Ghost Teaser: ‘ఘోస్ట్’ టీజర్ వచ్చేసింది.. అంచనాలను భారీగా పెంచేసింది.. విస్కీతో పానీపూరీ!-shiva rajkumar starrer ghost the big daddy teaser released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ghost Teaser: ‘ఘోస్ట్’ టీజర్ వచ్చేసింది.. అంచనాలను భారీగా పెంచేసింది.. విస్కీతో పానీపూరీ!

Ghost Teaser: ‘ఘోస్ట్’ టీజర్ వచ్చేసింది.. అంచనాలను భారీగా పెంచేసింది.. విస్కీతో పానీపూరీ!

Chatakonda Krishna Prakash HT Telugu
Jul 12, 2023 02:39 PM IST

Ghost Teaser: కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న ఘోస్ట్ సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయింది. పవర్‌ఫుల్‍గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది.

ఘోస్ట్ టీజర్
ఘోస్ట్ టీజర్

Ghost: కన్నడ సీనియర్ యాక్టర్, స్టార్ హీరో శివరాజ్ కుమార్ ప్రస్తుతం ఘోస్ట్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఆయన గ్యాంగ్‍స్టర్ పాత్రలో నటిస్తున్నాడు. కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఫుల్ యాక్షన్ థ్రిల్లర్‌గా పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందుతోంది. శ్రీని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కరుణడ చక్రవర్తి శివరాజ్ కుమార్.. ఈ చిత్రంలో గ్యాంగ్‍స్టర్‌గా చేస్తుండటంతో అభిమానుల్లో అంచనాలు చాలా భారీగా ఉన్నాయి. కాగా, నేడు శివరాజ్ కుమార్ బర్త్ డే అవడంతో చిత్రయూనిట్ ఘోస్ట్ సినిమా టీజర్ రిలీజ్ చేసింది. ‘బిగ్ డాడీ’ అంటూ తీసుకొచ్చిన ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా, యాక్షన్ ప్యాక్డ్‌గా ఉంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. టీజర్ ఎలా ఉందంటే..

గ్యాంగ్‍స్టర్ డెన్‍లా ఉండే ఓ ఫ్యాక్టరీ లాంటి భవనం.. ఘోస్ట్ టీజర్ ప్రారంభంలో కనిపిస్తుంది. ఆ భవనాన్ని కొందరు తుపాకులు పట్టుకొని చుట్టుమడతారు. ఆ భవనంలో హీరో శివరాజ్ కుమార్ కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతుంటాడు. ముందు విస్కీ బాటిల్, గ్లాస్ ఉంటుంది. అక్కడే ఉండే పూరీని విస్కీ గ్లాసులో ముంచుకొని.. పానీపూరీలా తింటాడు హీరో. అప్పుడు తుపాకులతో వచ్చిన వారు.. శివరాజ్ కుమార్ ముందుకు వచ్చి కదలొద్దు అంటారు. విస్కీని వెనుక ఉన్న క్లాత్‍కు వేసి మంట పెడతాడు శివరాజ్ కుమార్. ఆ క్లాత్ కాలిపోయి.. యుద్ధ ట్యాంకర్ కనిపిస్తుంది. “మీరు గన్‍తో ఎంత మందిని భయపెట్టారో.. అంతకంటే ఎక్కువ మందిని నా కళ్లతో భయపెట్టాను. వాళ్లు నన్ను ఓజీ అంటారు. ఒరిజినల్ గ్యాంగ్‍స్టర్” అనే డైలాగ్‍తో ఈ టీజర్ ముగుస్తుంది. ఘోస్ట్ టీజర్‌లో శివరాజ్ కుమార్ స్టైల్ సూపర్‌గా ఉంది.

మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జయ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఘోస్ట్ టీజర్‌కు మరో హైలైట్‍గా ఉంది. సందేశ్ ప్రొడక్షన్ బ్యానర్‌పై సందేశ్ నాగరాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. జయరామ్, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జోయిస్, సత్యప్రకాశ్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు.

ఘోస్ట్ సినిమాను ఈ ఏడాది దసరాకు విడుదల చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. కన్నడలో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లోనూ రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‍తో పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రానుంది.

IPL_Entry_Point