Shriya on Salaar and OG: సలార్ కంటే పవన్ కల్యాణ్ ఓజీ చాలా గొప్పగా ఉంటుంది: శ్రియా రెడ్డి-shriya on salaar and og says the pawan kalyan movie is much bigger than salaar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shriya On Salaar And Og: సలార్ కంటే పవన్ కల్యాణ్ ఓజీ చాలా గొప్పగా ఉంటుంది: శ్రియా రెడ్డి

Shriya on Salaar and OG: సలార్ కంటే పవన్ కల్యాణ్ ఓజీ చాలా గొప్పగా ఉంటుంది: శ్రియా రెడ్డి

Hari Prasad S HT Telugu
Dec 26, 2023 06:54 PM IST

Shriya on Salaar and OG: సలార్ కంటే పవన్ కల్యాణ్ ఓజీ చాలా గొప్పగా ఉంటుందని చెప్పింది నటి శ్రియా రెడ్డి. తాజాగా సలార్ మూవీలో నటించిన ఆమె.. ఓజీలోనూ నటిస్తోంది.

ఓజీ మూవీలో పవన్ కల్యాణ్
ఓజీ మూవీలో పవన్ కల్యాణ్

Shriya on Salaar and OG: టాలీవుడ్‌కు 16 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన నటి శ్రియా రెడ్డి తాను తాజాగా నటించిన సలార్, రాబోయే మూవీ ఓజీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. సలార్ కంటే ఓజీ చాలా గొప్పగా ఉంటుందని ఆమె అనడం విశేషం. సలార్ మూవీలో శ్రియా రెడ్డి.. రాధా రామ మన్నార్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

2006లో శర్వానంద్ సరసన నటించిన అమ్మ చెప్పింది మూవీలో కనిపించిన శ్రియా రెడ్డి.. 16 ఏళ్ల తర్వాత ఇప్పుడు సలార్ లో మరో ముఖ్యమైన పాత్ర పోషించింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీలో నటిస్తోంది. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ రెండు సినిమాలపైనా స్పందించింది. సలార్ కంటే ఓజీ చాలా గొప్పగా ఉండబోతోందని ఆమె అనడం విశేషం.

ఓజీ మూవీ ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతోంది. ఇక ఇదే ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తో కలిసి నటించడంపైనా శ్రియ స్పందించింది. పవన్ కు ఉన్న పాపులారిటీ తనను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలిపింది. ఏ ఇతర నటుడికీ ఈ స్థాయిలో అభిమానులు లేరని ఆమె అనడం విశేషం. పవన్ చాలా మంచి మనసున్న వ్యక్తని చెప్పింది.

ఓజీ కోసం డైరెక్టర్ సుజీత్ ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్ చేసినట్లు తెలిపింది. ఈ సినిమాలో తన పాత్రకు ఎలాంటి నెగటివ్ షేడ్స్ ఉండబోవని స్పష్టం చేసింది. ఈ సినిమా కోసం ఓ అద్భుతమైన స్టోరీ రూపొందించిన డైరెక్టర్ సుజీత్ కు థ్యాంక్స్ చెప్పింది. ఈ సినిమాను తొలి రోజే ఫ్యాన్స్ తో కలిసి చూడటానికి తాను ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపింది.

సలార్ సినిమాలో ముఖ్యమైన పాత్ర పోషించిన శ్రియ రెడ్డి.. 16 ఏళ్ల తర్వాత ఓ తెలుగు సినిమాలో కనిపించింది. గతేడాది సుడల్ అనే తమిళ వెబ్ సిరీస్ లోనూ ఆమె నటించింది. మరోవైపు పవన్ కల్యాణ్ ఓజీ మూవీపై ఎంతో ఆసక్తి నెలకొంది. పవన్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి గ్లింప్స్ కూడా రిలీజైంది. ఓజస్ గంభీరా అనే పాత్రలో పవన్ నటిస్తున్నాడు.

IPL_Entry_Point