Waltair Veerayya Twitter Review: మెగా-మాస్ కాంబోకు జైకొట్టిన ఫ్యాన్స్.. వాల్తేరు వీరయ్య ఎలా ఉందంటే?
Waltair Veerayya Twitter Review: మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా శుక్రవారం వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు ట్విటర్ వేదికగా తమ స్పందనను తెలియజేస్తున్నారు.
Waltair Veerayya Twitter Review: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఘనంగా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా ఉదయం నుంచే తెలుగు రాష్ట్రాల్లో సందడి షూరూ అయింది. అభిమానులు థియేటర్ల కటౌట్లు, ఈలలు, గోలలతో సంక్రాంతి పండగ వాతావరణం ముందే మొదలైంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షో ఉదయాన్నే మొదలైంది. సినిమా చూసిన అభిమానులు, ప్రేక్షకులు తమ స్పందనను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు.
ఈ సినిమాకు చాలా చోట్ల పాజిటివ్ టాక్ వస్తోంది. ట్విటర్ వేదికగా అభిమానులు తమ హీరో సినిమా అదిరిపోయిందని స్పందిస్తున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత ఆ రేంజ్ మాస్ ఎలివేషన్ ఇందులోనే ఉందని ఓ యూజర్ స్పందించగా.. నిజమైన సంక్రాంతి సక్సెస్ వాల్తేరు వీరయ్యకే దక్కుతుందని మరొకరు పోస్ట్ పెట్టారు.
సినిమా ఎలా ఉందంటున్నారంటే..
మెగాస్టార్ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో ఆయన ఇంట్రో అదిరిపోయిందని అంటున్నారు. ఫస్టాఫ్ కామెడీగా సాగిందని, అనంతరం ఇంటర్వెల్‌లో ఓ రేంజ్ ఎలివేషన్లు ఉన్నాయని చెబుతున్నారు. పాటలు కూడా ఫర్వాలేదనిపించాయని స్పందిస్తున్నారు. ఇక సెకాండాఫ్ విషయానికొస్తే మాస్ మహారాజా రవితేజ ఎంట్రీ అదిరిపోయిందని, వీరి కాంబినేషన్ సూపర్‌గా ఉందని అంటున్నారు. ఇదే సమయంలో క్లైమాక్స్ మాత్రం అనుకున్న స్థాయిలో లేదని ట్వీట్లు పెడుతున్నారు.
మరోపక్క కొంతమంది మిక్స్ డ్ ఫీడ్ బ్యాక్ కూడా ఇస్తున్నారు. ఈ సినిమా రొటీన్ రీవేంజ్ డ్రామాగా ఉందని అంటున్నారు. ఇంట్రో, ఇంటర్వెల్, క్లైమాక్స్ మూడు కూడా ఎలివేషన్ తప్పా ఎమోషన్ లేదని స్పష్టం చేశారు. ముఖ్యంగా దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ తేలిపోయిందని అంటున్నారు. మెగాస్టార్, మాస్ మహారాజా కాంబో వచ్చిన ఈ సినిమా నేపథ్య సంగీతం అనుకున్న స్థాయిలో పండలేదని స్పష్టం చేశారు.
మొత్తానికి ఈ సినిమాపై ఎక్కువ మంది పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుండగా.. కొంతమంది మాత్రం మిక్స్ డ్ టాక్‌గా చెబుతున్నారు. అయితే మెగాస్టార్ స్టామినాకు సినిమాపై ఓపెనింగ్స్ మాత్రం భారీగా ఉండేలా ఉన్నాయి. ఇప్పటికే చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్‌ను సులభంగా సాధించేలా ఉంది.
బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
సంబంధిత కథనం