఆక్యూపెన్సీ కూడా 62.72 శాతంగా ఉంది. జనవరి 11న విడుదలైన వారిసు, తునివు రెండు కలిపి(రూ.28 కోట్లు నెట్) కూడా వీరసింహారెడ్డి వసూళ్లను అధిగమించలేదు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ కథానాయికగా చేసింది. తమన్ సంగీతాన్ని సమకూర్చారు. స్టార్ రైటర్ సాయి మాధవ్ బుర్రా ఈ చిత్రానికి డైలాగ్స్ అందించగా.. నవీన్ నూలి ఎడిటర్‌గా పనిశారు. ఈ చిత్రానికి ఫైట్ మాస్టార్లుగా రామ్-లక్ష్మణ్ పనిచేశారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

సంబంధిత కథనం