Bigg Boss Elimination | నాలుగో వారం హౌస్ నుంచి సరయు ఔట్!
బిగ్‌బాస్ నాన్ స్టాప్ షోలో ఈ వారం ఎలిమినేట్ అయిందో ఎవరో తెలిసిపోయింది. ఈ సారి సెవెన్ ఆర్ట్స్ సరయు హౌస్ నుంచి వెళ్లిపోయినట్లు సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
బుల్లితెరపై సూపర్ డూపర్ హిట్ అందుకున్న షో బిగ్‌బాస్. ప్రస్తుతం ఓటీటీ వేదికగా నాన్‌స్టాప్ ప్రసారమవుతున్న ఈ షో రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. 24 గంటల పాటు లైవ్ స్ట్రీమింగ్ వస్తున్న ఈ షో ఆకట్టుకుంటోంది. ఫిబ్రవరి 26న ప్రారంభమైన 17 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో నుంచి ఇప్పటికి ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ముమైత్ ఖాన్, శ్రీరాపాక, ఆర్జే చైతూ ఇంటి నుంచి బయటకు వచ్చారు. తాజాగా నాలుగో కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే సమయం ఆసన్నమైంది.
ఇప్పటికే హోస్ట్ నాగార్జునతో వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. అయితే బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంత ప్రయత్నించినప్పటికీ లీకులు బెడద మాత్రం తప్పడం లేదు. ఇంటి నుంచి ఎవరు వెళ్లిపోయారనే విషయంపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో లీకులు వచ్చేశాయి. ఈ సారి ప్రముఖ యూట్యూబర్ సరయు బిగ్‌బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ కానుందని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటి వరకు వచ్చిన లీకులన్నీ నిజమవుతూనే వచ్చాయి. కాబట్టి ఇప్పుడు సరయు ఎలిమినేట్ అయిన వార్త వాస్తవమేనని ప్రచారం జరుగుతోంది. నిజానికి నాలుగో వారంలో ఛాలెంజర్స్ నుంచి ఒకరు బయటకు వస్తారని భావించారు. పెద్దగా పాపులారిటీ లేని అనీల్, మిత్రా శర్మల్లో ఎవరో ఒకరు బయటకు రావడం గ్యారెంటీ అని అనుకున్నారు. కానీ సోషల్ మీడియా లీకులను బట్టి చూస్తుంటే సరయు వచ్చేసిందని తెలుస్తోంది.
అయితే ఇటీవల కాలంలో సరయు నుంచి మంచి పర్ఫార్మెన్స్ వచ్చింది. ఇప్పటికే మూడు సార్లు కెప్టెన్సీ కంటెండర్‌గా పోటీ పడింది. ఇటీవల నటరాజ్ మాస్టర్‌తో జరిగిన టాస్క్‌లో కూడా అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మరి అలాంటిది సరయు ఎందుకు ఎలిమినేట్ అయిందో అర్థం కావడం లేదు. ఇదొక్క వారమే బిగ్‌బాస్ నిర్వాహకులు కొన్నిసార్లు షాకింగ్ కలిగించే ఎలిమినేషన్లు చేస్తున్నారు. నాలుగో సీజన్‌లో కుమార్ సాయి, ఐదో సీజన్‌లో యాంకర్ రవి.. ప్రస్తుతం జరుగుతున్న ఓటీటీ షోలో ఆర్జే చైతూ.. ఇలా ఎవరూ ఊహంచని వ్యక్తులను హౌస్ నుంచి బయటకు పంపుతున్నారు. సరయు పర్ఫార్మెన్స్ చేస్తోన్న సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లడం కొంచెం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఎందుకంటే అనిల్, మిత్రా శర్మ లాంటి ఫాలోయింగ్ లేని కంటెస్టెంట్లు ఉన్నారు. వీరే కాదు.. అఖిల్‌తో దోస్తీ మినహా స్రవంతి కూడా పెద్దగా చేసిందేమి లేదు. ఈ సారి మాత్రం వారియర్స్ నుంచి ఇద్దరిని, ఛాలెంజర్స్ నుంచి ఇద్దరిని పంపి.. ఓ లెక్క ప్రకారం వెళ్తున్నట్లు కనిపిస్తోంది.
గత సీజన్‌లో ఎంట్రీ ఇచ్చిన సరయు.. మొదటి వారంలోనే ఎలిమినేట్ అయింది. ఈ సారి కూడా ఫస్ట్ వీక్‌లో ముమైత్ ఖాన్‌తో కలిసి చివరి వరకు ఉంది. అప్పుడు ఎమోషన్‌ను ఆపుకోలేకపోయింది. కానీ ఎలాగో మొదటి వారం గండం తప్పించుకుంది. చివరకు నాలుగో వారం ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే ఆదివారం నాడు ప్రసారమైన ఎపిసోడ్ కోసం వేచి ఉండాల్సిందే.
సంబంధిత కథనం
టాపిక్