Kantha Rao Centenary Celebrations: అద్దె ఇంట్లో ఉంటున్న కాంతారావు కుమారులు.. సాయం కోసం ఎదురుచూపులు
Kantha Rao Centenary Celebrations: సీనియర్ నటుడు కాంతారావు కుమారులు సాయం కోసం చూస్తున్నారు. ఆయన శత జయంతి వేడుకల సందర్భంగా మాట్లాడిన వారు ఎమోషనల్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం తమకు కనీసం ఓ ఇల్లు అయినా కేటాయించాలని అడుగుతున్నారు.
Kantha Rao Centenary Celebrations: పౌరాణిక సినిమాలు చేయాలంటే అది ఎన్‌టీఆర్, సాంఘీక చిత్రాలకు ఏఎన్నార్, జానపద చిత్రాలకు కాంతారావు అని తెలుగు ప్రేక్షకులు సగర్వంగా చెప్పుకుంటారు. తమ చిత్రాలతో తెలుగు నాట అభిమానుల ఆదరాభిమానాలను అందుకున్నారు. కాంతారావు విషయానికొస్తే.. కొన్ని వందల చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. ఒకప్పుడు ఎన్‌టీఆర్, ఏఎన్నార్‌తో సమానంగా గుర్తింపుతెచ్చుకున్న కాంతారావు కుటుంబం ఇప్పుడు సాయం కోసం ఎదురుచూస్తోంది. ఆయన కుమారులు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు.
హైదరాబాద్ రవీంద్రభారతిలో జరిగిన కాంతారావు శత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన కుమారులు ఈ సందర్భంగా తమ పరిస్థితిని మీడియా ద్వారా తెలియజేశారు. తన చిత్రాలతో తెలుగు చిత్రసీమకు ఎనలేని సేవ చేసిన తన తండ్రి ఎంత పేరు తెచ్చుకున్నారు.. ఆర్థికంగానూ అంతగా నష్టపోయారని తెలిపారు. ఆస్తులు అమ్ముకుని మరీ సినిమాలు తీశారని, ఫలితంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయారని స్పష్టం చేశారు. కాంతారావు క్యాన్సర్ బారినపడినప్పుడు కూడా చికిత్స కోసం ఎంతో డబ్బు ఖర్చు చేశామని, ప్రస్తుతం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని అన్నారు.
ఒకప్పుడు మద్రాసులో బంగ్లాలో ఉన్న మేము ఇప్పుడు నగరానికి దూరంగా ఓ అద్దె ఇంట్లో ఉంటున్నామని తెలిపారు. సినీ పరిశ్రమ నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని, చాలా మంది ఆదుకుంటామని చెప్పారు.. కానీ చేసింది మాత్రం ఏం లేదని అన్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వాన్ని తాము కోరుకునేది ఒక్కటేనని, దయచేసి తమకు ఓ ఇల్లు లేదా కనీసం కాస్త భూమి అయినా కేటాయించి సాయం చేసి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం
టాపిక్