Dasara Movie Update: సంక్రాంతికి ‘దసరా’ అప్డేట్.. లుక్ మార్చిన నాని..!-nani and keerthy suresh wrapped up dasara movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dasara Movie Update: సంక్రాంతికి ‘దసరా’ అప్డేట్.. లుక్ మార్చిన నాని..!

Dasara Movie Update: సంక్రాంతికి ‘దసరా’ అప్డేట్.. లుక్ మార్చిన నాని..!

Maragani Govardhan HT Telugu
Jan 08, 2024 09:37 PM IST

Dasara Movie Update: నేచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన తాజా చిత్రం దసరా. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. నాని, కీర్తి సురేష్ ఈ మూవీ షూటింగ్ పూర్తి చేశారు. త్వరలోనే చిత్రబృందం అదిరిపోయే అప్డేట్ ఇవ్వనుంది.

నాని-కీర్తి సురేష్
నాని-కీర్తి సురేష్

Dasara Movie Update: నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందుతోన్న చిత్రం దసరా. ఈ సినిమా ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ముఖ్యంగా నాని రగడ్‌ లుక్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇందులో హీరోయిన్‌గా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా డీ గ్లామరస్ లుక్‌లో కనిపించింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.

దసరా సినిమాకు సంబంధించి నానితో పాటు, కీర్తి సురేష్ తమ షూటింగ్‌ను పూర్తి చేసుకున్నారు. ఈవ విషయాన్ని చిత్రబృందం ట్విటర్ వేదికగా తెలియజేసింది. "ధరణి, వెన్నెల షూటింగ్ పూర్తయింది. దసరా కోసం నాని, కీర్తి సురేష్ భాగం పూర్తయింది. త్వరలోనే ఎగ్జయిటింగ్ అప్డేట్ రాబోతుంది." అంటూ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

అంతేకాకుండా నాని కూడా తన లుక్‌ను మార్చారు. గడ్డంతో కనిపించిన ఆయన షేవ్ చేసుకుని స్మార్ట్ బాయ్‌గా కనిపించారు. కీర్తి సురేష్ కూడా తన సాధారణ రూపానికి మారింది. దీంతో వీరిద్దరూ తమ ఫొటోలను షేర్ చేశారు.

అయితే మేకర్స్ ప్రకటించినట్లు ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ ఏంటా? అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం దసరా టీజర్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సంక్రాంతి కానుకగా దసరా మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చే అవకాశముంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రం పీరియాడికల్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కింది. సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నేచురల్ స్టార్ నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రంలో సముద్రఖని కీలక పాత్ర పోషించారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా పాన్ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని 2023 మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.